విస్తీర్ణం తగ్గడంతో కందులు పటిష్ఠం

 


వ్యవసాయ మంత్రిత్వ శాఖ వారి వివరాల ప్రకారం దేశంలో కంది. పంట విస్తీర్ణం గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే 12-22 ల.హె. నుండి తగ్గి 10.57 ల.హె.లకు చేరింది. అయితే కర్ణాటకలో 3.62 లక్షల హెక్టార్లు, మహారాష్ట్రలో 4.72 ల.హె. ఉంది. కొన్ని రాష్ట్రాలలో పంట విత్తడం కొనసాగుతున్నందున విస్తీర్ణం గత ఏడాది మాదిరిగానే ఉండే అంచనా కలదు.


కర్ణాటక, మహారాష్ట్రలలోని కొన్ని ప్రాంతాలలో వర్షాభావ పరిస్థితుల వలన విస్తీర్ణం -తగ్గింది. తమిళనాడు పౌర సరఫరాల శాఖ వారు కందిపప్పు కొనుగోలు కోసం టెండర్ జారీ చేయడంతో గత వారం రూ. 150-200 ప్రతి క్వింటాలుకు పెరిగింది. 

తమిళనాడు పౌర సరఫరాల శాఖ వారు గురువారం నాడు 40 వేల టన్నుల కందిపప్పు ముఖ్యంగా కందిపప్పు, సిరిశనగ పప్పు, బఠానీల కొనుగోలు కోసం ఆన్లైన్ టెండర్ జారీ చేయగా, అన్లైన్ సమర్పించుటకు గడువు తేది 1 ఆగస్టు 2022 ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో మయన్మార్ లెమన్ కందుల ధర 50 డాలర్లు పెరిగి 870 డాలర్లు ప్రతి టన్ను సి అండ్ ఎఫ్ ప్రతిపాదించడంతో ముంబైలో కొత్త లెమన్ కందులు రూ. 200 పెరిగి రూ. 6500, ఆరుశ రూ. 5550-5650, మొజాంబిక్ రూ.5400-5450, మాలవి కందులు ఎరుపు రకం రూ. 5000-5100,మట్వారా రూ. 5450-5500 ధరతో వ్యాపారమైంది.

 మహారాష్ట్ర ప్రాంతపు కందులు చెన్నె డెలివరి రూ. 7300, గుజరాత్ బిడిఎ న్-2 రకం రూ. 7400, విదర్భ, మరాఠ్వాడా, కర్ణాటక ప్రాంతాల నరుకు కట్నీ డెలి వరి రూ. 7000-7100, కట్నీలో పప్పు రూ. 9200-9300, ఇండోర్లో మహారాష్ట్ర కందులు రూ. 6500, కర్ణాటక సరుకు రూ. 6500-6700, దిల్లీలో లెమన్ కందులు రూ. 6500-6525, బెంగుళూరు కోసం కల్బుర్గ్ ప్రాంతపు సార్టెక్స్ పప్పు రూ. 9400-9600, నాన్ సార్టెక్స్ రూ. 9000 మరియు మహారాష్ట్ర, సార్టెక్స్ పప్పు రూ. 9400 ధరతో వ్యాపారమైంది. లాతూర్లో 63 నెంబర్, మారుతి రూ. 6300-6550, తెల్ల కందులు రూ. 5000-6800, గులాబి రూ. 6400-6500, సాలపూర్లో 4-5 వాహనాల రాబడిపై రూ. 5500-6400, అకోలాలో గులాబీ, గౌరాని కందులు రూ. 6700–6725 ధరతో వ్యాపారమైంది. మధ్యప్రదేశ్లోని పిపరియాలో దినసరి 2000 బస్తాల రాబడిపై రూ.6300-6375, జబల్పూర్ లో రూ.5000-6000, కరేలిలో రూ.550-6250, కర్ణాటకలోని కల్బుర్గిలో 1200-1300 బస్తాల రాబడిపై రూ. 6200–6400, బిజాపూర్, ముద్దెబిహాల్, సిందగి, బిదర్, తాలికోట్, బాల్కి ప్రాంతా లలో కలిసి 3-4 వేల బస్తాల రాబడిపై రూ. 5800-6200 ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog