యాలకుల ధరలు



 పెద్ద యాలకుల వేలాలు


సిలిగుడి - మార్చి 24న పెద్ద యాలకుల వేలాలలో సిక్కింలోని సింగటంలో పెద్ద గింజ యాలకుల ధర ముందు వారంతో పోలిస్తే రూ. 675 నుండి పెరిగి రూ. 676.25, చిన్న గింజ సరుకు ధర రూ. 625 నుండి తగ్గి రూ. 617.50 ప్రతి కిలోకు చేరగా, గ్యాంగ్టక్లో పెద్ద యాలకుల ధర రూ. 675, చిన్నవి రూ. 575 ప్రతి కిలో స్థాయిలో స్థిరంగా ఉంది. పశ్చిమ బెంగాల్లోని సిలిగుడిలో పెద్ద గింజ ధర రూ. 762.50 నుండి తగ్గి రూ. 737.50, చిన్నగింజ రూ. 690 నుండి తగ్గి రూ. 667.50 ప్రతి కిలోకి చేరింది.


చిన్న యాలకులు 

బోడినాయకనూర్ తమిళనాడు, కేరళలోని వేలం కేంద్రాలలో గత - సోమవారం నుండి శనివారం వరకు 6 రోజులలో 12 వేలాలలో 6,43,937 కిలోల సరుకు రాబడి కాగా, రంజాన్ డిమాండ్ నేపథ్యంలో వ్యాపారుల కొనుగోళ్ళతో 6.20 లక్షల బస్తాల యాలకులు అమ్మకం అయ్యాయి. ఇందులో రైతులకు సోమవారం నాడు సగటున రూ. 838.38, గరిష్టంగా గురువారం నాడు రూ. 943.62 ప్రతి కిలో ధర లభించింది. నాణ్యమైన రకాలకు మంగళవారం నాడు గరిష్టంగా రూ. 1434, కనిష్టంగా సోమవారం రూ. 1143 ప్రతి కిలో ధర లభించింది. వ్యాపారస్తుల అంచనా ప్రకారం ఏప్రిల్లో రాబడులు పెరగగలవు. అంతేకాకుండా రంజాన్ సందర్భంగా వినియోగం కూడా అధికంగా ఉంటుంది. దీనితో వేలాలలో రాబడి అయ్యే మొత్తం సరుకు అమ్మకం అయ్యే అవకాశం కలదు.

Comments

Popular posts from this blog