దేశంలో కందుల ఉత్పత్తి తగ్గినందున భారీ దిగుమతులకు అవకాశం ఉండే అంచనాతో కనీస మద్దతు ధర కంటే తక్కువ ధరతో కొత్త సీజన్ ప్రారంభమైంది. అయితే, నాణ్యమైన సరుకు కొరత ఏర్పడినందున మరియు విదేశాలలో ధరలు ఇనుమడించే అంచనాతో స్టాకిస్టులు అప్రమత్తమయ్యారు. ఎందుకనగా, భారత్లో అపరాల ఉత్పత్తి 10 ల.ట. కూడా ఉండకపోగా దిగుమతులు 4 ల.ట.కు ప్రభుత్వం పరిమితం చేసింది. అంతేకాకుండా కొత్త సీజన్ ప్రారంభ సమయంలో 2 ల.ట. నిల్వలు అందుబాటులో ఉన్నప్పటికీ సీజన్ చివరినాటికి 2 ల.ట. కొరత ఏర్పడింది. దీనిని పరిశీలిస్తున్న వ్యాపారులు భవిష్యత్తులో కందుల ధర రూ. 7500 తాకడం తథ్యమని అభిప్రాయపడుతున్నారు.
దేశంలో శనగల ఉత్పత్తి గణనీయంగా వృద్ధి చెందినందున ధరలు తగ్గి వినియోగం ఇనుమడించింది. కూరగాయల ఉత్పత్తి కూడా సంతృప్తికరంగా ఉన్నందున కందుల ధర రూ. 7500 ను అధిగమించే అవకాశం ఉండదని స్పష్టమవుతున్నది. ఒకవేళ రుతుపవనాల ఆగమనంలో జాప్యం లేదా మరేదైనా కారణంతో వాతావరణం వికటించినట్లయితే ధరలు పెరగడమే కాని తగ్గే అవకాశమే లేదు.
అంతర్జాతీయ విపణిలో మయన్మార్ లెమన్ కందులు 15 డాలర్లు పెరిగి 820 డాలర్లు ప్రతి టన్ను సి అండ్ ఎఫ్ ప్రతిపాదించినందున ముంబైలో లెమన్ కందులు రూ. 150 వృద్ధి చెంది రూ. 6150, అరుశ రూ. 5350-5400, మొజాంబిక్ గజరి రూ. 5300-5350, మాలవి కందులు రూ. 4850-4900, సూడాన్ సరుకు రూ. 6350-6400, మట్వారా రూ. 5200-5250, దిల్లీలో లెమన్ కందులు రూ. 6550 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైనందున గత వారం కందులు మరియు పప్పు ధర రూ. 100-150 ప్రతి క్వింటాలుకు వృద్ధి చెందింది.
కర్ణాటకలోని గుల్బర్గాల మార్కెట్లో ప్రతి రోజు 6–7 వేల బస్తాలు, బిజాపూర్, యాద్గిర్ 2 వేల బస్తాల చొప్పున, ముద్దెబిహాల్లో 3 వేల బస్తాలు, తాళికోట, బీదర్లో 4-5 వేల బస్తాల చొప్పున, సిందగిలో 2000-2500 బస్తాలు,
అల్మేల్లో 1500 - 2000 బస్తాలు, గుర్మిట్కల్లో 1500 బస్తాలు, బాల్కీలో 1400-1500 బస్తాలు మరియు ఉత్పాదక కేంద్రాలలో కలిసి 45-50 వేల బస్తాల కందుల రాబడిపై స్టాకిస్టులు మరియు మిల్లర్ల. కొనుగోళ్లు జోరందుకున్నందున నాణ్యమైన సరుకు రూ. 6000-6500, మీడియం రూ. 4300-4650 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
కట్ని, విదర్భ, మరాట్వాడ మరియు కర్ణాటక ప్రాంతం కందులు రూ. 7000-7100, పప్పు మేలిమి రకం రూ. 9300-9400, జబల్పూర్లో 2000-2500 బస్తాలు, పిపరియాలో 1500-1700 బస్తాలు, కరేలిలో 800-1000 బస్తాలు, దమోహలో 500-600 బస్తాలు రూ. 5500-6500 మరియు ఇండోర్లో మహారాష్ట్ర ప్రాంతం కందులు రూ. 6400-6500, కర్ణాటక ప్రాంతం సరుకు రూ. 6600-6700 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
మహారాష్ట్రలోని లాతూర్లో ప్రతి రోజు 4-5 వేల బస్తాల కందుల రాబడిపై 63-నంబర్ మరియు మారుతి కందులు రూ. 6000-6650, తెల్లకందులు రూ. 6000-6450, సోలాపూర్లో 40-50 వాహనాలు అమరావతిలో 6-7 వేల బస్తాలు, ఖాంగాంవ్లో 5 వేల బస్తాలు, వాషింలో 1000-1500 బస్తాలు, బార్షీలో 2 పేల బస్తాలు రూ. 5500-6650, అకోలాలో 5-6 వేల బస్తాలు గులాబీ మరియు గవరాని కందులు రూ. 6700, పప్పు మేలిమి రకం రూ. 9200-9300, కొత్త సరుకు రూ. 9400-9500, నాణ్యమైన సరుకు రూ. 9660, కొత్త కందులు రూ. 5500-6125, గులాబీ రూ. 5800-6400, పాత సరుకు రూ. 6000-6350, గులాబీ కందులు రూ.6000-6300, రూ. 6000-6450,
అకోలాలో ఎర్ర కందులు పాత సరుకు రూ.6725, గవరానిలో రూ. 6700, పప్పు మేలిమి రకం రూ. 9100-9200, కొత్త సరుకు రూ. 9300-9400, నాణ్యమైన సరుకు రూ. 9550-9600, సవానంబర్ రూ. 8500-8600, కొత్త సరుకు రూ. 8800-8900 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
03-10-2021 రాబోయే కాలంలో శనగల ధరలు రాణించే అవకాశం కనిపించడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. దేశంలో సరుకు నిల్వలు ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు