కందుల ధరలకు కళ్లెం

 


20-02-2022

అంతర్జాతీయ విపణిలో మయన్మార్ లెమన్ కందులు 30 డాలర్లు తగ్గి 790 డాలర్లు ప్రతి టన్ను సి అండ్ ఎఫ్ ప్రతిపాదించినందున పప్పు కోసం గిరాకీ కొరవడినందున కందుల ధరలకు కళ్లెం పడింది. ప్రస్తుత ఖరీఫ్, రబీ పంట కాలం (2021 జూలై - 2022 జూన్) లో కందుల ఉత్పత్తి గత 1 ఏడాదితో పోలిస్తే 43.20 ల.ట. నుండి తగ్గి 40 ల.ట.కు పరిమితం కాగలదని కేంద్ర వ్యవసాయ శాఖ విడుదల చేసిన రెండవ ముందస్తు అంచనాలో పేర్కొన్నది. అతివృష్టితో పంటకు నష్టం వాటిల్లినందున ఉత్పత్తి 30-32 ల.ట. అధిగమించే అవకాశం లేదని వ్యాపారులు పేర్కొన్నారు.





మహారాష్ట్రలోని సోలాపూర్, లాతూర్, నాందేడ్ ప్రాంతాలలో నాణ్యమైన కందులు చెన్నై డెలివరి రూ. 6850-6900, గుజరాత్ ప్రాంతం బిడిఎన్-2 కందులు రూ. 6900 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

ముంబైలో లెమన్ కందులు రూ.50 తగ్గి రూ.6100, అరుశ రూ. 5400-5450, మొజాంబిక్ గజరి రూ.5350-5400, మాలవి కందులు రూ. 4850-4900, సూడాన్ సరుకు రూ. 6350, మట్వారా రూ. 5250-5300,

 దిల్లీలో లెమన్ కందులు రూ.6500-6525, కర్ణాటక మార్కెట్లలో రూ. 5500-6250, అమరావతిలో రూ. 6400-6550 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై ఉద్గిర్, లాతూర్ ప్రాంతాలకు రవాణా అవుతున్నది.


కట్నిలో విదర్భ, మరాట్వాడ మరియు కర్ణాటక ప్రాంతాల సరుకు రూ. 6850–6950, పప్పు మేలిమి రకం రూ. 9200-9300, ఇండోర్లో మహారాష్ట్ర ప్రాంతం కందులు రూ.6400-6500, కర్ణాటక ప్రాంతం సరుకు రూ. 6600-6700 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog

శనగలు ధరలు పెరిగే అవకాశం మృగ్యం

అలసందలు