మిరియాల ఉత్పాదక రాష్ట్రాలలో సమృద్ధిగా సరుకు నిల్వలు ఉన్నట్లు మరియు కేంద్ర ప్రభుత్వం రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని దిగుమతి అయిన సరుకు ధర రూ. 500 ప్రతి కిలోతో చెల్లింపు చేయాలని నిర్ణయించడంతో ధరలు మెరుగయ్యాయి. ఏడాది పొడగునా కనిష్టంగా రూ. 500, గరిష్టంగా రూ. 550 ప్రతి కిలో ధరతో వ్యాపారం కొనసాగగలదు. కొందరు వ్యాపారులు రూ. 540 ధరతో కొనుగోలు చేయడం వలన నష్టానికి గురవుతున్నారు.
కర్ణాటక రైతుల అమ్మకాలు పెరగడం, గిరాకీ లేకపోవడంతో గత రెండు వారాలలో ధర రూ. 14 తగ్గి రూ. 502, గార్బల్డ్ రూ. 522 ప్రతికిలోకు చేరింది. భారతీయ మిరియాలు, మసాలా వ్యాపారులు, ఉత్పాదక, తోటల యజమానుల సంఘం, కేరళ చాప్టర్ కో-ఆర్డినేటర్ కిషోర్ శ్యామ్ తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీ, కాన్పూర్ లాంటి వినియోగ కేంద్రాలలో వియత్నాం మిరియాల లభ్యత పెరగడంతో ధరలు మందకొడిగా ఉన్నాయి. అయితే తిరిగి అయితే సీజన్ ధరలు మెరుగుకావచ్చు. ఎందుకనగా శ్రీలంక పంటల కోతల సీజన్ సమాప్తమయింది. మేనెల నుండి కొత్త సరుకు రాబడి ప్రారంభం కాగలదు. అయితే ప్రస్తుతం శ్రీలంక మిరియాల ధర 6100 డాలర్లు ఉంది.
కొచ్చి -కొచ్చిలో గత బుధవారం నాడు గార్బల్డ్ మిరియాలు రూ. 523, అన్గార్బల్డ్ రూ. 503 మరియు శుక్రవారం నాడు రూ. 3 పెరిగి గార్బల్డ్ రూ. 526, అన్గార్బల్డ్ రూ. 506 మరియు కర్ణాటకలోని చికంగళూరులో కొత్త మిరియాలు రూ. 510, పాత సరుకు రూ. 520 ప్రతి కిలో ధరతో వ్యాపారమెంది.
03-10-2021 రాబోయే కాలంలో శనగల ధరలు రాణించే అవకాశం కనిపించడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. దేశంలో సరుకు నిల్వలు ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు