శనగల ధరలు తగ్గుదల

 


19-12-2021

ప్రస్తుత సీజన్లో 17, డిసెంబర్ వరకు అపరాల విస్తీర్ణం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 137.26 లక్షల హెక్టార్ల నుండి తగ్గి 137.19 లక్షల హెక్టార్లకు చేరింది. అయితే, శనగ విస్తీర్ణం 96.60 లక్షల హెక్టార్ల నుండి పెరిగి 97.99 లక్షల హెక్టార్లకు చేరింది. గుజరాత్, రాజస్తాన్, మధ్య ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లో పంటవిత్తడం కొనసాగుతున్నది. దీనితో విస్తీర్ణం గత ఏడాది మాదిరిగా ఉండే అవకాశం కలదు. వర్షాల వలన ఆంధ్ర, కర్నాటకలలో పంటకు నష్టం వాటిల్లింది. అయితే, కొత్త సీజన్ మిగులు నిల్వలతో ప్రారంభమవుతున్నది. రాజస్తాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో మద్దతు ధరకంటే ధరలు తక్కువగా ఉన్నందున కొత్త సీజన్లో మందకొడికి అవకాశం కలదు. 


ఈ ఏడాది కొందరు వ్యాపారులు ఎస్ఎంఎస్ గ్రూప్ ద్వారా శనగల భవిష్యత్తు రూ.6000 తెలుపుతూ అనేకమంది వ్యాపారులను ఇరికించారు. అయితే, రాబోవు సీజన్లో స్టాకిస్టులు అప్రమత్తంగా ఉండే అవకాశం కలదు. గతవారం 

గుంతకల్, జమ్మలమడుగు ప్రాంతాల జెజె రూ. 5500 ఈరోడ్ డెలివరీ, 

ఒంగోలులో రూ. 5000, కాక్టు కాబూలీ కొత్త రూ. 6350, పాత రూ.6450, డాలర్ రూ.5100, 

హైదరాబాద్లో శనగలు రూ. 5225, ముంబాయి ఓడరేవులో టాంజానియా రూ. 4625-4700, రష్యా కాబూలీ రూ. 4700-4750, సూడాన్ కాబూలీ రూ. 5100-5200, 

ఢిల్లీలో గతవారం 90-100 లారీల రాబడిపై రూ. 100 తగ్గి రాజస్తాన్ రూ. 5050, మధ్య ప్రదేశ్. 4950 ధరతో వ్యాపారమయింది.


మహారాష్ట్రలోని సోలాపూర్, లాతూర్లలో అన్నగిరి రూ. 5150-5400, మిల్లు రక రూ. 4800-4950, విజయ రూ. 4800-5000,

 అకోలాలో రూ. 4850-4875, 

అమరావతి, వాషిం, బుల్డనా ప్రాంతాలలో సాదా రూ. 4400-4550 లోకల్ లూజు మరియు పప్పు సార్టెక్స్ రూ.6100-6200, మీడియం రూ. 5800-5900 ధరతో వ్యాపారమయింది. 

రాజస్తాన్ మార్కెట్లలో రూ. 4500-4600, 

జైపూర్లో రూ. 5000-5025, పప్పు రూ. 56725,

 మధ్యప్రదేశ్లోని నిమచ్, దామోహ్, జబల్పూర్, పిపరియా, అశోక్ నగర్ ప్రాంతాలలో రూ.4500-4600, కాబూలీ రూ. 8000-8600, 

ఇండోర్ దేసీ రూ.5000-5025, డాలర్ రూ. 8000 - 8800, కాబూలీ 42-44 కౌంట్ రూ. 9050, 44-46 కౌంట్ రూ. 8900, 58-60 కౌంట్ రూ. 8400, 60-62 కౌంట్ రూ. 8300, 62-64 కౌంట్ రూ. 8200, 64-66కౌంట్ రూ. 8100 ధరతో వ్యాపారమయింది.



Comments

Popular posts from this blog