బొబ్బర్లు వృద్ధి

 

07-12-2021

ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలోని రాయచోటిలో ప్రతి రోజు 1-2 వాహనాల బొబ్బర్ల అమ్మకంపై ధర రూ.200-300 వృద్ధి చెంది నలుపు రూ. 7000, తెలుపు రూ. 5800, ఎరుపు రూ.5500, పొదిలిలో రూ. 5800-5900 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. 


ప్రస్తుతం కర్ణాటకలో వర్షాలు కురుస్తున్నందున పంటకు నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. తద్వారా ఉత్పత్తి తగ్గే అంచనాతో ధరలు పైకి ఎగబాకుతున్నాయి. మైసూరులో 50 బస్తాల కొత్త బొబ్బర్ల రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 8500, నిమ్ము సరుకు రూ. 600-500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

 ఉలువలు : కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు ఉలువ పంటకు నష్టం వాటిల్లినందున ఉత్పత్తి తగ్గే అంచనాతో రూ. 3600-3700 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమవుతున్నది. అయితే, ఇటీవల కురిసిన వర్షాలకు తొలిసారి చేపట్టిన పంటకు మాత్రమే నష్టం వాటిల్లినట్లు సంకేతాలు అందుతున్నాయి. మరోసారి విత్తిన పంట రాబడులకు జాప్యమేర్పడే అవకాశం కనిపిస్తున్నది. అయినప్పటికీ ఉత్పత్తి సంతృప్తికరంగా ఉండగలదని భావిస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లోని రాయచోటిలో 1-2 వాహనాల ఎసి అమ్మకంపై రూ.3300, విజయనగరం, చీపురుపల్లి ప్రాంతాల ఎసి సరుకు రూ. 3700 ధరతో వ్యాపారమై పాలకొల్లు, తాడేపల్లిగూడెం కోసం రవాణా అవుతున్నది.

Comments

Popular posts from this blog

శనగలు ధరలు పెరిగే అవకాశం మృగ్యం

అలసందలు