స్థిరంగా కందుల ధరలు



 భారతదేశంలో తగ్గిన కందుల ఉత్పత్తితో కందుల ధరలు స్థిరపడ్డాయి. అంతర్జాతీయ విపణిలో మయన్మార్ లెమన్ కందులు 20 డాలర్లు పెరిగి 810 డాలర్లు ప్రతి టన్ను సి అండ్ ఎఫ్ ప్రతిపాదించినందున మహారాష్ట్రలోని సోలాపూర్, లాతూర్, నాందేడ్ ప్రాంతాలలో నాణ్యమైన కందులు చెన్నై డెలివరి రూ. 100 వృద్ధి చెంది రూ. 6950-7000, గుజరాత్ ప్రాంతం బిడిఎన్-2 కందులు రూ. 7000, ఆంధ్ర ప్రాంతం కందులు రూ. 7100 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. 



ముంబైలో లెమన్ కందులు రూ. 6150, అరుశ రూ. 5350-5400, మొజాంబిక్ గజరి రూ. 5300-5350, మాలవి కందులురూ. 4800-4850, సూడాన్ సరుకు రూ.6350, మట్వారా ,రూ.5250–5300, దిల్లీలో లెమన్ కందులు రూ. 6550-6625, కర్ణాటకలోని కల్బుర్గి, రాయిచూర్, యాద్గిర్, ముద్దెబిహాల్, బీదర్, బాల్కీ ప్రాంతా అన్ని మార్కెట్లలో కలిసి 12–15 వేల బస్తాల కందుల రాబడిపై నాణ్యమైన సరుకు రూ.6200-6400, మీడియం రూ. 5500-6000 ప్రతి క్వింటాలు ధరతో వాయ్పారమైంది.


మహారాష్ట్రలోని లాతూర్లో 63 నంబర్ మరియు మారుతి కందులు రూ. 6500-6600, తెల్ల కందులు రూ. 6000-6500, అకోలాలో 5-6 వేల బస్తాల సరుకు రాబడిపై గులాబీ కందులు రూ. 6750, పప్పు మేలిమి రకం రూ. 9300-9500, సవానంబర్ రూ.8500-8700, అమరావతిలో 6-7 వేల బస్తాలు, ఖాంగాంవ్లో 4 వేల బస్తాలు, మల్కాపూర్లో 2-3 వేల బస్తాలు మరియు ఇతర ఉత్పాదక కేంద్రాల వద్ద 10-12 వేల బస్తాల కందుల రాబడిపై రూ. 6000-6600 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


కట్నిలో విదర్భ, మరాట్వాడ మరియు కర్ణాటక ప్రాంతాల సరుకు రూ. 6900–7000, పప్పు మేలిమి రకం రూ. 9250-9350, ఇండోర్ లో మహారాష్ట్ర ప్రాంతం కందులు రూ.6400-6500, కర్ణాటక ప్రాంతం సరుకు రూ. 6600-6700, గుజరాత్ ప్రాంతం కందులు రాజ్కోట్, గోండల్, బరూచ్, హిమ్మత్నగర్, జునాగఢ్ ప్రాంతాలలో 20-25 వేల బస్తాల సరుకు రాబడిపై రూ. 5000-6150 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog