పెరుగుతున్న కందుల ధరలు

 


అంతర్జాతీయ విపణిలో లెమన్ మరియు లింక్లి కందుల ధర 15-20 డాలర్ తగ్గి ప్రతి టన్ను 1040 డాలర్ సి అండ్ ఎఫ్ ప్రతిపాదించినందున ముంబైలో దిగుమతి అయిన లెమన్ కందులు కొత్త సరుకు ధర రూ. 100 వృద్ధిచెంది రూ. 8350, మొజాంబిక్ గజరి కందులు రూ. 7150-7200, మాలవి ఎర్ర కందులు రూ. 6850-6900, సూడాన్ కందులు రూ. 8600-8700 ధరతో వ్యాపారమైంది. 


ప్రస్తుత సీజన్లో ఉత్పత్తి తగ్గినందున, అల్ నినో కారణంగా ఖరీఫ్ సీజన్లో పంటలపై ప్రతి కూల ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున పెద్ద స్టాకిస్టులు మరియు రెతులు సరుకు విక్రయించడం లేదు. మరియు మిల్లర్ల కొనుగోళ్లతో గత వారం కందుల ధర రూ. 400-500 ప్రతి క్వింటాలుకు పెరిగి మహారాష్ట్ర కందులు చెన్నై డెలివరి రూ. 9250, గుజరాత్ కందులు రూ. 9250-9300 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మహారాష్ట్ర మరియు కర్ణాటక ప్రాంతపు కందులు కట్ని డెలివరి రూ. 9300-9400, ఇండోర్లో మహారాష్ట్ర కందులు రూ. 8900-9000, కర్ణాటక కందులు రూ. 9100-9200, కర్ణాటక ఎర్ర కందులు విరుధ్ నగర్ డెలివరి రూ. 8900, తెల్లకందులు రూ. 9100 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

కర్ణాటకలోని గుల్బర్గాలో కందులు రూ. 8400-8700, పప్పు మేలిమి రకం రూ. 12,200, బీదర్, బాల్కీ, యాద్గిర్, సేడెం, అల్మేల్ ప్రాంతాలలో కందులు రూ. 8200-8650, కల్బుర్గ్ ప్రాంతం పప్పు సార్టెక్స్ బెంగళూరు డెలివరి రూ. 12,200-12,500, నాన్-సార్టెక్స్ రూ. 11,800, మహారాష్ట్ర సరుకు సాక్స్ రూ. 12,200-12,500 మరియు తెలంగాణలోని ఖమ్మంలో మీడియం కందులు కొత్త సరుకు రూ. 7700, పప్పు సార్టెక్స్ కొత్త సరుకు రూ. 10,500, నాన్-సార్టెక్స్ రూ. 10,900, ఆంధ్రప్రదేశ్లోని వినుకొండలో కందులు రూ. 8175, పప్పు స్టార్టెక్స్ రూ. 11,300, నాన్-సార్టెక్స్ రూ. 10,700, మాచర్ల, పొదిలిలో కందులు రూ. 8300, పప్పు సార్టెక్స్ పాలిష్ రూ. 11,100, ఎండు సరుకు రూ. 11,350 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

మహారాష్ట్రలోని లాతూర్ లో 2500-3000 బస్తాల కందుల రాబడిపై 63-నంబర్ మరియు మారుతి కందులు రూ. 8200-8750, గులాబీ రూ. 8200-8550, తెల్లకందులు రూ. 8000-8650, సోలాపూర్ లో 8-10 వాహనాల సరుకు రాబడిపై గులాబీ కందులు రూ. 7500-9000, జాల్నాలో తెల్ల కందులు రూ. 7500-8550, ఎర్ర కందులు రూ. 8000 -8450, అమరావతిలో 2 వేల బస్తాలు రూ. 8500-9000, అకోలాలో గులాబీ మరియు గవరాని రూ. 9000, పప్పు మేలిమి రకం నాణ్యమైన సరుకు రూ. 11,900 - 12,200, మీడియం సరుకు రూ. 11,800-12,000, సవానంబర్ పప్పు రూ. 11,200-11,400 మరియు గుజరాత్లోని రాజ్కోట్, దహోద్ మరియు పరిసర ప్రాంతాలలో కందులు రూ. 7500-8600 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog