రబీలో తగ్గిన పెసర విస్తీర్ణం

 

19-12-2021

గత నెలలో పెసల ధరలలో ఎక్కువగా హెచ్చుతగ్గులు చోటుచేసుకోనందున రైతులు పంట వేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపకపోవడంతో రబీ సీజన్ కోసం పంట విత్తడంలో వేగం పుంజుకోలేదు. 17, డిసెంబర్ వరకు దేశంలో విస్తీర్ణం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 1.36 లక్షల హెక్టార్ల నుండి తగ్గి 96000 హెక్టార్లకు చేరింది. ఇందుకు ముఖ్య కారణమేమనగా, రైతులు నూనెగింజలు, ముతకధాన్యాల సాగుకు మొగ్గుచూపుతున్నారు. 


నెల్లూరు ప్రాంతంలో జనవరి నుండి రాబడి అయ్యే సన్న పెసలకు వర్షాల వలన నష్టం వాటిల్లింది. అయితే, పశ్చిమబెంగాల్లోని కాలియా గంజ్ మరియు అస్సాంలలో పంట మెరుగ్గా ఉంది. కాని, చిన్న పంట కారణంగా ఈ ధరలపై ఉండదు. గతవారం గిరాకీ తక్కువగా ఉన్నందున 

రాజస్తాన్లోని కేకీ, మెడతా, పాలీ, సుమేరప్పూర్, కిషన్డ్ ప్రాంతాలలో దినసరి 15 వేల బస్తాల రాబడిపై రూ. 5500-6300, నాణ్యమైన లావు రకం రూ. 6700-6800, 

శ్రీగంగానగర్ లో రూ. 5500-6800, 

జైపూర్లో రూ. 6000-6800, పప్పు రూ. 7400-8400, మిటుకులు రూ. 6600-7400, 

మధ్య ప్రదేశ్ లోని పిపరియా, హరదా, జబల్ పూర్ ప్రాంతాలలో రూ. 5250-6750, 

ఇండోర్లో రూ.6600-7000 ధరతో క్వాలిటీ ప్రకారం వ్యాపారమయింది. 

ప్రస్తుతం ఢిల్లీ ప్రాంతం నుండి పంజాబ్ కోసం పెసరపప్పుకు మంచి డిమాండ్ ఉంది. 

పొన్నూరులో సాదా పెసలు రూ. 6900, పాలిష్ రూ. 7100, 

విజయవాడలో నాణ్యమైన పప్పు రూ. 9200, మీడియం రూ. 8800, 

ఖమ్మంలో పప్పు సార్టెక్స్ రూ. 8900, నానార్టెక్స్ రూ. 8500, 

కర్నాటకలోని కలుబరిగి, సెడెం, గదగ్, యాద్గిర్ ప్రాంతాలలో రూ. 6000-7000, 

మహారాష్ట్ర మార్కెట్లలో నాణ్యమైన సరుకు రూ.6000-6500, మీడియం రూ. 4500-5000, 

అకోలాలో పెసలు రూ. 6700-6800, పెసలు మోగర్ రూ. 8900-9000, జల్గాంట్లో మధ్య ప్రదేశ్ సరుకు రూ. 6500, 

మహారాష్ట్ర నాణ్యమైన సరుకు రూ. 6800-6900, మీడియం రూ. 6600 ధరతో వ్యాపారమయింది.

Comments

Popular posts from this blog