జూన్ తరువాత కందులలో పెరుగుదలకు అవకాశం

 


వేసవి సీజన్ కారణంగా పప్పు అమ్మకాలు పెరగడంలేదు. మధ్య తరగతి రైతులు తమసరుకు విక్రయిస్తున్నందున ధరలు స్థిరంగా ఉన్నాయి. జూన్ తరువాత గిరాకి వచ్చే అవకాశం ఉంది. మార్కెట్లలలో రాబడులు నామ మాత్రంగా ఉండడంతో ధరలు 8-10 శాతం పెరగవచ్చు. ఎందుకనగా దిగుమతులు పెరిగే అవకాశం ఉన్నందున మయన్మార్ వ్యాపారులు నెమ్మదిగా సరుకు విక్రయిస్తున్నారు. ముంబెలో కొత్త లెమన్ కందులు రూ.50 తగ్గి రూ.6250, అరుశ రూ. 5500-5600, మాలవి కందులు ఎరుపు రకం రూ. 4950-5000, మొజాంబిక్ తెలుపు రకం రూ.5450-5500, మట్వాడా రూ. 5350-5400 ధరతో వ్యాపారమెంది.


మహారాష్ట్ర ప్రాంతం సరుకు చెన్నై డెలివరి రూ.100 తగ్గి రూ. 6800, గుజరాత్ ప్రాంతపు బిడిఎన్-2 రకం సరుకు రూ.6900, సోలాపూర్లో దినసరి 8-10 లారీల రాబడిపై ఎరుపు రకం రూ.5500-6125, గులాబీ రూ. 5800-6300, మహారాష్ట్రలోని ఇతర ఉత్పాదక కేంద్రాలలో కలిసి 22-25 వేల బస్తాల రాబడిపై లాతూర్లో 63 నెంబర్, మారుతి రకాలు రూ. 6000-6321, తెలుపు రకం రూ.5800-6200,గులాబీరకం రూ. 6000-6250, అకోలాలో గులాబీ మరియు దేశవాలి సరుకు రూ. 6500-6550, నాణ్యమైన పట్కా పప్పు రూ. 9400-9500, మీడియం రూ. 9100-9200, సవానెంబర్ రూ. 8400-8500 ధరతో వ్యాపారమెంది. 


గత వారం విదర్భ, మరాఠ్వాడా, కర్ణాటక ప్రాంతాల కందులు కట్నీ డెలివరి రూ.250 తగ్గి రూ.6700-6800, ఇండోర్లో మహారాష్ట్ర సరుకు రూ. 6400-6500, కర్ణాటక సరుకు రూ.6600-6700, ఢిల్లీలో లెమన్ రూ. 6700, కర్ణాటకలోని కల్బుర్గిలో దినసరి 4-5 వేల బస్తాల రాబడి కాగా, రూ. 6200–6400, పట్కాపప్పు రూ. 9000-9400, బీదర్లో 2-3 వేల బస్తాలు, రాయిచూర్, యాద్గిర్, ముద్దెబిహాల్, బీజాపూర్, సేడం ప్రాంతా అన్ని మార్కెట్లలో కలిసి ప్రతిరోజు 8-10 వేల బస్తాల కందుల రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 5700-6400 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఖమ్మం లో రూ. 5700, సార్టిక్స్ పప్పు రూ. 8600, వినుకొండలో రూ. 6250, సార్టెక్స్ రూ. 8750, నాన్ సాల్టిక్స్ రూ. 8350, పొదిలిలో 6255 ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog