తగ్గిన కందుల ఉత్పత్తి - పెరిగిన ప్రభుత్వ కొనుగోళ్లు

Redgram,కందులు,


అధికారుల కథనం ప్రకారం బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం వారి సమావే శంలో ధరల మద్దతు పథకం క్రింద కందులు, మినుములు, సిరిశనగ కొనుగోళ్ల గరిష్ట పరిమితిని మొత్తం ఉత్పత్తి యొక్క 25 శాతం నుండి పెంచి 40 శాతానికి చేయడం జరిగింది. అయితే సెప్టెంబర్ 2 వరకు కంది పంట విస్తీర్ణం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 47.56 ల.హె. నుండి తగ్గి 44.86 ల.హె.కు చేరింది. 


దీనితో సీజన్ ప్రారంభం నుండే మార్కెట్ ధరలు మద్దతు ధరలకు ధీటుగా ఉండ గలవు. కావున ప్రభుత్వం మద్దతు ధరతో పాటు బోనస్ ను కూడా ప్రతిపాదించాల్సి ఉంటుంది. ఎందుకనగా మద్దతు ధరకంటే ఎక్కువ ధరతో పప్పు మిల్లులు సరుకు కొనుగోలు చేసే అవకాశం ఉంది. విస్తీర్ణం తగ్గడంతో పాటు అధిక వర్షాల వలన పంటకు నష్టం చేకూరడం మరియు కొన్ని ప్రాంతాలలో వర్షాభావ పరిస్థితుల వలన ఉత్పత్తి తగ్గే అవకాశం ఉంది. సీజన్ లో ప్రభుత్వ కొనుగోళ్లు ఉన్నట్లయితే, రెత్తులకు మంచి లాభం చేకూరగలదు. కేంద్రం ప్రస్తుతం ఓడరేవులలో దిగు మతి అయిన మినుముల కొనుగోళ్ల మాదిరిగానే కందులు కూడా సేకరించవచ్చు.

సెప్టెంబర్ 2 నాటికి దేశంలో కంది పంట సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 47.56 లక్షల హెక్టార్ల నుండి తగ్గి 44.86 లక్షల హెక్టార్లకు పరిమితమైంది. ఇందులో కర్ణాటకలో 14.45 ల.హె. నుండి తగ్గి 13.70 ల.హె.లకు చేరగా, మహారాష్ట్రలో 13.19 ల.హె. నుండి తగ్గి 11.64 ల.హె.లకు మరియు ఉత్తరప్ర దేశ్ లో 3.63 ల.హె., గుజరాత్ లో 2,27,495 హెక్టార్ల నుండి తగ్గి 2,17,021 హెక్టార్లకు చేరింది.

లభించిన సమాచారం ప్రకారం ఆఫ్రికా నుండి సరుకు దిగుమతి అయ్యే అవకాశం కలదు డాలర్తో పోలిస్తే రూపాయి విలువ తగ్గడంతో అంతర్జాతీయ మార్కెట్లో లెమన్, లింక్ల కందుల ధర ముందు వారంతో పోలిస్తే 5 డాలర్లు పెరిగి895 డాలర్లు ప్రతి టన్ను ప్రతిపాదించబడింది. అయితే స్టాకిస్టుల అమ్మకాలతో కొత్త లెమన్ కందులు రూ. 150 తగ్గి రూ. 7050, అరూష రూ. 5700-5750, మొజాంబిక్ గజరీ రూ. 5600, మాలవి ఎర్ర కందులు రూ. 5100-5200, సుడాన్ రూ. 7700 ధరతో వ్యాపారమెంది.

గత వారం మహారాష్ట్ర ప్రాంతపు సరుకు చెన్నై డెలివరి రూ. 8100-8300, గుజరాత్ లోని రాజ్ కోట్ ప్రాంతపు సరుకు రూ. 8100 ధరతో వ్యాపారమెంది.

గత వారం మహారాష్ట్ర, కర్ణాటక సరుకు కట్నీ డెలివరి రూ. 250 క్షీణించి రూ. 7900-8000, పట్కా పప్పు రూ. 10,300-10,400, జబల్ పూర్ లో కందులు రూ. 5000-7100, పిపరియాలో రూ. 6000-6830, ఇండోర్‌లో మహారాష్ట్ర కందులు రూ. 7500-7600, కర్ణాటక సరుకు రూ. 7600-7700, బెంగుళూరు కోసం కల్బుర్గీ ప్రాంతపు సార్టెక్స్ పప్పు రూ. 10,400-10,500, నాన్ సార్టెక్స్ రూ. 9900, మహారాష్ట్ర సార్టెక్స్ రూ. 10,200 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమెంది.

 గత వారం మహారాష్ట్రలోని లాతూర్ లో గులాబీ, 63నెంబర్, మారుతి రకాలు రూ. 7000-7700, తెల్ల కందులు రూ. 7000-7500, సోలాపూర్ లో దినసరి 1-2 వాహనాల రాబడిపె ఎర్ర కందులు రూ. 7000-7300, గులాబీ రకం రూ. 7000-7500, అమరావతిలో 1500-2000 బస్తాల రాబడిపె రూ. 7000-7850, అకోలాలో గులాబీ, గౌరాని రకాలు రూ. 7750-7800, నాణ్యమైన కందిపప్పు రూ. 10,400-10,600 ధరతో వ్యాపారమెంది.

వినుకొండలో రూ. 7050, సార్టెక్స్ పప్పు రూ. 9800, నాన్ సార్టెక్స్ రూ. 9350, మాచర్లలో పాత సరుకు రూ. 7100, సార్టెక్స్ పప్ప రూ. 9700, ఎండు సరుకు రూ. 9900, కర్నూల్ లో కందులు రూ. 7000, కల్బుర్గిలో రూ. 7500-7800, పట్కా పప్పు రూ. 10,200-10,600, బాల్కిలో తెల్ల కందులు రూ. 7200-7400, ఎర్ర కందులు రూ. 7400-7500 ధరతో వ్యాపారమెంది.





Comments

Popular posts from this blog

శనగలు ధరలు పెరిగే అవకాశం మృగ్యం

అలసందలు