భారీగా యాలకుల రాబడులు

 

06-12-2021

దేశంలో ప్రముఖ యాలకుల ఉత్పాదక ప్రాంతమైన దక్షిణ భారత యాలకుల వేలం కేంద్రాల వద్ద నవంబర్ 29 నుండి డిసెంబర్ 4 వరకు వారంలో యాలకుల రాబడులు గత వారంతో పోలిస్తే 8,35,268 నుండి 3.10 లక్షల కిలోలు పెరిగి 11,45,316 కిలోలు సరుకు రాబడి అయింది. ఇందులో 10,28,423 కిలోల సరుకు విక్రయించబడింది. సోమవారం కనిష్ఠ ధర రూ. 1093.17 నుండి రూ. 100 తగ్గి శుక్రవారం 992.38 కు చేరగా శనివారం రూ. 10 వృద్ధి చెంది రూ. 1002.59 ప్రతి కిలో ధరతో అమ్మకమైంది. 


ఈ ఏడాది గణనీయమైన ఉత్పత్తితో పాటు కొత్త సీజన్ మిగులు నిల్వలతో ప్రారంభమైనందున ధరలకు మద్దతు లభించడంలేదు. తద్వారా ఉత్పాదకులు తమ సరుకు విక్రయించేందుకు ఆసక్తి కనబరచడంలేదు. దిగ్గజ వ్యాపారులు సైతం సరుకుల వ్యాపారం చేసే వ్యాపారులతో కూడా నిల్వ చేయిస్తున్నారు. ధరలు వృద్ధి చెందడంలేదు. గ్వాటేమాలలో త్వరలో కొత్త సీజన్ ప్రారంభం కానున్నది. ప్రపంచంలోని పలు దేశాలలో ఒమిక్రాన్ విజృంభిస్తున్నందున గ్వాటిమాలతో పాటు భారత్ నుండి యాలకుల ఎగుమతులు స్తంభించగలవు. ఇలాంటి పరిస్థితులలో స్టాకిస్టులు నష్టాలను మూటగట్టుకునే అవకాశం ఉంది. గత సోమవారం వేలంలో 2.42 లక్షల కిలోలు, బుధవారం 2.34 లక్షల కిలోలు, శుక్రవారం 2.15 లక్షల కిలోల సరుకు రాబడి అయింది.

Comments

Popular posts from this blog