పెరిగిన పసుపు రాబడులు - స్టాకిస్టుల కొనుగోళ్లు ప్రారంభం

 

దేశంలోని ఉత్పాదక రాష్ట్రాలలో కొత్త సరుకు రాబడులు పెరుగుతున్నాయి. తెలంగాణ మార్కెట్లలో గత వారం 1.40 లక్షల బస్తాలు, ఆంధ్రలో 8-10 వేల బస్తాలు, తమిళనాడులో 60-70 వేల బస్తాలు, మహారాష్ట్రలో 1.15 లక్షల బస్తాలు కలిసి మొత్తం 3.35 లక్షల బస్తాల సరుకు రాబడి అయింది. వికారాబాద్లో కొత్త సరుకు రాబడి ప్రారంభం కాగా, ఏప్రిల్ 3 తరువాత అన్ని మార్కెట్లలో రాబడులు ఊపందుకోగలవు. ఇంలాటి సమయంలో మర ఆడించే యూనిట్ల కొనుగోళ్లతో ధరలు ఎక్కువగా తగ్గే అవకాశం లేదు. ఎందుకనగా ఎగుమతి డిమాండ్తో పాటు పాత సరుకు అమ్మకానికి స్టాకిస్టులు ఆసక్తి చూపడం లేదు. కొత్త సరుకు స్టాకిస్టులు చురుకుగా మారుతున్నారు. 


ఎన్సిడిఇఎక్స్ వద్ద గత సోమవారం ఏప్రిల్ వాయిదా రూ. 8604 తో ప్రారంభమైన తర్వాత శుక్రవారం వరకు రూ. 204 పెరిగి రూ.8808, మే వాయిదా రూ.230 వృద్ధిచెంది రూ.8930 వద్ద ముగిసింది. 

తెలంగాణలోని నిజామాబాద్లో గతవారం 1.16 లక్షల బస్తాల కొత్త సరుకు రాబడిపై కొమ్ములు మీడియం సరుకు రూ. 5500-5800, నాణ్యమైన సరుకు రూ. 8200-8400, దుంపలు రూ. 5000-6500, కొమ్ములు పాలిష్ సరుకు రూ. 8600-8700, దుంపలు రూ. 7400-7500, మెట్పల్లిలో 10-12 వేల బస్తాలు కొమ్ములు నాణ్యమైన సరుకు రూ. 4500-7100, దుంపలు రూ. నాణ్యమైన సరుకు రూ. 4000-5700 మరియు వరంగల్లో 1200–1500 బస్తాల కొత్త సరుకు రాబడిపై కొమ్ములు రూ. 6000-6400, దుంపలు రూ. 5600-6000, కేసముద్రంలో 3-4 వేల బస్తాలు కొమ్ములు, దుంపలు రూ. 5500-6500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మరియు వచ్చే వారం ఆర్థిక సంవత్సర గణాంకాల కారణంగా మార్కెట్లు మూసి ఉండగలవు. ఏప్రిల్ 4న మార్కెట్లు తిరిగి ప్రారంభం కాగలవు.


ఆంధ్రప్రదేశ్లోని దుగ్గిరాలలో 400-500 బస్తాల కొత్త సరుకు మరియు 1000-1200 బస్తాల పాత సరుకు రాబడిపై కొమ్ములు, దుంపలు రూ. 6400-650, కడప ప్రాంతం నుండి 1 లారీ కొత్త సరుకు రాబడిపై మీడియం కొమ్ములు, దుంపలు రూ. 5700-5800 మరియు కడప మార్కెట్లో గత వారం 4–5 వేల బస్తాల కొత్త పసుపు రాబడిపై కొమ్ములు రూ. 6700-6850, దుంపలు రూ. 5700-5800, రంగు తగ్గిన నిమ్ము సరుకు రూ. 3500-4000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. 

మహారాష్ట్రలోని హింగోలిలో గత సోమ, గురువారాలలో కలిసి 24-25 వేల బస్తాల కొత్త సరుకు రాబడిపై కొమ్ములు రూ.7200-8200, దుంపలు రూ. 6000-6800 మరియు సాంగ్లీలో గత వారం 60-65 వేల బస్తాల కొత్త సరుకు రాజాపురి నాణ్యమైన లగడి రకం సరుకు రూ. 12,000 16,000, రాజాపురి పౌడర్ రకం రూ. 10,200-11,500, మీడియం రూ. 9500-10,000, ముక్కలు రూ. 8000-8600, మీడియం రూ. 6700-7600, రాజాపురి దుంపలు రూ. 7400-8700, దేశీ కడప రూ. 7000-7400, నాందేడ్లో 8-10 వేల బస్తాల కొత్త సరుకు రాబడి కాగా, కొమ్ములు రూ. 5500-8000, దుంపలు రూ. 6000-7000 మరియు బస్మత్నగర్లో 10-12 వేల బస్తాల కొత్త సరుకు రాబడి కాగా, కొమ్ములు రూ. 6000-8000, దుంపలు రూ. 5500-6500 ధరతో వ్యాపారమైంది.


తమిళనాడులోని ఈరోడ్లో గత వారం 35-40 వేల బస్తాల కొత్త - పాత సరుకు రాబడిపై కొత్త కొమ్ములు రూ. 6512–9069, దుంపలు రూ. 5589-7599, పాత కొమ్ములు రూ. 5678-7489, దుంపలు రూ. 5222–6122 పెరుందరైలో 4-5 వేల బస్తాల రాబడిపై కొమ్ములు రూ. 4–5 3v 6839-8411, దుంపలు రూ. 6209-7289 మరియు పాత కొమ్ములు రూ. 5843-7555, దుంపలు రూ. 5514-6809 ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog