సరుకు కొరతతో కందులు 9000/- దాటేనా?



 గత ఏడాది ఉత్పత్తి తగ్గడంతో దిగుమతుల తరువాత కూడా ధరలు పెరుగుతున్నాయి. రాబోవు సీజన్ కోసం విస్తీర్ణం 4.63 ల.హె. మేర తగ్గ డంతో వచ్చే ఏడాది పరిస్థితి ఎలా ఉండబోతుందో గోచరించడం లేదు. కొత్త సీజన్ లో ధర రూ. 9000 ప్రతి క్వింటాలు స్థాయిని కూడా అధిగమించగల దనే సందేహం ఉత్పన్నమౌతోంది. శనివారం వరకు మహారాష్ట్రలో కందుల ధర వృద్ధిచెంది రూ. 7500-8400 ప్రతి క్వింటాలుకు చేరింది. కొత్త సీజన్ కోసం మరో 90 రోజుల సమయం ఉంది. కావున నాణ్యమైన సరుకు ధర మరింత వృ ద్ధిచెంది రూ. 9000-9500 వరకు చేరవచ్చు.


గతవారం అంతర్జాతీయ మార్కెట్లో లెమన్ కందులు 40 డాలర్లు పెరిగి 940 డాలర్లు ప్రతి టన్ను సి అండ్ ఎఫ్ ప్రతిపాదించబడుతున్నందున ముంబైలో కొత్త లెమన్ కందులు రూ. 300 పెరిగి రూ. 7600, అరుషా రూ. 6000-6100, మొజాంబిక్ గజరీ రూ. 5850-5900, మాలవి ఎరుపు రూ. 5400-5500ధరతో వ్యాపారమైంది. వ్యవసాయ మంత్రిత్వ శాఖవారి నివేదిక ప్రకారం ప్రస్తుత ఖరీప్ దేశంలో ఆగస్టు 5 వరకు కందుల విస్తీర్ణం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 44.43 లక్షల హెక్టార్ల నుండి తగ్గి 39.80 లక్షల హెక్టార్లకు చేరింది. ఇందులో ఆగస్టు 1 వరకు గుజరాత్లో విస్తీర్ణం 2,12,239 హెక్టార్ల నుండి తగ్గి 1,87,793 హెక్టార్లకు చేరగా, రాజస్థాన్లో 8910 నుండి తగ్గి 7460 హెక్టార్లు, తెలంగాణలో 8,62,405 ఎకరాల నుండి తగ్గి 5,17,915 ఎకరాలకు చేరింది. 

మహారాష్ట్రలో విస్తీర్ణం తగ్గడంతో పాటు కర్ణాటకలోని ప్రముఖ ఉత్పాదక కేంద్రమైన కల్బుర్గిలో ఈ ఏడాది వర్షాల కారణంగా 5.50 ల.హె.లలో 2 లక్షల హెక్టార్ల మేర ప్రభావం పడే అవకాశం కలదు. ఈ సారి వర్షాలు సాధారణ స్థాయితో పోలిస్తే 40 శాతం అధికంగా ఉండడంతో బీదర్, యాద్గిర్, మహారాష్ట్ర లోని లాతూర్, సోలాపూర్, ఉస్మానాబాద్, తెలంగాణలోని వికారాబాద్, మహ బూబ్నగర్, సంగారెడ్డి ప్రాంతాలలో ఉత్పత్తి ప్రభావితం కాగలదు. ఎందుకనగా ఈ ఏడాది ఉత్పాదక ప్రాంతాలలో చేరిన నీరు ప్రస్తుతం తగ్గినప్పటికీ, పంటకు నష్టం చేకూరుతుంది. ప్రభుత్వం కందుల స్వేచ్ఛా దిగుమతి వ్యవధిని పెంచి మార్చి 23 వరకు పొడిగించడం జరిగింది. ఈ ఏడాది ఆఫ్రికాలో ఉత్పత్తి 6-7 లక్షల టన్నుల మేర ఉండే అంచనా కలదు. ప్రస్తుతం ఇక్కడ పంట కోతలు ప్రారంభమైనందున మార్కెట్లలో సరుకు రాబడులు ప్రారంభమయ్యే అవకాశం కలదు. ఇందులో ఎంతమేర సరుకు దిగుమతి కాగలదో అంచనా వేయడం సాధ్యం కాదు. ఎందుకనగా స్థానిక వినియోగంతో పాటు అక్కడి సరుకు ఇతర దేశాలకు కూడా ఎగుమతి అవుతోంది.


తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ తదితర కందుల ఉత్పాదక


రాష్ట్రాలలో ఉత్పత్తి తగ్గే అవకాశం ఉండడంతో పాటు నిల్వలు కనీస స్థాయికి


చేరిన నేపథ్యంలో భవిష్యత్తులో ధరలు వృద్ధిచెందగలవని స్టాకిస్టులు అభిప్రాయ పడుతున్నందున కందులు- కందిపప్పు ధరలు బలోపేతం చెందాయి. గత వారం మహారాష్ట్ర ప్రాంతపు కందలు చెన్నె డెలివరీ రూ. 8500, గుజరా త్లోని బారుచ్ ప్రాంతపు సరుకు రూ.8600 మరియు విదర్భ, మరఠ్వాడా మరియు కర్నాటక ప్రాంతాల సరుకు కట్నీ డెలివరీ రూ. 8350-8450 ధరతో వ్యాపారమైన తరు వాత అమ్మకందారులు ముందుకు రావడం లేదు. జబల్పూర్లో 500-600 బస్తాల రాబడిపై రూ. 5000-7500, పిపరియాలో 700-800 బస్తాల రాబ డిపె రూ. 6200-7400, ఇండోర్ లో మహారాష్ట్ర కందులు రూ. 7900-8300, కర్ణాటక ప్రాంతం సరుకు రూ. 8100-8400 మరియు ఢిల్లీలో లెమన్ రూ. 7750, కట్నీలో ఫట్కా పప్పు రూ. 10,900-11,000, బెంగుళూరు కోసం కలుబరిగి ప్రాంతపు సార్టెక్స్ పప్పు రూ. 11,400–11,700, నాన్ సార్టెక్స్ రూ. 10,900 మరియు మహారాష్ట్ర సార్టెక్స్ రూ. 11,300–11,700 ధరతో వ్యాపారమయింది. గతవారం మహారాష్ట్రలోని లాతూరులో 63 నెంబర్ మరియు మారుతి కందులు రూ. 7500-8411, తెలుపు రకం రూ.7500-8100, గులాబీ రూ. 7000-7700 మరియు సోలాపూర్ లో దినసరి 4-5 లారీల కందుల రాబడిపై రూ. 7000-8200, దరియాపూర్, జాల్నా, అమరావతి తదితర ప్రాంతాలలో రూ. 7900-8400, అకోలాలో గులాబీ మరియు గవ్రానీ రూ. 8200-8250, కందిపప్పు నాణ్యమైన సరుకు రూ. 11,200-11,400, మీడియం రూ. 10,700-10,900, నవానెంబర్ రూ.10,200-10,400 ధరతో వ్యాపారమయింది. వినుకొండలో రూ.7550, సార్టెక్స్ పప్పు రూ. 10,250, నాన్సాక్స్ రూ.9750, మాచర్లలో పాత కందులు రూ. 7700, సార్టెక్స్ పప్పు రూ. 10,400, పాత సరుకు రూ. 10,600, కర్నూలులో కందులు రూ. 7450 ధరతో క్వాలిటీ ప్రకారం వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog

శనగలు ధరలు పెరిగే అవకాశం మృగ్యం

అలసందలు