పెరిగిన కొత్త జీలకర్ర రాబడులు

 

లభించిన సమాచారం ప్రకారం గత వారం గుజరాత్, రాజస్థాన్ లోని అన్ని మార్కెట్లలో కలిసి 1.50 లక్షల బస్తాలకు పెగ్డా జీలకర్ర రాబడి అయినప్పటికీ, మార్కెట్తో పాటు వాయిదా ధరలు వృ ద్ధిచెందాయి. ఏప్రిల్లో రాబడులు మరింత పెరిగి 3 లక్షల బస్తాలకు చేరే అవకాశం కలదు. ఇందుకు ముఖ్య కారణం ఈ ఏడాది ఉత్పత్తి తగ్గి, ధరలు వృద్ధిచెందడంతో రెత్తులు మొత్తం సరుకు విక్రయిస్తున్నారు. అనేక సంవత్సరాల తరువాత రెత్తులకు మంచి ధరలు లభిస్తున్నాయి. తద్వారా 2023లో విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. 


స్టాకిస్టులు అప్రమత్తమైనందున ధరలపై ఒత్తిడి పడడం లేదు. వచ్చే నెల నుండి కిరాణా వ్యాపారుల కొనుగోళ్లు పెరిగే అవకాశం కలదు. గత వారం మార్కెట్ ధరలు రూ. 400-500 పెరగగా, ఎన్సీడిఇఎక్స్ వద్ద సోమవారం జీలకర్ర మార్చి వాయిదా రూ. 20,890 తో ప్రారంభమై శుక్రవారం నాటికి రూ. 735 పెరిగి రూ. 21,625, ఏప్రిల్ వాయిదా రూ. 745 వృద్ధిచెంది రూ. 21,840 వద్ద ముగిసింది. ఏప్రిల్ 10 వరకు ధరలు తగ్గినట్లయితే, మే వాయిదా లాభదాయకంగా ఉండగలదు. 

గుజరాత్లోని ఉంజా మార్కెట్లో గత వారం 1 లక్ష నుండి 1 లక్ష 10 వేల బస్తాల సరుకు రాబడిపై యావరేజ్ సరుకు రూ.17,000 -17,900, మీడియం రూ. 18,500 -20,000, నాణ్యమైన సరుకు 21,500-22,600 మరియు రాజ్కోట్లో ప్రతి రోజు 2500 - 3000 బస్తాల కొత్త సరుకు రాబడిపై మీడియం రూ. 19,000-19,625, నాణ్యమైన సరుకు రూ. 19,650-20,000, యూరప్ క్వాలిటీ రూ. 20,000- 21,500 మరియు గోండల్ లో 1000 1200 బస్తాల రాబడిపె మీడియం రూ. 17,000–17,500, నాణ్యమైన సరుకు రూ. 20,000-20,500, బనాస్ కాంటా లో 3-4 వేల బస్తాల రాబడిపై రూ. 18,700-22,000, జామ్ జోధ్ పూర్, హల్వాడ్, జస్టన్, జామ్నగర్, జునాగఢ్ లో కలిసి 10-12 వేల బస్తాల రాబడిపే రూ. 17,500 -20,600 ధరతో వ్యాపారమెంది. రాజస్థాన్లోని మెడతాలో గత వారం 20–25 వేల బస్తాల రాబడిపై యావరేజ్ రూ.13,000-14,000, మీడియం రూ. 16,000-17,000, నాణ్యమైన సరుకు రూ. 19,000–20,000, సూపర్ఫెన్ రకం రూ.రూ.22,000-25,000, కేక్ లో 800-1000 బస్తాల రాబడిపై నిమ్ము P సరుకు రూ. 10,000-11,000, మీడియం రూ. 16,000-17,000, మీడియం బెస్ట రూ. 18,000–18,500, జోధ్పూర్ లో 2-3 వేల బస్తాల రాబడిపె మీడియం రూ. 17,500–18,200, నాణ్యమైనందుకు రూ. 20,500-21,600 ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog