యాలకులు

 

పెద్ద యాలకుల వేలాలు

సిలిగుడి - మార్చి 31న పెద్ద యాలకుల వేలాలలో సిక్కింలోని సింగటంలో పెద్ద గింజ యాలకుల ధర ముందు వారంతో పోలిస్తే రూ. 676.25 నుండి తగ్గి రూ. 668.75, చిన్న గింజ సరుకు ధర రూ. 617.50 నుండి తగ్గి రూ. 615 ప్రతి కిలోకు చేరగా, గ్యాంగ్టక్లో పెద్ద యాలకుల ధర రూ. 675, చిన్నవి రూ. 575 ప్రతి కిలో స్థాయిలో స్థిరంగా ఉంది. పశ్చిమ బెంగాల్లోని సిలిగుడిలో పెద్ద గింజ ధర రూ. 737.50 నుండి పెరిగి రూ. 770, చిన్నగింజ రూ. 667.50 నుండి తగ్గి రూ. 666.25 ప్రతి కిలోకి చేరింది.


చిన్న యాలకులు


బోడినాయకనూర్ - తమిళనాడు, కేరళలోని వేలం కేంద్రాలలో గత వారం 12 వేలాలకు బదులుగా కేవలం 9 వేలాలలో 4,37,216 కిలోల సరుకు రాబడి కాగా, 4,28,772 కిలోల సరుకు అమ్మకం అయింది. ఇందులో సోమవారం నాడు సగటున రూ. 802.65 నుండి పెరిగి రూ.929.20 మరియు నాణ్యమైన సరుకు సోమవారం నాడు రూ. 1172తో పోలిస్తే శనివారం రూ. 2035 ప్రతి కిలో ధరతో అమ్మకం అయింది. ఇందుకు ముఖ్య కారణమేమనగా రంజాన్ పండుగ డిమాండ్తో పాటు వేలాలలో నాణ్యమైన సరుకు రాబడులు తగ్గడంతో ధరలు పెరగడానికి బలం చేకూరింది. అయితే వచ్చే వారం నుండి రాబడులు పెరిగే అవకాశం కలదు.

Comments

Popular posts from this blog

శనగలు ధరలు పెరిగే అవకాశం మృగ్యం

అలసందలు