కొబ్బరిలో మందగమనం లేనట్లే

 

07-12-2021

దక్షిణాది రాష్ట్రాలలో కురిసిన కుండపోత వర్షాలు మరియు దేశవ్యాప్తంగా వివాహాల సీజన్ కొనసాగుతున్నందున కొబ్బరి ధరలు ఇనుమడి స్తున్నాయి. 


అంబాజిపేటలో ప్రతి రోజు 50-60 టన్నుల కొబ్బరి రాబడి కాగా, ఎక్స్పోర్ట్ రకం రూ. 10,300 -10,500, మీడియం రూ. 9550-9700, యావరేజ్ రూ. 8300 - 8500 మరియు 

పాలకొల్లులో 20 వాహనాల కొబ్బరి కాయలు రాబడి కాగా, నాణ్యమైన పునాస రకం సరుకు రూ. 9000, మీడియం రూ. 6500-7000, యావరేజ్ రూ.5000 (ప్రతి 1000 కాయలు) ధరతో వ్యాపారమై మహారాష్ట్ర, రాజస్థాన్ కోసం రవాణా అవుతున్నది.

కర్ణాటకలోని టిప్టూర్లో వారాంతపు సంతులో 2-3 వేల బస్తాల సరుకు రాబడిపై బంతి కొబ్బరి రూ. 17,200-17,600, మీడియం రూ. 16,700-17,100, మీడియం రూ. 12,000-13,500, 

అరిసేకేరి, మంగళూరు, తుంకూరు ప్రాంతాలలో గత వారం 2 వేల బస్తాల కొబ్బరి రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 17,000 -17,250, మీడియం రూ. 14,500 -15,000, మిల్లింగ్ సరుకు రూ. 9500-15,000 ధరతో వ్యాపార మైంది. 

తమిళనాడులోని కాంగేయంలో సాదా రూ. 9800, మిల్లింగ్ స్పెషల్ రూ. 10,000 -10,100, మెరికో రూ. 10,150 ప్రతి క్వింటాలు మరియు కొబ్బరి నూనె ప్రతి 15 కిలోల డబ్బా రూ.2200-2280 ధరతో నాణ్యతానుసారం వ్యాపారమైంది. 

వెల్లకోవిల్, మల్ల సముద్రం, అన్నామలై, అవిల్ పుదు ప్రాంతాల మార్కెట్లలో ఇటీవల కురిసిన వర్షాలకు హరాంతపు సంతలో రాబడులు తగ్గి కేవలం 2-3 వేల బస్తాలు పరిమితం కాగా, నాణ్యమైన సరుకు రూ. 10,150-10,750, మీడియం రూ. 7570-8750 మరియు 

త్రిచూర్ లో కొబ్బరి నూనె రూ. 16,300 - 16,400,9 పెరుందురైలో 5-6 వేల బస్తాల కొబ్బరి రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 10,121-10,770, 

కోజికోడ్లో రాజాపురి కొబ్బరి రూ. 19,400, రాసి రూ. 10,350, మిల్లింగ్ కొబ్బరి రూ. 10,850, బంతి కొబ్బరి రూ. 17,300–18,700, దిల్పసంద్ రూ. 10,850 ప్రతి క్వింటాలు మరియు కొబ్బరి కాయలు (1000) రూ. 33,000, వడకారలో రాజాపురి కొబ్బరి రూ. 19,600, ఎండు సరుకు రూ. 14,300 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog