తగ్గిన కందుల సేద్యం - తగ్గనున్న ఉత్పత్తి

 




 ఈసారి కందుల సేద్యం తగ్గినట్లు ప్రభుత్వ వర్గాలు ధృవీకరించగా, వ్యాపారులు కూడా ఇందుకు ఏకీభవిస్తూ కందుల ఉత్పత్తి ప్రభుత్వ అంచనాతో పోలిస్తే రెట్టింపు పరిమాణం తగ్గగలదని తమ అభిప్రాయం వెల్లడించారు. ప్రభుత్వం చేపట్టనున్న కొనుగోళ్లు 25 శాతం నుండి పెంచి 40 శాతం నిర్ధారించింది. ఇలాంటి పరిస్థితులలో సరఫరా తగ్గగలదని భావిస్తున్నారు. దేశంలో తగ్గిన మొత్తం పప్పు ధాన్యాల సేద్యం మరియు పంటలకు వాటిల్లిన నష్టంతో రాబోయే సీజన్లో కందిపప్పు, పెసరపప్పు ధరలు వినియోగదారులకు చుక్కలు చూపించడం తథ్యమని చెప్పవచ్చు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ లో సెప్టెంబర్ 23 నాటికి దేశంలో పప్పు ధాన్యాల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 48.22 ల.హె. నుండి తగ్గి 46.04 ల.హె.కు పరిమితమైందని కేంద్ర వ్యవసాయ శాఖ విడుదల చేసిన తమ నివేదికలో పేర్కొన్నది. ఉత్పత్తి తగ్గే అంచనా వ్యక్తమవుతున్నందున డాలర్ తో పోలిస్తే బలహీనపడిన రూపాయి రూ. 81 దిగజారినందున దిగుమతి వ్యయం ఇబ్బడిముబ్బడిగా పెరిగింది.


తద్వారా గత వారం కందుల ధరలు దేశీయంగా బలపడడమే కాకుండా అంతర్జాతీయ విపణిలో లెమన్ మరియు లింకిలి కందులు గత సోమవారం 10 డాలర్ పెరిగి 935 డాలర్కు చేరినందున ముంబైలో లెమన్ కందుల ధర ప్రతి క్వింటాలుకు రూ. 50-100 పెరిగి రూ. 7450-7500, అరుశ రూ. 5500, మొజాంబిక్ గజరి కందులు రూ. 5350, మాలవి ఎర్ర కందులు రూ.4750–4800, సూడాన్ కందులు రూ. 7850-7900 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

 మహారాష్ట్ర మరియు కర్ణాటక ప్రాంతాల కందులు కట్ని డెలివరి రూ. 100-150 పెరిగి రూ. 8450-8550, పప్పు మేలిమి రకం రూ. 10,800, జబల్ పూర్, పిపరియాలో కందులు రూ. 5000–7680, ఇండోర్ లో మహారాష్ట్ర కందులు రూ. 7600-7700,

 కర్ణాటక కందులు రూ. 7900-8000, మహారాష్ట్రలోని లాతూర్ లో గులాబీ, 63-నంబర్ మరియు మారుతి కందులు రూ. 7000-8100, తెల్ల కందులు రూ. 7000–7800, సోలాపూర్‌లో ఎర్ర కందుల రాబడిపై రూ.7000-7400, గులాబి రూ. 7000-7750, అమరావతిలో 800-900 బస్తాలు రూ. 7200-7925, అకోలాలో గులాబీ మరియు గవరాని కందులు రూ. 8050 మరియు మేలిమి రకం పప్పు రూ. 10,600-10,800, జాల్నా లో రూ. 7400-8000, 

ఆంధ్ర ప్రదేశ్ లోని వినుకొండలో కందులు రూ. 7400, పప్పు సార్టెక్స్ రూ. 10,050, నాన్-సార్టెక్స్ రూ. 9650, మాచర్లలో పొదిలి ప్రాంతపు పాత కందులు రూ. 7500, పప్పు సార్టెక్స్ రూ. 10,100, ఎండు సరుకు రూ. 10,300, కర్నూలులో కందులు రూ. 7150, కల్బుర్గిలో రూ. 7600-8100, పప్పు మేలిమి రకం రూ. 10,50011,000, బీదర్ లో రూ. 6400-7900, యాద్ లో రూ. 7200-7570, బెంగుళూరులో కల్బుర్గి ప్రాంతం పప్పు సార్టెక్స్ రూ. 10,800–11,200, నాన్-సార్టెక్స్ రూ. 10,300-10,400, మహారాష్ట్ర ప్రాంతం సార్టెక్స్ పప్పు రూ. 10,600-11,200 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog