వ్యవసాయ మంత్రిత్వ శాఖ వారి తాజా నివేదిక ప్రకారం దేశంలో సెప్టెంబర్ 16 నాటికి కంది పంట సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 47.95 లక్షల హెక్టార్ల నుండి తగ్గి 45.73 లక్షల హెక్టార్లకు పరిమితమైంది. తెలంగాణలో కంది పంట సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 9,02,489 ఎక రాల నుండి తగ్గి 5,58,826 ఎకరాలకు మరియు గుజరాత్ లో 2,29,028 హెక్టార్ల నుండి తగ్గి 2,23,978 హెక్టార్లకు చేరింది. అయితే కర్ణాటకలో వర్షాల వలన పంటకు నష్టం చేకూరడంతో ఉత్పత్తి తగ్గే అవకాశం కలదు. దేశంలో కందుల లభ్యత కనీస స్థాయికి చేరింది. దిగుమతి విధానం కారణంగా మయన్మార్ లో కూడా నిల్వలు తగ్గాయి. ఆఫ్రికాలో పంట నాణ్యంగా లేనందున మిల్లర్లు సరుకు కొనుగోలుకు ముందుకు రావడం లేదు. గత వారం కందులు, పప్పు ధరలు రూ. 300-400 ప్రతి క్వింటా లుకు పెరిగాయి.
అంతర్జాతీయ మార్కెట్లో లెమన్, లింక్లీ కందుల ధర ముందు వారంతో పోలిస్తే 40 డాలర్లు పెరిగి 925 డాలర్లు ప్రతి టన్ను ప్రతిపాదించడంతో కొత్త లెమన్ కందులు రూ. 350 పెరిగి రూ. 7400, అరూష రూ. 5250-5300,మొజాంబిక్ గజరీ రూ. 5150-5200, మాలవి ఎర్ర కందులు రూ. 4700, సుడాన్ రూ. 7700 ధరతో వ్యాపారమెంది.
గత వారం మహారాష్ట్ర, కర్ణాటక సరుకు కట్నీ డెలివరి రూ. 8300-8400, పట్కా పప్పు రూ. 10,600-10,700, జబల్ పూర్, పిపరియాలలో కందులు రూ. 5500-7700, ఇండోర్ లో మహారాష్ట్ర కందులు రూ. 7400-7500, కర్ణాటక సరుకు రూ. 7600-7700 మరియు గత వారం మహారాష్ట్రలోని లాతూర్ లో గులాబీ, 63 నెంబర్, మారుతి రకాలు రూ. 7500-7000, తెల్ల కందులు రూ. 7000-7500, సోలాపూర్ లో దినసరి 1-2 వాహనాల రాబడిపె ఎర్ర కందులు రూ. 7000-7300, గులాబీ రకం రూ. 7000-7650,
03-10-2021 రాబోయే కాలంలో శనగల ధరలు రాణించే అవకాశం కనిపించడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. దేశంలో సరుకు నిల్వలు ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు