పత్తి స్తిరం - రైతుల దగ్గరే పత్తి నిల్వలు

 

19-12-2021

వరంగల్ 10 వేల బస్తాల రాబడిపై రూ. 7000-8120, ఖమ్మంలో 8-10 వేల బస్తాల రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 8400, మీడియం రూ. 7500-8000, కర్నాటకలో 10-11 వేల బస్తాల రాబడిపై రూ.7000-8850, గింజలు రూ.2700-3450 ప్రతిక్వింటాలు మరియు మహారాష్ట్రలో 35-40 వేల బేళ్ల రాబడిపై రూ. 6000-8600, మధ్య ప్రదేశ్లో 14-15 వేల బేళ్ల రాబడిపై రూ. 6000-8500, మధ్య ప్రదేశ్లో 14–15 వేల బేళ్ల రాబడిపై రూ. 6000-8500, రాజస్తాన్లో 4-5 వేల బేళ్ల రాబడిపై రూ. 7000-8600 ధరతో వ్యాపారమయింది.


రైతుల దగ్గరే పత్తి నిల్వలు


ప్రస్తుత సీజన్లో పత్తి ఉత్పత్తి గత ఏడాదితో పోలిస్తే 353 లక్షల బేళ్ల నుండి పెరిగి 360.13 లక్షల బేళ్లకు చేరినట్లు భారత పత్తి సంస్థ (సిసిఐ) నవీకరించిన తమ గణాంకాలలో పేర్కొన్నది. భవిష్యత్తులో మరింత లాభసాటి ధరలు లభ్యమయ్యే అంచనాతో రైతులు ప్రస్తుతం విక్రయించేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా అక్టోబర్, నవంబర్లో కురిసిన అకాల వర్షాలకు కోతల ప్రక్రియకు ఆటంకం ఏర్పడినందున మార్కెట్లలో రాబడులు సన్నగిల్లాయి. గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే పత్తి రాబడులు 91.57 లక్షల బేళ్ల (170 కిలోలు) నుండి 15 శాతం తగ్గి 77.76 లక్షల బేళ్లకు పరిమితమ య్యాయి. గత ఏడాది సరుకు నిల్వలు 75 లక్షల బేళ్లు మరియు దిగుమతులు 2 లక్షల బేళ్లు కలిసి మొత్తం లభ్యత 154.76 లక్షల బేళ్ల సరుకు అందుబాటులో ఉంది.


అక్టోబర్-నవంబర్లో దేశంలో పత్తి వినియోగం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 57.50 లక్షల బేళ్ల నుండి తగ్గి 55.83 లక్షల బేళ్లకు పరిమితమైంది. ఎగుమతులు కూడా 7 లక్షల బేళ్లు తగ్గాయి. నవంబర్ చివరి వారంలో గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 131.57 లక్షల బేళ్ల నుండి తగ్గి 91.93 లక్షల బేళ్లకు పరిమితం కాగా, మిల్లుల వద్ద మరో 56 లక్షల బేళ్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి గత ఏడాదితో పోలిస్తే అధికమని చెప్పవచ్చు. ఈ ఏడాది అక్టోబర్ 1 నుండి ప్రారంభమైన ప్రస్తుత పత్తి సీజన్ కోసం దేశీయ వార్షిక వినియోగం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 3.35 కోట్ల బేళ్లు అందుబాటులో ఉండగలవని సిసిఐ తమ అభిప్రాయం వ్యక్తం చేసింది. నవంబర్ చివరి వారంలో భారత పత్తి సంస్థ, మహారాష్ట్ర పత్తి సమాఖ్య, బహళార్ధసాధక కంపెనీలు, జిన్నర్స్, వ్యాపారులు మరియు ఎక్స్ఛేంజి వద్ద పత్తి నిల్వలు గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 97.29 లక్షల బేళ్ల నుండి తగ్గి 35.93 లక్షల బేళ్లకు పరిమిత మైనందున ధరలు ఇనుమడిస్తున్నాయి. అయితే, ఇప్పటి వరకు 70 శాతానికి పైగా సరుకు నిల్వలు రైతుల గుప్పిట్లలోనే నలుగుతున్నాయి.


చైనాలో తగ్గిన పత్తి ఉత్పత్తి - భారత్లో పెరగనున్న పత్తి కోతలు



2021 కోసం చైనాలో పత్తి సేద్యం గత ఏడాదితో పోలిస్తే 4.4 శాతం క్షీణించి 30.30 ల.హె.కు పరిమితమైందని జాతీయ సమకాలీకరణ కార్యాలయం పేర్కొన్నది. అయితే, దిగుబడులు స్వల్పంగా వృద్ధి చెందినప్పటికీ ఉత్పత్తి 3 శాతం తగ్గి 57.30 లక్షల బేళ్లు దిగుబడి కాగలదని భావిస్తున్నది.


భారతదేశంలో పత్తి ప్రత్యక్ష రాబడులు 21.97 శాతం వృద్ధి చెంది 1,66,500 బేళ్లు కాగా, వరుసక్రమంలో గుజరాత్లో 40 వేల బేళ్లు, మహారాష్ట్రలో 35 వేల బేళ్లు, రాజస్తాన్లో 19 వేల బేళ్లు, మధ్య ప్రదేశ్లో 15 వేల బేళ్లు, కర్ణాటకలో 15 వేల బేళ్లు, హర్యాణాలో 12 వేల బేళ్లు, పంజాబ్లో 3500 బేళ్లు, ఒడిశ్శాలో 2 వేల బేళ్లు మరియు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కలిసి 25 వేల బేళ్లు నమోదయ్యాయి.


2021-22 లో ప్రపంచ పత్తి ఉత్పత్తి, సీజన్ చివరలో నిల్వలు తగ్గగలవని మరియు నెలవారీ డిమాండ్-సరఫరా కూడా తగ్గగలదని అమెరికా వ్యవసాయ శాఖ విడుదల చేసిన తమ నివేదికలో పేర్కొన్నది. ప్రపంచ వ్యవసాయ సరఫరా మరియు డిమాండ్ (డబ్ల్యుఎఎసిఇ) తమ డిసెంబర్ అంచనా నివేదికలో 2021-22 సీజన్ చివరి నాటికి ప్రపంచ వ్యాప్తంగా పత్తి నిల్వలు ముందస్తు అంచనాతో పోలిస్తే 12 లక్షల బేళ్లు తగ్గి 857.30 లక్షల బేళ్లు ఉండగలవని అభిప్రాయపడింది. అయితే, అమెరికాలో పత్తి ఉత్పత్తి స్వల్పంగా వృద్ధి చెంది. 182.80 బేళ్లు అంచనా వ్యక్తమవుతున్నది. కాగా, సీజన్ చివరలో నిల్వలు గతంలో మాదిరిగానే 34 లక్షల బేళ్లు ఉండే అంచనా వ్యక్తమవుతున్నది.


భారతదేశంలో పత్తి ధరలు సుమారు గడిచిన పదేళ్ల గరిష్ఠాన్ని తాకిన తర్వాత ప్రస్తుతం స్థిరత్వం నెలకొన్నట్లు విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే, రాబోయే త్రైమాసికం (జనవరి-మార్చి) లో ఒక దశలో ధరలు ఇనుమడించే అవకాశం ఉంది. అయితే, రెండో త్రైమాసికం ఏప్రిల్-జూన్లో పతనం కావడం తథ్యం. ప్రస్తుత సీజన్లో భారతదేశం యొక్క పత్తి ఉత్పత్తి 359 లక్షల బేళ్లు (170 కిలోలు) ఉండగలదని అమెరికా వ్యవసాయ శాఖ (యుఎసిఎ) పేర్కొనగా, భారత పత్తి సమాఖ్య (సిఎఐ) 360.13 లక్షల బేళ్లు దిగుబడి రాగలదనే అభిప్రాయం వెల్లడించింది. అయితే, గత ఏడాది ఉత్పత్తి 353 లక్షల బేళ్లతో పోలిస్తే ఇది 7 లక్షల బేళ్లు అధికమని చెప్పవచ్చు. ఎందుకనగా, లాభసాటి ధరలు లభిస్తున్నందున మరియు అక్టోబర్లో కురిసిన వర్షాల వలన కోతల ప్రక్రియకు ఏర్పడిన జాప్యం వలన 2021-22 సీజన్లో పత్తి దిగుబడులు భారీగా ఉండగలవని భావిస్తున్నారు.


మధ్య మరియు దక్షిణ భారత్లో పత్తి కోతల ప్రక్రియ కొనసాగుతున్నది. చేలలో నిలిచిన నీటిని తోడేసే పనిలో రైతులు నిమగ్నమైన ఉన్నారు. అంతేకాకుండా, పింక్ బోల్వార్ను ఓ కంట కనిపెట్టాలని శాస్త్రవేత్తలు సలహా ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది సెప్టెంబర్లో విడుదల చేసిన మొదటి ముందస్తు అంచనాలో ఈ ఏడాది పత్తి ఉత్పత్తి గత ఏడాదితో పోలిస్తే 353.84 లక్షల బేళ్ల నుండి సుమారు 10 లక్షల బేళ్లు వృద్ధి చెంది 362.19 లక్షల బేళ్లు ఉండగలదని అభిప్రాయం వ్యక్తం చేసింది. అటు తర్వాత పత్తి ఉత్పత్తి మరియు వినియోగ కమిటీ నవంబర్ 12న విడుదల చేసిన రెండో ముందస్తు అంచనాలో 362 లక్షల బేళ్లు రాణించే అవకాశం ఉన్నట్లు తమ అభిప్రాయం వ్యక్తం చేసింది. ప్రస్తుత సీజన్లో నవంబర్ 25 వరకు 53.30 లక్షల బేళ్లు రాబడి కాగా ఇది ఉత్పత్తి అంచనాలో 14.7 శాతం ఉంది. కాగా, గత ఏడాది ఇదే వ్యవధిలో 22 శాతం సరకు రాబడి అయింది. వాతావరణం సానుకూలంగా పరిణమిస్తున్నందున రాబోయే రోజులలో రాబడులు ఇనుమడించగలవని యుఎసిఎ పేర్కొన్నది.


భారత మార్కెట్లలో పత్తి గరిష్ఠ ధర ప్రతి బేలు (170 కిలోలు) రూ. 34,000 పలికిన తర్వాత రూ. 30,000 కు పడిపోయింది. మరో మూడు నెలలలో ధర పెరిగి రూ.34,000-35,000 కదలాడిన తర్వాత మందగమనంలోకి జారే అవకాశం ఉంది.


పత్తి ఉత్పత్తి పై దుష్ప్రభావం పొడసూపే అవకాశం లేదు


ప్రస్తుత సీజన్ (2021 అక్టోబర్ - 2022 సెప్టెంబర్) లో ప్రముఖ ఉత్పాదక రాష్ట్రాలైన మధ్య ప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రలో కురిసిన అకాల వర్షాలు మరియు పింక్ బోల్వార్మ్ కీటకం సంక్రమించినట్లు అందిన సమాచారంతో ఉత్పత్తిపై సర్వత్రా ఆందోళనలు వెల్లువెత్తాయి. అయితే, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రైతులు మరియు వ్యాపారులు పేర్కొన్నారు. అక్టోబర్కు ముందు నుండే ప్రస్తుత అనుమానాలకు భిన్నంగా వ్యవసాయ శాఖ తమ అభిప్రాయం వెల్లడించింది. పంటకు కొంత మేర నష్టం వాటిల్లినట్లు రాజ్ కోట్ వ్యాపార వర్గాలు పేర్కొన్నాయి. కావున నాణ్యతపై కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అయినప్పటికీ ఎక్కువలో ఎక్కువ 5 శాతం అనగా 10-15 లక్షల బేళ్ల సరుకుకు కొంతమేర నాసిరకంగా మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల వలన పంట పురోగతి మరియు నాణ్యత కొంతమేర కొరవడినట్లు కర్ణాటక వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. మొక్కలలో ఎదుగుదల నిలిచిపోయినందున డిసెంబర్ రాబడులు ప్రారంభం కావలసిన పంట ఇప్పటికీ లేనప్పటికీ సరఫరాపై ఎలాంటి ప్రభావం లేదు.

పంజాబ్ ఉత్పాదకులు తెలిపిన వివరాల ప్రకారం అతివృష్టి వలన కొన్ని ప్రాంతాలలో పత్తి చేను జలదిగ్బంధంలో చిక్కుకుపోయినందున మొక్కల వేళ్లు దెబ్బతినడం వలన మొక్కలు వాడిపోవడం ప్రారంభమైంది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు పంటకు పింక్ బోల్వార్మ్ కీటకం సంక్రమించింది.


తెలంగాణ లాంటి కొన్ని రాష్ట్రాలలో నిషేధిత హెచ్ఐబిటి పంట ఇప్పటికీ చేతికి అందక ఉత్పత్తిపై దుష్ప్రభావం పొడసూపే అవకాశం కనిపిస్తున్నది. ప్రస్తుత సీజన్లో భారత్ నుండి పత్తి ఎగుమతులు గత ఏడాదితో పోలిస్తే 79 లక్షల బేళ్ల నుండి తగ్గి 75 లక్షల బేళ్లకు పరిమిత మయ్యే అవకాశం ఉందని యుఎసిఎ పేర్కొన్నది.




Comments

Popular posts from this blog