పెరిగిన బెల్లం రాబడులు - కొనుగోళ్లు తగ్గుదల

 

05-12-2021

దక్షిణాది రాష్ట్రాలలో ఇటీవల కురిసిన కుండపోత వర్షాలు మరియు ఒడిశ్శాతో పాటు తూర్పు ఆంధ్రప్రదేశ్లో తుపాను హెచ్చరికల నేపథ్యంలో బెల్లం తయారీ నిలిచిపోయింది. అయితే, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, తమిళనాడుల నుండి బెల్లం సరఫరా జోరందుకోవడంతో పాటు ఇప్పటి వరకు స్టాకిస్టుల కొనుగోళ్లు ప్రారంభం కానందున ధరలు ప్రభావితం చెందాయి. ఉత్తర ప్రదేశ్లోని ముజఫర్ నగర్ లో గత వారం 25-30 వేల బస్తాల కొత్త బెల్లం రాబడిపై 40 కిలోలు చాకూ బెల్లం రూ. 1100-1170, కురుపా రూ. 1100-1110, లడ్డు బెల్లం రూ. 1200-1240, పౌడర్ బెల్లం రూ. 1200, రస్కట్ రూ. 980-1040 మరియు హాపూర్లో 115–120 వాహనాల కొత్త బెల్లం రాబడి కాగా రూ. 1070-1100 ధరతో వ్యాపారమైంది.


మధ్య ప్రదేశ్లోని కరేలిలో గత వారం 35-40 వాహనాలు సరుకు రాబడిపై రూ. 2600-2750, 

నర్సింగ్పూర్లో గురువారం 35-40 వాహనాలు రూ. 2600-2800, 

మహారాష్ట్రలోని సాంగ్లీలో గత వారం 20-25 వేల దిమ్మలు రాబడి కాగా, సురభి రకం రూ.3500 - 3600, ఎరుపు రకం రూ.3250-3350, గుజరాత్ రకం రూ. 3600-3750, 

సోలాపూర్లో 4-5 వేల దిమ్మలు నాణ్యమైన సరుకు రూ. 3300-3400, మీడియం రూ. 2850-2900,

 లాతూరులో 7-8 వేల దిమ్మలు నాణ్యమైన సరుకు రూ.3400-3500, మీడియం రూ.2950-3000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. 

కర్నాటకలోని మార్కెట్లలో గత వారం 60-70 వాహనాల సరుకు రాబడిపై ఎరుపు రకం రూ. 3200, సింగల్ ఫిల్టర్ రూ. 3300, డబుల్ ఫిల్టర్ రూ. 3400, చదరాలు రూ. 3550-3600, 

మహాలింగపూర్లో 15-20 వాహనాలు సురభి రకం రూ. 3450-3500, 5 కిలోల బిల్టి బెల్లం రూ. 3500-3550, 1 కిలో దిమ్మలు రూ. 3600-3650, అరకిలో ముక్కలు రూ. 3700, 250 గ్రాముల ముక్కలు రూ. 3850,

 శిమోగాలో 18-20 వాహనాలు దేశీ బెల్లం రూ.3600-3650 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపార మైంది.

 ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లిలో గత వారం 4-5 వేల దిమ్మల కొత్త బెల్లం గులాబీ రకం రూ.3600-3700, మీడియం రూ. 3300-3400, నలుపు రూ. 3100-3150 మరియు 

చిత్తూరులో 15-20 వాహనాల ఎసి సరుకు రాబడిపై సురభి రకం రూ. 3900-4000, సూపర్-ఫైన్ రూ. 4500-4600, సాట్నా రకం రూ.3600-3700, నలుపు రూ. 3100 ధరతో వ్యాపారమైంది. 

హైదరాబాద్ మార్కెట్లో దిమ్మల బెల్లం రూ. 3800 3900, చదరాలు రూ.4300-4400, సాంగ్లీ ప్రాంతం 1 కిలో దిమ్మలు రూ. 4200-4300, అరకిలో ముక్కలు రూ. 4300-4400, ఉత్తరప్రదేశ్ ప్రాంతం లడ్డు బెల్లం రూ.3500-3600 ధరతో వ్యాపారమైంది.

 తమిళనాడులోని సేలంలో గత వారం 10-12 వేల బస్తాల బెల్లం రాబడి కాగా, ధర రూ. 80-100 పతనమై తెలుపు 30 కిలోలు రకం రూ.1310-1320, సురభి రకం సరుకు రూ. 1280 -1300, ఎరుపు రకం రూ. 1260 - 1280 మరియు పిలకలపాల యంలో 5 వేల బస్తాలు తెల్ల బెల్లం రూ. 1260-1280, సురభి రకం రూ. 1240-1260 ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog