ఎన్ఎసిడిఇఎక్స్ వద్ద గత సోమవారం ఆగస్టు వాయిదా సోమ వారం నాడు 7698తో ప్రారంభమైన తరువాత శుక్రవారం నాటికి రూ. 316 క్షీణించి రూ. 7382, సెప్టెంబర్ వాయిదా రూ.362 తగ్గి రూ. 7486 వద్ద ముగిసింది. దీనితో మార్కెట్ ధరలు మందకొడిగా ఉన్నాయి. అయితే వినా యక చవితి నుండి దీపావళి వరకు పసుపు వినియోగం అధికంగా ఉండడం వలన ధరలు పెరిగే అకవాశం ఉంది. అంతవరకు రైతుల సరుకు అమ్మకం కూడా తగ్గవచ్చు. ఈ వ్యవధిలో ఎగుమతి డిమాండ్ నెలకొనే అంచనా కలదు.
ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర మొదలగు ఉత్పాదక రాష్ట్రాలలో గిరాకీ కొరవడినందున ధర రూ. 100-150, వాయిదా మార్కెట్లో రూ. 300-350 ప్రతి క్వింటాలుకు క్షీణించాయి. పసుపు ఉత్పాదక రాష్ట్రాలలో పంట విత్తడం సమాప్తం అయింది. అయితే వర్షాల వలన కొన్ని ప్రాంతాలలో నష్టం వాటిల్లే అంచనా కలదు. సెప్టెంబర్ చివరి నాటికి వాస్తవిక పరిస్థితి ముందుకు రాగలదు.
తమిళనాడులోని ఈరోడ్ మార్కెట్లో గత వారం 5-6 వేల బస్తాల సరుకు రాబడిపై కొమ్ములు రూ. 61.22–7469, దుంపలు రూ. 5842-6413, పెరుందురైలో 1000– 1200 బస్తాల రాబడిపై కొమ్ములు రూ. 5532-7959, దుంపలు రూ. 5089 6699 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
ఆంధ్రప్రదేశ్లోని దుగ్గిరాలలో గత వారం 1800-2000 బస్తాల సరుకు రాబడిపై నాణ్యమైన కొమ్ములు మరియు దుంపలు రూ.5800-6200, మీడియం రూ. 5500-5600 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్లో గత వారం 7-8 వేల బస్తాల సరుకు అమ్మకంపై రాజాపురి పసుపు నాణ్యమైన సరుకు రూ. 7000-8000, దేశీ కడప రూ. 5800-6300, హింగోళిలో గత బుధ మరియు శుక్రవారాలలో కలిసి 9-10 వేల బస్తాల సరుకు రాబడిపై కొమ్ములు రూ.6200-7200, దుంపలు రూ.5500-6200, నాందేడ్లో 8-10 వేల బస్తాలు కొమ్ములు రూ. 6000-7000, దుంపలు రూ. 5800-6400, బస్మత్నగర్లో 3-4 వేల బస్తాల అమ్మకం కాగా, కొమ్ములు రూ. 6200-7000, దుంపలు రూ. 5800-6300 ధరతో వ్యాపారమైంది.
03-10-2021 రాబోయే కాలంలో శనగల ధరలు రాణించే అవకాశం కనిపించడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. దేశంలో సరుకు నిల్వలు ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు