బలోపేతం చెందుతున్న పసుపు వాయిదా ధరలు

 

విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం దేశంలోని పసుపు ఉత్పాదక రాష్ట్రాలలో వచ్చే వారం నుండి రాబడులు ఊపందుకొనే అవకాశం ఉంది. అయితే ప్రత్యక్ష, పరోక్ష విపణిలలో కొనుగోళ్లు పెరుగుతున్నాయి. తద్వారా ధరలు తగ్గే అవకాశం లేదు. కాగా, ఏప్రిల్ వాయిదా సెటిల్మెంట్ తదనంతరం భవిష్యత్తులో హెచ్చు-తగ్గుల పరిస్థితి స్పష్టం కాగలదు. ఎందుకనగా స్పెక్యులేషన్స్ వ్యాపారులు వాయిదాలో భారీగా క్రయ విక్రయాలు కొనసాగించారు. అయితే నిశ్చయంగా ఏప్రిల్ తరువాత వాయిదా మార్కెట్లో ధర రూ. 8300-8500 చేరిన వెంటనే కొనుగోలు చేయడం శ్రేయస్కరం. ఎందుకనగా ప్రస్తుత ధరలను పరిగణిస్తే, రెత్తులు కూడా తక్కువ ధరతో సరుకు అమ్మకానికి విముఖత చూపే అవకాశం ఉంది.


 గత వారం దాదాపు అన్ని మార్కెట్లు మూసిఉన్నాయి. అయితే సోమవారం నుండి యధావిధిగా మార్కెట్లు తెరచుకున్న వెంటనే రాబడులు పోటెత్తే అవకాశం ఉంది. శీతలగిడ్డంగుల నుండి లభించిన సమాచారం ప్రకారం వరంగల్ ఎసిలలో మార్చి 30, 2022 నాటికి సుమారు 3,10,847 బస్తాల పాత సరుకు నిల్వలు ఉన్నాయి. అయితే, ఎన్సిడిఇఎక్స్ వద్ద గత సోమవారం ఏప్రిల్ వాయిదా రూ. 8764 తో ప్రారంభమైన తర్వాత శుక్రవారం వరకు రూ. 484పెరిగి రూ. 9248, మే వాయిదా రూ. 570 వృద్ధిచెంది రూ. 9380 వద్ద ముగిసింది. గత వారం ఆర్థిక సంవత్సర ముగింపు కారణంగా తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లాంటి పసుపు ఉత్పాదక మార్కెట్లు మూసి ఉన్నాయి. దీనితో మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్లో 20-25 వేల బస్తాల సరుకు రాబడిపై రాజాపురి రకం సరుకు రూ. 8400-10,000, నాణ్యమైన సరుకు రూ. 10,500-11,000, దేశీ కడప రకం పసుపు రూ. 6800-7400 ధరతో క్వాలిటీ ప్రకారం వ్యాపారమెంది.

Comments

Popular posts from this blog

శనగలు ధరలు పెరిగే అవకాశం మృగ్యం

అలసందలు