పెరుగుతున్న కందుల ధరలు
తమిళనాడు పౌరసరఫరాల శాఖ వారు గత వారం దేశీయ మరియు దిగుమతి అయిన కందులతో మిల్లింగ్ చేసిన 20 వేల టన్నుల కంది, పెసర పప్పు కొనుగోలుకు తిరిగి ఆన్లైన్ టెండర్ జారీ చేయడం మరియు వ్యవధిని మే 5 వరకు పొడిగించడంతో పాటు ఉత్పాదక కేంద్రాల వద్ద రాబడులు సన్నగిల్లడం, అంతర్జా తీయ ధరలు పెరగడం వలన గత వారం కందుల ధర రూ.200-300 బలపడింది.
అంతర్జాతీయ విపణిలో లెమన్ మరియు లింక్లి కందుల ధర 35-40 డాలర్ పెరిగి ప్రతి టన్ను 1055-1060 డాలర్ సి అండ్ ఎఫ్ ప్రతిపాదించినందున ముంబైలో దిగుమతి అయిన లెమన్ కందులు కొత్త సరుకు ధర రూ. 250 వృద్ధి చెంది రూ. 8250, మొజాంబిక్ గజరి కందులు రూ. 6900, మాలవి ఎర్ర కందులు రూ. 6700, సూడాన్ కందులు రూ. 8550-8650 ధరతో వ్యాపారమైంది.
మహారాష్ట్ర కందులు చెన్నై డెలివరి రూ. 9000-9050, గుజరాత్ కందులు రూ. 9050-9100 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మహారాష్ట్ర మరియు కర్ణాటక ప్రాంతపు కందులు కట్ని డెలివరి రూ. 9150-9250, ఇండోర్లో మహారాష్ట్ర కందులు రూ. 8700-8800, కర్ణాటక కందులు రూ. 8900-9000, కర్ణాటక ఎర్ర కందులు విరుధ్ నగర్ డెలివరి రూ. 8800, తెల్లకందులు రూ. 9000, దిల్లీలో లెమన్ కందులు రూ. 8600, చెన్నై డెలివరి రూ.8250 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
కర్ణాటకలోని గుల్బర్గాలో కందులు రూ. 8200-8600, పప్పు మేలిమి రకం రూ. 12,000, బీదర్, బాల్కీ, యాద్గిర్, సేడెం, అల్మేల్ ప్రాంతాలలో కందులు రూ. 7800-8500, కల్బుర్గి ప్రాంతం పప్పు సార్టెక్స్ బెంగళూరు డెలివరి రూ. 11,900-12,200, నాన్-సార్టెక్స్ రూ. 11,500-11,600, మహారాష్ట్ర సరుకు సార్టెక్స్ రూ. 11,900-12,200 మరియు తెలంగాణలోని ఖమ్మంలో మీడియం కందులు కొత్త సరుకు రూ. 7700, పప్పు సార్టెక్స్ కొత్త సరుకు రూ. 10,900, నాన్-సార్టెక్స్ రూ. 10,600, ఆంధ్రప్రదేశ్లోని వినుకొండలో కందులు రూ. 8100, పప్పు సార్టెక్స్ రూ. 11,200, నాన్-సార్టెక్స్ రూ. 10,650, మాచర్ల, పొదిలిలో కందులు రూ. 8000, పప్పు సార్టెక్స్ పాలిష్ రూ. 10,900, ఎండు సరుకు రూ. 11,200 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
మహారాష్ట్ర లోని లాతుర్ లో 1500 బస్తాల కందుల రాబడిపై 63 నంబర్ మరియు మారుతి, గులాబి కందులు రూ. 8000-8450, తెల్లకందులు రూ.8000-8300, సోలాపూర్లో 6-7 వాహనాల సరుకు రాబడిపై గులాబీ కందులు రూ.7500-8725, జాల్నాలో తెల్ల కందులు, ఎర్ర కందులు రూ. 7500-8500, అమరావతిలో 1000–1200 బస్తాలు రూ. 8000-8600, అకోలాలో గులాబీ మరియు గవరాని రూ. 8900, పప్పు మేలిమి రకం నాణ్యమైన సరుకు రూ. 11,900-12,000, మీడియం సరుకు రూ. 11,700–11,800, సవానంబర్ పప్పు రూ. 11,100–11,200 మరియు గుజరాత్లోని రాజ్కోట్, దహోద్ మరియు పరిసర ప్రాంతాలలో కందులు రూ. 7500-8450 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు