సిలిగురి : సిక్కింలోని సింగటంలో ఆగస్టు 11న నిర్వహించిన పెద్ద యాలుకుల వేలాలలో పెద్ద గింజ సరుకు ధర ముందు వారంతో పోలిస్తే రూ. 507.50 నుండి పెరిగి రూ. 518.75, చిన్న గింజ సరుకు రూ. 475 కు గాను రూ. 450 కి తగ్గగా
అస్సాంలోని గాంగ్క్లో పెద్ద గింజ సరుకు రూ. 500 నుండి పెరిగి రూ. 525, పశ్చిమ బెంగాల్లోని సిలిగురిలో పెద్దగింజ సరుకు రూ. 733.75 వద్ద నుండి తగ్గి రూ. 650, చిన్న గింజ సరుకు రూ.522.50 నుండి తగ్గి రూ. 521.25 కు పరిమితమెంది.
చిన్న యాలకులు
కొచ్చి: ప్రస్తుత (2022-23) సీజన్ కోసం దక్షిణాదిలో నిర్వహించిన వేలం కేంద్రం వద్ద కొత్త, పాత యాలకులు కలిసి గత వారం దాదాపు 7,71,654 కిలోల యాలకులు రాబడి కాగా 7,08,626 కిలోల సరుకు అమ్మకంపై మంగళవారం యావరేజ్ సరుకు ప్రతి కిలో రూ. 913.37 పలికిన ధర శనివారం నాటికి పెరిగి రూ. 1040.57, నాణ్యమైన సరుకు బుధవారం రూ. 1358 పలుకగా శనివారం నాటికి రూ. 1668 కి ఎగబాకింది. రాబోయే పది రోజులలో సరుకు రాబడులు మరింత పోటెత్తే అవకాశం ఉంది.
03-10-2021 రాబోయే కాలంలో శనగల ధరలు రాణించే అవకాశం కనిపించడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. దేశంలో సరుకు నిల్వలు ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు