మహారాష్ట్ర వ్యవసాయ డెరైక్టరేట్ వారి మొదటి ముందస్తు అంచనా ప్రకారం 2021-22 సీజన్లో రాష్ట్రంలో కందుల ఉత్పత్తి ముందు ఏడాదితో పోలిస్తే 14.50 లక్షల టన్నుల నుండి 25.25 శాతం తగ్గి 10.84 ల.ట., గుజరాత్లో ఉత్పత్తి 2.72 ల.టన్నులు ఉండే అంచనా కలదు. ఇదే విధంగా కర్ణాటకలో ఉత్పత్తి 12.38 ల.ట. నుండి 16.80 శాతం తగ్గి 10.30 ల.టన్నులకు చేరే అంచనా కలదు. కొత్త సీజన్ ప్రారంభం కావడంతో పాటు ధరలు పెరిగాయి.
సీజన్కు ప్రారంభంలో రూ. 6000 స్థాయిలో వ్యాపారమైన సరుకు ప్రస్తుతం రూ. 6400-6500కి చేరింది. ప్రస్తుతం మద్దతు ధరతో పోలిస్తే మార్కెట్ ధర అధికంగా ఉన్నందున చిన్న రైతులు సరుకు విక్రయిస్తున్నారు. అయితే దిగుబడి తగ్గడంతో పెద్ద రైతులు భవిష్యత్తులో ధర రూ. 7500 చేరే అంచనాతో సరుకు విక్రయించడం లేదు. ఈ ఏడాది ఉత్పత్తి గతంతో పోలిస్తే సుమారు 10 లక్షల టన్నుల మేర తగ్గే అవకాశం ఉంది. ఇందులో 4 లక్షల టన్నుల సరుకు విదేశాల నుండి దిగుమతి అయినప్పటికీ, 6 లక్షల లోటు ఉండగలదు. అయితే ప్రస్తుతం కూరగాయల సరఫరా మెరుగ్గా ఉన్నందున పప్పుకు గిరాకీ కొరవడింది.
అంతర్జాతీయ మార్కెట్లో మ్యాన్మార్ లెమన్ కందుల ధర 10 డాలర్లు తగ్గి 815 డాలర్లు ప్రతి టన్ను సిఅండ్ ఫ్ ప్రతిపాదించడంతో ముంబాయిలో కొత్త లెమన్ రూ.100 తగ్గి రూ.6050, అరుషా రూ. 5300-5350, మొజాంబిక్ గజరీ రూ. 5200-5250, తెలుపు రూ. 5350, మాలవి రూ. 4800-4850, సూడాన్ రూ. 6300-6350, మట్వారా రూ. 5150-5250, ఢిల్లీ లెమన్ రూ.6350 ధరతో వ్యాపారమయింది. లభించిన సమాచారం ప్రకారం
చెన్నై ఓడరేవులో విదేశాల నుండి సుమారు 12,240 కందులు, మినుములు దిగుమతి అయ్యాయి.ప్రస్తుతం దిగుమతిదారులు మయన్మార్ నుండి 700-710 డాలర్లు ప్రతి టన్ను ఎఫ్ బి ధరతో కొత్త లెమన్ కందుల ఎడ్వాన్స్ వ్యాపారం చేశారు. ప్రస్తుతం కర్ణాటకలోని అన్ని మార్కెట్లలో కలిసి దినసరి 50-55 వేల బస్తాలు, మహారాష్ట్రలో 40 వేల బస్తాలకు పెగ్డా సరుకు రాబడి అవుతున్నది. స్థానిక మార్కెట్లలో రూ. 5500-6350 ధరతో క్వాలిటీ ప్రకారం వ్యాపారం కావడంతో పాటు ఉద్గిర్ ప్రాంతపు కందులు చెన్నై డెలివరీ రూ. 6900, కర్నాటకలోని బిదర్, బసవకళ్యాణ్ ప్రాంతాలకు రూ. 6850, గుజరాత్ బిడిఎన్ 2 రకం రూ. 7100 ధరతో వ్యాపారమయింది.
కర్నాటక ప్రాంతపు కందులు ఇండోర్ డెలివరీ రూ.200 తగ్గి రూ. 6400-6500, మహారాష్ట్ర రూ.6250, మహారాష్ట్ర మరియు కర్నాటకలోని కట్నీ డెలివరీ రూ. 6800-6900, ఛత్తీసోడ్లోని రాయపూర్లో రూ. 6600 మరియు మహారాష్ట్ర ప్రాంతపు సరుకు రూ. 6700 ధరతో వ్యాపారమయింది.
అకోలాలో 7-8 వేల బస్తాల రాబడిపై గులాబీ మరియు గర్వాని రూ.6500-6550, కొత్త ఫట్కా రూ. 9400-9500, నాణ్యమైన సరుకు రూ.9600-9700, సవానెంబర్ కొత్త రూ. 8800-9100, పాత రూ. 8600-8700 మరియు
కర్నాటకలోని కలుబరిలో దినసరి 6-7 వేల బస్తాల రాబడిపై రూ.5800-6250, బీజాపూర్లో 1500 బస్తాల కందుల రాబడిపై రూ.5600-6000, ముద్దెబిహాల్లో 6-7 వేల బస్తాలు, తాలికోటలో 4-5 వేల బస్తాలు, 5–6 వేల బస్తాలు, భాల్కీలో 1500-2000 బస్తాలు, సిందగిలో 1000 బస్తాలు, హుమ్నాబాద్లో 700-800 బస్తాలు, సేడంలో 700-800 బస్తాలు, యాద్గిర్లో 3 వేల బస్తాలు, ఇతర అన్ని ఉత్పాదక కేంద్రాలలో కలిసి 7-8 వేల బస్తాల రాబడిపై రూ. 5400-6500 ధరతో వ్యాపారమయింది.
03-10-2021 రాబోయే కాలంలో శనగల ధరలు రాణించే అవకాశం కనిపించడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. దేశంలో సరుకు నిల్వలు ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు