పెరిగిన శనగ విస్తీర్ణం - వర్షాల వలన నాణ్యతపై ప్రభావం
Get link
Facebook
X
Pinterest
Email
Other Apps
-
07-12-2021
ప్రస్తుత సీజన్లో 1, డిసెంబర్ వరకు దేశంలో శనగ విస్తీర్ణం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 80.01 లక్షల హెక్టార్లతో పోలిస్తే పెరిగి 81.43 లక్షల హెక్టార్లకు చేరింది. ఇందులో
రాజస్తాన్లో విస్తీర్ణం 18.05 లక్షల హెక్టార్ల నుండి పెరిగి 18.46 లక్షల హెక్టార్లకు చేరగా,
కర్నాటకలో 9.62లక్షల హెక్టార్ల నుండి 9.80 లక్షల హెక్టార్లకు,
ఉత్తరప్రదేశ్లో 5.53 లక్షల హెక్టార్ల నుండి 5.63 లక్షల హెక్టార్లకు,
మహారాష్ట్రలో 13.63 లక్షల హెక్టార్ల నుండి 14.19 లక్షల హెక్టార్లకు,
గుజరాత్లో 5.33 లక్షల హెక్టార్ల నుండి 6.51 లక్షల హెక్టార్లకు చేరింది.
అయితే,
మధ్య ప్రదేశ్లో 20.42 లక్షల హెక్టార్ల నుండి తగ్గి 20.02 లక్షల హెక్టా ర్లకు,
ఆంధ్రప్రదేశ్లో 2.94 లక్షల హెక్టార్ల నుండి 2.72 లక్షల హెక్టార్లకు,
ఛత్తీస్ఘడ్ 2.22 లక్షల హెక్టార్ల నుండి 1.36 లక్షల హెక్టార్లకు చేరింది.
కాని, వ్యాపారస్తుల కథనం ప్రకారం ఆంధ్ర, కర్నాటక, తెలంగాణలలోని అనేక ప్రాంతాలలో అకాల వర్షాల వలన పంటకు నష్టం చేకూరడంతో పాటు కర్నూలు, కడప, చిత్తూరు మరియు సరిహద్దులో గల కర్నాటక ప్రాంతాలలో రైతులు తిరిగి తిరిగి పంట విత్తవలసి ఉంటుంది. వీరు దీని స్థానంలో ఇతర పంటల సాగు చేపట్టే అవకాశం కలదు.
ఎందుకనగా, సీజన్ ప్రారంభమైన తరువాత శనగల ధర మద్దతు ధర కంటే తక్కువగా ఉంది. ఆంధ్రలో స్టాకిస్టులు అధిక ధరను ప్రతిపాదించడంతో తమిళనాడులోని మిల్లర్లు ప్రస్తుతం టాంజానియా నుండి దిగుమతి అయిన శనగలు ట్యూటికోరిన్ డెలివరీ రూ. 5300 ధరతో కొనుగోలుచేస్తున్నారు. అయితే,
గుంతకల్, జమ్మలమడుగు ప్రాంతాల జెజె రకం రూ. 5650-5700, కాక్ టు కాబూలీ కొత్త సరుకు రూ. 6500, పాత రూ. 6700, డాలర్ శనగలు రూ. 8000 మరియు
హైదరాబాద్లో శనగలు రూ. 5450, ముంబాయి ఓడరేవులో టాంజానియా శనగలు రూ. రష్యా కాబూలీ రూ. 4850, సూడాన్ కాబూలీ రూ. 5150-5300 మరియు
ఢిల్లీలో గత వారం 130-135 లారీల రాబడిపై రాజస్తాన్ సరుకు రూ. 5200-5225, మధ్య ప్రదేశ్ రూ. 5125 ధరతో వ్యాపారమయింది.
మహారాష్ట్రలోని సోలాపూర్, లాతూర్ లలో అన్నగిరి రూ. 5150-5350, మిల్లు రకం రూ. 4800-4900, విజయ రూ. 4800-5000,
03-10-2021 రాబోయే కాలంలో శనగల ధరలు రాణించే అవకాశం కనిపించడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. దేశంలో సరుకు నిల్వలు ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు