యాలకుల వేలాలలో భారీగా పెరిగిన రాబడులు

 


 తమిళనాడు, కేరళలోని వేలం కేంద్రాలలో గత వారం హోళి పండుగ ఉన్నప్పటికీ, సోమవారం నుండి శనివారం వరకు ప్రతి రోజు రెండు వేలాలు నిర్వహించబడ్డాయి. ఇందుకు ముఖ్య కారణమేమనగా, రెత్తులు వేగంగా సరుకు విక్రయిస్తున్నారు. వేలాలలో దినసరి అమ్మకం పరిమితి 1.30 లక్షల కిలోలను దాటుతూ, వారంలో సుమారు 8,33,961 కిలోల సరుకు రాబడి కాగా, 7,96,320 కిలోల సరుకు అమ్మకం అయింది. ఇందులో రైతులకు గరిష్టంగా సోమవారం నాడు రూ. 927 ప్రతి కిలో ధర లభించింది.


మార్చి 15న 1.65 లక్షల కిలోలు, మార్చి 16న 1.38 లక్షల కిలోలు, మార్చి 17న 1.40 లక్షల కిలోలు, మార్చి 19న 1.45 లక్షల కిలోల సరుకు రాబడి కావడంతో మార్చి 18న రైతులకు సోమవారంతో పోలిస్తే రూ. 117 తక్కువగా రూ. 810 మరియు నాణ్యమైన సరుకు రూ. 1319, శనివారం నాడు రూ. 1212-1295 ప్రతి కిలో ధర లభించింది. రాబోవు రంజాన్ పండుగ సందర్భంగా వినియోగం అధికంగా ఉండగలదు. అయితే వచ్చేవారం కూడా రాబడులు అధికంగా ఉండగలవు.


పెద్ద యాలకుల వేలాలు


సిలిగుడి - మార్చి 17 న పెద్ద యాలకుల వేలాలలో సిక్కింలోని సింగటంలో పెద్ద గింజ యాలకుల ధర ముందు వారంతో పోలిస్తే రూ. 673.75 నుండి పెరిగి రూ.675, చిన్న గింజ సరుకు ధర రూ. 612.50 నుండి పెరిగి రూ.625 ప్రతి కిలోకు చేరగా, గ్యాంగ్టక్లో పెద్ద యాలకుల ధర రూ. 675, చిన్నవి రూ.575 ప్రతి కిలో స్థాయిలో స్థిరంగా ఉంది. పశ్చిమ బెంగాల్లోని సిలిగుడిలో పెద్ద గింజ ధర రూ. 735 నుండి పెరిగి రూ. 762.50, చిన్నగింజ రూ. 655 నుండి పెరిగి రూ. 690 ప్రతి కిలోకి చేరింది.

Comments

Popular posts from this blog