తగ్గుతున్న వాము ధరలు

 

వేసవి తాపం పెరిగిన నేపథ్యంలో వాము వినియోగం తగ్గడంతో పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో హోళి సందర్భంగా మార్కెట్లు మూసి ఉండడంతో గత వారం ధరలు రూ. 400-500 ప్రతి క్వింటాలుకు తగ్గాయి.



ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు మార్కెట్లో గత వారం 5 వేల బస్తాల సరుకు రాబడిపై ఎరుపు రకం రూ. 12,000-13,000, మీడియం రూ. 10,500-11,500, తెలుపు రకం రూ. 13,500-14,500, మీడియం ఆకుపచ్చ సరుకు రూ. 16,000-19,000, నాణ్యమైన సరుకు రూ.20,000-22,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.తెలంగాణలోని సదాశివపేటలో బుధవారం 20-25 బస్తాల రాబడి కాగా, మీడియం సరుకు రూ. 10,000-10,500, మీడియం బెస్ట్ రూ. 12,500-13,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


మధ్య ప్రదేశ్ లోని పోహరిలో గత వారం 400-500 బస్తాల రాబడిపై మీడియం రూ.8000-8500, మీడియం బెస్ట్ రూ. 11,500-12000, నీమచ్లో 500-600 బస్తాల కొత్త సరుకు ఎరుపు సరుకు రూ. 10,000-10,500, మీడియం బెస్ట్ రూ. 11,000-11,500, నాణ్యమైన సరుకు రూ. 12,500-13,000 మరియు మహారాష్ట్రలోని నందూర్ బార్ గత వారం 100-150 బస్తాల కొత్త వాము రాబడిపై మీడియం రూ.8000-9500, మీడియం బెస్ట్ రూ. 11,000–12,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. గుజరాత్లోని జామ్నగర్లో గత వారం 1500 బస్తాల కొత్త వాము అమ్మకంపై యావరేజ్ రూ. 10,500-11,000, మీడియం రూ. 12,500-13,000, రంగు సరుకు రూ. 14,000-14,500 మరియు ఊంఝాలో 1000-1200 బస్తాల రాబడిపై యావరేజ్ రూ. 12,500-13,500, సూపర్ గ్రీన్ క్వాలిటీ రూ. 19,000-20,200 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog