కందిపప్పుకి తగ్గిన గిరాకీ

 


అంతర్జాతీయ మార్కెట్లో మయన్మార్ లెమన్ కందుల ధర సోమవారం నాడు 890 డాలర్లతో పోలిస్తే శనివారం వరకు 20 డాలర్లు తగ్గి 870 డాలర్లు ప్రతి టన్ను సి అండ్ ఎఫ్ ప్రతిపాదించబడింది. కాని ముంబెలో కొత్త లెమన్ కందులు రూ. 50 బలపడి రూ. 6300, అరుశరూ. 5550-5600, మొజాంబిక్, గజరి రూ. 5500, మాలవి కందులు ఎరుపు రకం రూ. 4950-5050, మరాట్వాడా రూ.5350-5400 ధరతో వ్యాపారమైంది. అయితే దేశంలోని ఇతర ఉత్పాదక రాష్ట్రాలలో పప్పుకు గిరాకీ తక్కువగా ఉన్నందున ధరలు మందకొడిగా ఉన్నాయి. 


తమిళనాడులోని విరుధ్నగర్ ప్రాంతపు ఎర్ర కందులు చెన్నై డెలివరి రూ.6800, తెల్ల కందులు రూ. 7000, మహారాష్ట్రలోని సోలాపూర్లో దినసరి 10-12 లారీల రాబడిపై ఎర్ర కందులు రూ. 5200-6250, మహారాష్ట్రలోని ఇతర ఉత్పాదక కేంద్రాలలో కలిసి 20-22 వేల బస్తాల రాబడిపై రూ.6000-6350, లాతూర్లో 63 నెంబర్, మారుతి రకాలు రూ.6000-6300, తెలుపు రకం రూ. 5800-6200, గులాబీ రూ.6000-6300, అకోలాలో గులాబీ మరియు దేశవాలి సరుకు రూ.6400, నాణ్యమైన పట్కాపప్పు రూ. 9000-9300, మీడియం రూ. 8700-8900, సవానెంబర్ రూ. 8300-8500 ధరతోవ్యాపారమైంది. గత వారం విదర్భ, మరాఠ్వాడా, కర్ణాటక ప్రాంతాల కందులు కట్నీ డెలివరి రూ. 100 తగ్గి రూ. 6600-6700, మధ్య ప్రదేశ్ లోని కరేలి, దామోహ్, పిపరియా ప్రాంతాలలో 5-6 వేల బస్తాల రాబ డిపై రూ. 5800-6200, ఇండోర్లో మహారాష్ట్ర రూ. 2006300, కర్ణాటక సరుకు రూ. 6400-6500, దిల్లీలో లెమున్ కందులు రూ. 6600, కర్ణాటకలోని కల్బుర్గిలో దినసరి 5-6 వేల బస్తాల రాబడి కాగా, రూ. 6300-6600, పట్కా పప్పు రూ. 9300-9400, బిదర్లో 3 వేల బస్తాలు, రాయిచూర్, యాద్గిర్, ముద్దెబిహాల్, బిజాపూర్, సేడం, తాలికోట్ తదితర ప్రాంతాల అన్ని మార్కెట్లలో కలిసి ప్రతిరోజు 10-12 వేల బస్తాల కందుల రాబడిపై రూ. 5900-6300 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


తెలంగాణలోని ఖమ్మం మార్కెట్లో రూ. 5600, సార్టెక్స్ పప్పు రూ. 8600, వినుకొండలో రూ.6100, సార్టెక్స్ పప్పు రూ. 8700, నాన్ సార్టెక్స్ రూ. 8300, పొదిలిలో కందులు రూ. 6200 ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog