తగ్గిన కందుల సేద్యం

 


 ప్రముఖ పప్పు ధాన్యాల ఉత్పాదక ప్రాంతమైన మధ్య భారత్ లో సెప్టెంబర్-అక్టోబర్ లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో కంది పంటకు నష్టం వాటిల్లినందున ప్రస్తుత ఖరీఫ్ సీజన్ లో కందుల ఉత్పత్తి గత ఏడాదితో పోలిస్తే 43,40 ల.ట. నుండి తగ్గి 38.90 ల.ట. రాబడి కాగలదనే అంచనా వ్యక్తమవుతున్నది. దేశంలో కందుల వార్షిక ఉత్పత్తి 43.25 ల.ట. ఉండగలదని భావిస్తున్నారు. పప్పు మిల్లులకు సకాలంలో సరుకు అందుబాటులో ఉండాలి. అందుకు భిన్నంగా స్టాకిస్టులు మరియు దిగ్గజ రైతుల అధీనంలో సరుకు నిల్వలు మగ్గుతున్నాయి. 


అతివృష్టి వలన ప్రముఖ కందుల ఉత్పాదక ప్రాంతాలలో ఖరీఫ్ పంటలకు నష్టం వాటిల్లుతున్నది. తద్వారా రాబోయే రోజులలో మార్కెట్లో సరఫరా క్రమబద్ధీకరించేందుకు పప్పు ధాన్యాలు ప్రధానంగా కందులు, మినుములు దిగుమతి చేసుకునేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దేశంలో మిగులు నిల్వలు హరించుకుపోయినందున నాఫెడ్ ప్రస్తుతం 1 ల.ట.కందులు విదేశాల నుండి కొనుగోలు చేస్తున్నది. ఆఫ్రికా నుండి 7 ల.ట., మయన్మార్ నుండి 2.00-2.50 ల.ట. దిగుమతి చేసుకునే అవకాశం ఉంది.

ప్రస్తుతం కందుల ఉత్పత్తి తగ్గుచున్నట్లు ఉప్పందినందున మరియు మయన్మార్ లో అడుగంటిన నిల్వలు, ఆఫ్రికాలో సాంకేతిక అవరోధాలు దిగుమతులు కుంటుపడినందున ధరలు ఎగబాకగలవని తెలుస్తోంది. పరిస్థితులను నిశితంగా పర్యవేక్షిస్తున్న స్టాకిస్టులు ధరలు పెరిగే అంచనాతో తమ సరుకు విక్రయించేందుకు ఆసక్తి కనబరచడం లేదు. అయితే, ప్రభుత్వం పప్పు ధాన్యాలు ప్రధానంగా కందులు మరియు మినుముల  ధరలపై నిఘా పెడుతున్నది.


మహారాష్ట్ర ప్రాంతం తెల్ల కందులు మీడియం సరుకు రూ. 8200, గుజరాత్ ప్రాంతం బిడిఎన్-2 రకం రూ. 8400, ముంబైలో లెమన్ కందుల నిల్వలు అడుగంటాయి. అరుశ రూ. 6350-6400, మొజాంబిక్ గజరి కందులు రూ. 6050, మాలవి ఎర్ర కందులు రూ. 5350-5400, సూడాన్ కందులు రూ. 7800, దిల్లీలో లెమన్ కందులు రూ. 7725, చెన్నైలో రూ. 7500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.మహారాష్ట్ర మరియు కర్ణాటక ప్రాంతాల కందులు కట్ని డెలివరి రూ. 8300–8400, పప్పు మేలిమి రకం రూ. 10,800-10,900, ఇండోర్లో మహారాష్ట్ర కందులు రూ. 7600-7700, కర్ణాటక కందులు రూ. 7800-8000, కల్బుర్గిలో రూ. 7700-8100, పప్పు మేలిమి రకం రూ. 10,500–11,000, రాయిచూర్, బీదర్లో కందులు రూ. 7700-7900 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

 మహారాష్ట్రలోని లాతూర్లో 63-నంబర్ మరియు మారుతి కందులు రూ. 7000-7600, తెల్ల కందులు రూ. 7000-7500, సోలాపూర్లో రూ. 7000-7250, గులాబీ రూ. 7000-7550, అమరావతిలో రూ. 7000-7880, అకోలాలో గులాబీ మరియు దేశీ కందులు రూ. 8000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఆంధ్రప్రదేశ్లోని వినుకొండలో కందులు రూ. 7400, పప్పు సార్టెక్స్ రూ. 10,150, నాన్-సార్టెక్స్ రూ. 9700, పొదిలిలో రూ.7575, పొదిలిలో రూ. 7575, మాచర్లలో పప్పు సార్టెక్స్ రూ. 10,225, కర్నూలులో కందులు రూ. 7300 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog