రికార్డు స్ధాయిలో మిరప సేద్యం - వర్షాలతో పంటకు నష్టం - గత వారం ధరలు

 

05-12-2021

వ్యాపారస్తుల కథనం ప్రకారం మధ్య ప్రదేశ్లోని అన్ని ఉత్పాదక కేంద్రాలలో కలిసి గతవారం 1.25 లక్షల బస్తాలకు పైగా మిరప రాబడిపై మర ఆడించే యూనిట్ల డిమాండ్తో  ధరలు హెచ్చుముఖంలో ఉన్నాయి. ఇందుకు ముఖ్య కారణమేమనగా, ఆంధ్రలో తరచుగా వస్తున్న తుఫానుల నేపథ్యంలో భారీ వర్షాల వలన పంటకు నష్టం చేకూరడంతో పాటు చీడపీడల బెడద వలన దిగుబడి తగ్గే అవకాశం ఉండడంతో పాటు మహారా ష్ట్రలోని బుల్జానా, చిక్లీ, డొండాగాంవ్ ప్రాంతాలలో 15 రోజులలో రాబడులు సమాప్తమయ్యే అవకాశం ఉంది. మరియు నందూర్ బార్, బుర్హాన్పూర్ తదితర ప్రాంతాలు, గుజరాత్లలో భారీ వర్షాల వలన పంటకు నష్టం చేకూరడంతో అలాగే రాబడులు ఆలస్యం కావడంతో మిరప వ్యాపారులు అప్రమత్తమయ్యారు. నాణ్యమైన సరుకు కోసం డిమాండ్ తో పోలిస్తే సరఫరా తక్కువగా ఉండడంతో ధరలు హెచ్చుముఖంలో ఉన్నాయి.


మధ్య ప్రదేశ్ లోని బేడియాలో ఆది, బుధ, గురు మరియు శనివారాలలో 4 రోజులలో కలిసి 80-90 వేల బస్తాల కొత్త సరుకు రాబడిపై

 మహీ ఫూల్కట్ రూ. 11000-12600,

 తొడిమతో రూ. 7000-9500, 

లాల్ కట్ రూ. 6500-7000, 

ఫూల్కట్ తాలు రూ. 4500-5500, 

తొడిమతో తాలు రూ. 3500-4500 

మరియు

 ఇండోర్ లో ఈ వారంలో 15–17 వేల బస్తాల రాబడిపై 

మహీ తొడిమతో రూ. 9000-11500,

 మీడియం రూ.5500-6500, 

తొడిమతో రూ. 7000-9000, 

తాలు రూ. 3500-4500, 

ధామనోద్లో శుక్రవారం 20-22 వేల బస్తాల రాబడిపై 

మహీ రకం రూ. 8500-9500,

 720 రకం రూ. 13000-14500, 

తొడిమలేకుండా రూ. 12000 -13500, 

మీడియం రూ. 8000 -9000,

 తాలు రూ. 4000–5000 ప్రతిక్వింటాలు ధరతో వ్యాపారమయింది.

 లభించిన సమాచారం ప్రకారం కర్నూలు, ఎమ్మిగనూరు ప్రాంతా లలో కురుస్తున్న వర్షాల వలన పంటకు భారీ నష్టం వాటిల్లింది. దీనితో సంక్రాంతి తరువాతనే కొత్త నాణ్యమైన సరుకు రాబడి అయ్యే అవకాశం కలదు మరియు ఈ ప్రాంతాల నుండి ప్రస్తుతం సీడ్ రకాలు మరియు తాలు మిరప రాబడులు అధికంగా ఉన్నాయి. గతవారం గుంటూరు మార్కెట్ యార్డులో కోల్డుస్టోరేజీల నుండి 2.70 లక్షల బస్తాల రాబడిపై గుంటూరు ఎసి సరుకు 1.10 లక్షల బస్తాలు మరియు పరిసర ప్రాంతాల ఎసి సరుకు 40 వేల బస్తాలు కలిసి 1.50 లక్షల బస్తాల సరుకు అమ్మకమయింది. మరియు తేజ ఎక్స్ట్రా ర్డినరీ 137 బస్తాలు రూ. 16000 ధరతో వ్యాపారమయింది. గుంటూరులో తేజ డీలక్స్, ఎక్స్ ట్రార్డినరీ రకాలు రూ. 800, బ్యాడ్డీ 355 రకం రూ. 1800, సింజెంటా బ్యాడ్డీ రూ. 1500, డిడి, 341 రకాలు రూ. 800, రోమి, నెం.5, 334, సూప ర్-10 రకాలు రూ. 1000, 4884, ఆర్మూరు, 577 రకాలు రూ. 500, 273, బంగారం రకాలు రూ. 700, అన్ని మీడియం, మీడియం బెస్ట్ రకాలు రూ.600, తేజ తాలు, తాలు రూ. 400 ప్రతిక్వింటాలుకు పెరిగాయి. 

అన్ని డీలక్స్ రకాల ధరలు పెరుగుతున్నాయి, మరోవైపు ఆంధ్ర, తెలంగాణా మొద లగు రాష్ట్రాలలో నల్లి తెగులు ప్రభావం అధికంగా ఉండడంతో పాటు భారీ వర్షాల వలన మిరప పంటకు నష్టం చేకూరుతున్నది. దీనితో దిగుబడి తగ్గే అవకాశం ఉండడంతో స్టాకిస్టులు తమ సరుకు విక్రయించడానికి బదులుగా కోల్డుస్టోరేజీలలో నిల్వ ఉంచడానికి ప్రాధాన్యతనిస్తున్నారు. గుంటూరులో 23 వేల బస్తాల కొత్త మిరప రాబడిపై 15 వేల బస్తాల సరుకు అమ్మకమయింది. గుంటూరు కోల్డు స్టోరేజీలలో నిల్వ అయిన

 నాణ్యమైన తేజ రూ. 13200-14800, 

డీలక్స్ రూ. 14900-15000, 

ఎక్స్ ట్రార్డి నరీ రూ. 15100 -15200, 

మీడియం బెస్ట్ రూ. 11500-13000,

 మీడియం రూ. 10,000–11,400, 

బ్యాడీ - 355 రకం రూ. 15000–18800,

 డీలక్స్ రూ. 18900-19000,

 సింజెంటా బ్యాడ్లీ రూ. 11000-15000, 

డీలక్స్ ఎక్స్ ట్రార్డినరీ రూ. 15100-15300, 

డిడి రూ. 12000-16000,

 డీలక్స్ రూ. 16100-16300,

 నెం.5 రకం రూ. 12000-15000, 

డీలక్స్ రూ. 15100-15200,

 273 రూ. 11500-14200,

 334 మరియు సూపర్-10 రకం రూ. 11000-13000,

 డీలక్స్ రూ. 13100-13200, 

ఎక్స్ ట్రార్డినరీ రూ. 13300–13500, 

మీడియం బెస్ట్ రూ. 10000-10900, 

మీడియం రూ. 80009900, 334 

మరియు సూపర్ -10 గత ఏడాది సరుకు రూ. 9000-12000, 

4884 రకం రూ. 10000-12700, 

రోమి రకం రూ. 11000-13500, 

ఆర్మూరు రకం రూ. 10000-12500, 

డీలక్స్ రూ. 12600-12700,

 577 రకం రూ.11500-14000, 

డీలక్స్. 14100-14200, 

బంగారం రకం రూ. 10000-12500, 

డీలక్స్ రూ. 12600-12700, 

మీడియం మరియు మీడియం బెస్ట్ సహా అన్ని సీడ్ రకాలు రూ. 10000-11800, 

తేజ తాలు రూ. 7000-8300,

 తాలు రూ.3500-7000 

మరియు కర్నూలు, ఎమ్మిగనూరు, ప్రకాశం ప్రాంతాల నుండి గుంటూరులో 23-25 వేల బస్తాల కొత్త మిరప రాబడిపై 15 వేల బస్తాల అమ్మకంపై 

తేజ రూ. 12500-15000, 

నాణ్యమైన డిడి రూ. 12000-14000, నాణ్యమైన సీడ్ రకం ధరతో క్వాలిటీ ప్రకారం వ్యాపారమయింది. 

