అంతర్జాతీయ మార్కెట్లో మయాన్మార్ లెమన్ కందుల ధర 10 డాలర్లు పెరిగి 820 డాలర్లు ప్రతిటన్ను ప్రతిపాదించడంతో మహారాష్ట్రలోని సోలాపూర్, లాతూరు, నాందేడ్ ప్రాంతాల కందులు చెన్నై డెలివరీ రూ. 6900-7000 మరియు గుజరాత్ బిడిఎన్-2 రకం రూ. 7000-7050 ధరతో వ్యాపారమయింది. అయితే, పప్పుకు గిరాకీ ఎక్కువగా లేదు. కూరగాయల ధరలు కూడా రోజురోజుకు పెరుగుతున్నాయి. దేశంలో ఉత్పత్తి తగ్గడంతో భవిష్యత్తులో మరింత పెరుగుదలకు అవకాశం కలదు.
మయాన్మార్ కొత్త కందులు రాబడి అవుతున్నాయి. అయితే, ముడి చమురు ధరలు పెరిగిన నేపథ్యంలో రవాణా వ్యయం అధికంగా ఉండడంతో, గతవారం దిగుమతి అయిన కందుల ధర రూ. 100-150 ప్రతిక్వింటాలుకు పెరిగిన నేపథ్యంలో, మిల్లర్ల ద్వారా దేశీ కందుల కొనుగోళ్లు పెరగడంతో దేశీ కందుల ధర రూ. 200-300 పెరిగింది. వచ్చేనెలలో ఉత్తరప్రదేశ్, బీహార్ లలో కొత్త కందుల రాబడి ప్రారంభం కాగలదు. అయితే, స్థానిక మిల్లుల కొనుగోళ్లతో సరుకు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అయ్యే అవకాశం లేదు.
ముంబాయిలో కొత్త లెమన్ రూ. 100 పెరిగి రూ. 6250, అరుషా రూ. 5450-5500, మొజాంబిక్ గజరీ రూ.5400-5450, మాలవి కందులు రూ. 4900-4950, సూడాన్ రూ.6450-6500, మట్వారా రూ. 5400-5450, ఢిల్లీలో లెమన్ రూ. 6625-6675 మరియు కర్నాటకలోని కలుబరిగి, రాయచూర్, యాద్గిర్, ముద్దెబిహాల్, బిదర్, భాల్కీ ప్రాంతాలలో దినసరి 18-20 వేల బస్తాల రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 6450-6750, మీడియం రూ. 5800-6200 ధరతో వ్యాపారమయింది.
మహారాష్ట్రలోని ఉత్పాదక కేంద్రాలలో 30-35 వేల బస్తాల రాబడిపై రూ. 6000-6600లోకల్ లూజ్ మరియు లాతూరులో 63 నెం., మారుతి రూ.6000-6650, తెలుపు రూ.6000-6400, అకోలాలో గులాబీ రూ. 6650-6700, నాణ్యమైన ఫట్కా పప్పు రూ. 9500-9600, మీడియం రూ. 9200-9300, సవానెం. రూ.8500-8600 ధరతో వ్యాపారమయింది. విదర్భ, మరాఠ్వాడా మరియు కర్నాటక ప్రాంతాల కందులు కట్నీ డెలివరీ రూ. 7000-7100, ఫట్కా పప్పు రూ. 9350-9450, ఇండోర్లో మహారాష్ట్ర కందులు రూ. 6450, కర్నాటక రూ. 6700 ధరతో వ్యాపారమయింది.
03-10-2021 రాబోయే కాలంలో శనగల ధరలు రాణించే అవకాశం కనిపించడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. దేశంలో సరుకు నిల్వలు ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు