ధనియాలు డల్

 

07-12-2021

గతవారం దక్షిణ భారత్లో గిరాకీ తక్కువగా ఉండడంతో ధనియాల ధర రూ. 150-200 మరియు వాయిదా ధరలు రూ. 400-500 ప్రతిక్వింటా లుకు తగ్గాయి. లభించిన సమాచారం ప్రకారం రాజస్తాన్, మధ్య ప్రదేశ్, గుజ రాత్ లలో విస్తీర్ణం గత ఏడాదితో పోలిస్తే తగ్గడంతో ప్రస్తుతం స్టాకిస్టులు నెమ్మదిగా సరుకు విక్రయిస్తున్నారు. అయితే, పొంగల్ పండుగ కోసం డిసెంబర్ రెండవ వారం నుండి గిరాకీ వచ్చే అవకాశముంది. ఎన్ సిడి ఇఎ క్స్ సోమవారం డిసెంబర్ వాయిదా రూ.8722 తో ప్రారంభమైన తరువాత శుక్రవారం వరకు రూ.402 తగ్గి రూ. 8320, జనవరి వాయిదా రూ. 524 తగ్గి రూ. 8406తో ముగిసింది.


రాజస్తాన్ లోని రాంగంజ్ మండీలో గతవారం 12-15 వేల బస్తాల రాబడి పై బాదామీ రూ. 7300-7400, ఈగల్ రూ. 7800-8000, స్కూటర్ రూ.8300-8400, ధనియాల పప్పు బాదామీ రూ. 7800, ఈగల్ రూ. 8300 ప్రతిక్వింటాలు లోకల్ లూజు మరియు ప్రతి 40 కిలోలు లారీ బిల్టీ బాదామీ రూ. 3500, ఈగల్ రూ. 3700 ధరతో వ్యాపారమయింది.


కోటాలో గతవారం దాదాపు 5 వేల బస్తాలు, బారన్లో 4-5 వేలు, భవానీమండీ, ఛబ్జా, ఇటావా ప్రాంతాల మార్కెట్లలో కలిసి 7-8 వేల బస్తాల రాబడి పై బాదామీ రూ. 7200-7400, ఈగల్ రూ. 7500-7800 ప్రతిక్వింటాలు ధరతో క్వాలిటీ ప్రకారం వ్యాపారమయింది.


మధ్యప్రదేశ్లోని గునాలో గత వారం 7-8 వేల బస్తాలు మరియు కుంభరాజ్లో 2-3 వేల బస్తాలు రాబ డిపై బాదామీ రూ. 7000-7500, ఈగల్ రూ. 7700-8000, స్కూటర్ రూ. 8200-8300 మరియు 

నీమచ్లో 4-5 వేల బస్తాల రాబడిపై నాణ్య మైన బాదామీ రూ.7300-7400, మీడియం రూ. 6700-7000,నాణ్యమైన ఈగల్ రూ.8000 8200, మీడియం రూ. 7600 -7900 లోకల్ లూజు మరియు 

మందసోర్లో రూ.6500- 7500 ధరతో క్వాలిటీ ప్రకారం వ్యాపారమ యింది.

 గుజరాత్లోని గోండల్ లో దినసరి 6-7 వేల బస్తాల రాబడిపై ఈగల్ రూ. 7600-7800, సన్నరకం రూ. 8100-8200,

 రాజ్కోట్లో 300-400 బస్తాల రాబడిపై ఈగల్ రూ. 7500-7750, స్కూటర్ రూ. 7800-8000 మరియు జూనాఘ డ్లో క్లీన్ ఈగల్ రూ. 8000, స్కూటర్ రూ.8500 ధరతో వ్యాపారము యింది. 

ఒంగోలులో నిల్వ అయిన పాత బాదామీ ప్రతి 40 కిలోల బస్తా లారీ బిల్జీ రూ. 3750, ఈగల్ కొత్త రూ. 3800, స్కూటర్ కొత్త రూ. 3925, ఎసి సరుకు రూ. 3725, గుజ రాత్ సరుకు రూ. 3700, రాజస్తాన్ సరుకు రూ.3800, ధనియాల పప్పు రూ. 3400-3500 తమిళనాడు డెలి వరీ ధరతో వ్యాపారమయింది.

Comments

Popular posts from this blog