వరంగల్లో గతవారం 35-40 వేల బస్తాల ఎసి సరుకు రాబడిపై

 తేజ రూ. 11000-14350, 

వండర్ హాట్ రూ. 12000-15300, 

341 రకం రూ. 11000-15000, 

డిడి రూ. 12000-14300, 

1048 రకం రూ. 11000-13000, 

టమోటా రూ. 16000-19000, 

తాలు రూ. 4000-6000 

మరియు 35-40 వేల బస్తాల కొత్త మిరప రాబడిపై

 తేజ రూ. 12000-12600, 

341 రకం రూ. 13200-13500 ధరతో వ్యాపారమయింది. 

ఖమ్మంలో గతవారం 45 వేల బస్తాల ఎసి సరుకు రాబడిపై నాణ్యమైన 

తేజ రూ. 1000, మీడియం రూ. 14000-14500, 

తాలు రూ.6500

 మరియు బుధ వారం 50 బస్తాల కొత్త మిరప రాబడిపై తేజ రూ. 13000 ధరతో వ్యాపారమయింది.

 హైదరాబాద్ కోల్డుస్టోరేజీలలో నిల్వ అయిన నాణ్యమైన తేజ రూ. 13000-14000, మీడియం రూ. 12000-13000, నాణ్యమైన సూపర్-10 రూ.11500-13000, మీడియం రూ. 10000-10500, తేజ తాలు రూ. 6000-6500, హైబ్రిడ్ తాలు రూ. 3500-4000 

మరియు కర్నూలు ప్రాంతం నుండి 5-6 వేల బస్తాల కొత్త సరుకు రాబడిపై తేజ రూ. 11000-14000, బ్యాడ్డీ రూ. 13000-17000, సింజెంటా రూ. 11000-15000, 341 రకం రూ. 8000-12000, 273 రకం రూ. 8000-11000, డిడి రూ. 7000-11500, నాణ్యమైన తేజ తాలు రూ. 8000, మీడియం రూ. 3000-7000, హైబ్రిడ్ తాలు రూ. 1000-3000 ధరతో క్వాలిటీ ప్రకారం వ్యాపారమయింది.

 కర్నాటకలోని బ్యాడిగిలో సోమ, గురువారాలలో కలిసి 50-51 వేల బస్తాల కొత్త మిరప రాబడిపై నాణ్యమైన 5531 రకం రూ. 10500-13500, మీడియం రూ.8000-9000, 2043 రకం రూ. 17000–19000, జిటి రూ. 9000-10000, తాలు రూ. 4500-5500, నిమ్ము రకం తాలు రూ. 3500-4000 మరియు 25-27 వేల బస్తాల ఎసి సరుకు రాబడిపై 15-16 వేల బస్తాల సరుకు అమ్మకం కాగా, నాణ్యమైన డబ్బీ డీలక్స్ రూ. 27000–30200, మీడియం రూ.23000-26000, కెడిఎల్ డీలకూ. 23000-26000, మీడియం రూ.20000-22000, 2043 డీలక్స్ రూ. 18500-22500, మీడియం రూ.16000-18000, 5531 రకం రూ. 11500–14500, తాలు రూ. 4500-5500 మరియు 

సింధనూరులో మంగళ వారం 3 వేల బస్తాల కొత్త మిరప రాబడిపై సింజెంటా బ్యాడ్జీ రూ. 9000-11000, 5531 రకం రూ. 8000-13000 మరియు 1500-2000 బస్తాల ఎసి సరుకు అమ్మకంపై సింజెంటా రూ. 16000-18000, జిటి రూ. 10000-12000, 5531 రకం రూ. 10000-13500, తాలు రూ. 3000-5000 ధరతో వ్యాపారమయింది. 

ఛత్తీస్గడ్ లోని జగదల్పూర్లో శుక్రవారం 100 బస్తాల కొత్త మిరప రాబడిపై తేజ రూ. 10000-13500 మరియు సోమవారం నుండి శుక్రవారం వరకు 5-6 వేల బస్తాల ఎసి సరుకు అమ్మకంపై తేజ మరియు సన్ రూ. 11000-14000, 4884 రకం రూ. 10000-12500, తేజ తాలు రూ. 7000-8000 ధరతో వ్యాపారమయింది.

Comments

Popular posts from this blog