రాబడులు తగ్గినప్పటికీ పురోగమించని పసుపు ధరలు

 



 గతవారం పసుపు ఉత్పాదక కేంద్రాలైన ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్రలలో భారీ వర్షాల వలన రాబడులు తగ్గినప్పటికీ, ధరలు స్థిరంగా ఉన్నాయి. అయితే ఎన్ డి ఇ ఎక్స్ వద్ద గత సోమవారం ఆగస్టు వాయిదా సోమవారం నాడు 7680తో ప్రారంభమైన తరువాత శుక్రవారం నాటికి రూ. 20 వృద్ధిచెంది రూ. 7700, సెప్టెంబర్ వాయిదా రూ. 50 పెరిగి రూ. 7800 వద్ద ముగిసింది. లభించిన సమాచారం ప్రకారం 2021-22 ఆర్థిక సంవత్సరంలో విదేశాలకు పసుపు ఎగుమతులు ముందు సంవత్సరంతో పోలిస్తే 16.70 శాతం తగ్గి 1,53,154 టన్నులకు చేరాయి. 2022-23లో (ఏప్రిల్-మే) ఎగుమతులు గత ఏడాదితో పోలిస్తే 26,881 టన్నుల నుండి 14-90 శాతం పెరిగి 30,639 టన్నులకు చేరాయి. ఏప్రిల్లో 13,762 టన్నుల సరుకు ఎగుమతి కాగా, మే నెలలో పసుపు ఎగుమతులు గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 13,598 టన్నుల నుండి 3500 టన్నులు పెరిగి 17,137 టన్నులకు చేరాయి. 


2023 కోసం ప్రముఖ ఉత్పాదక రాష్ట్రాలలో పంట విత్తడం కొన సాగుతోంది. అయితే ఆంధ్ర, మహారాష్ట్ర, తమిళనాడు లాంటి రాష్ట్రాలలో అధిక వర్షాల కారణంగా విస్తీర్ణం పెరగడం లేదు. మహారాష్ట్రలో లభ్యత అధికంగా ఉన్నందున స్టాకిస్టులు సరుకు కొనుగోలు చేయడం లేదు. ప్రస్తుతం దేశంలోని మార్కెట్లలో 22 వేల టన్నుల పసుపు రాబడి అవుతోంది. గత నెల ఇదే వ్యవధితో పోలిస్తే రాబడులు 38 శాతం మరియు గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 48 శాతం తక్కువగా ఉన్నాయి. దీనితో ధరలు ఎక్కువగా తగ్గడం లేదు. తమిళనాడులోని ఈరోడ్ మార్కెట్లో గత వారం 8-9 వేల బస్తాల సరుకు రాబడిపై కొమ్ములు రూ.6155-8249, దుంపలు రూ. 5899-6801, పెరుందురైలో 4-5 వేల బస్తాల రాబడిపై కొమ్ములు రూ. 5602-8309, దుంపలు రూ. 5199-7070 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


తెలంగాణలోని నిజామాబాద్ మార్కెట్లో గత బుధ, శుక్రవారాలలో కలిసి 8 వేల బస్తాల సరుకు అమ్మకంపె కొమ్ములు రూ. 6500-7500, దుంపలు రూ. 5800–6400 లోకల్ లూజ్ మరియు కొమ్ములు పాలిష్ సరుకు లారీ బిల్టి రూ. 8200–8300, దుంపలు రూ. 7300-7400, బంగ్లాదేశ్ కోసం కొమ్ములు రూ. 7500, వరంగల్లో 1000-1200 రాబడిపై కొమ్ములు రూ.6000-6200, P దుంపలు రూ. 5500-5800, కేసముద్రం మార్కెట్లో 800-1000 బస్తాలు కొమ్ములు రూ. 5000-6200, దుంపలు రూ. 5000-5600 ధరతో వ్యాపారమైంది. 

ఆంధ్రప్రదేశ్లోని దుగ్గిరాలలో గత వారం 1800-2000 బస్తాల సరుకు రాబడిపై నాణ్యమైన కొమ్ములు మరియు దుంపలు రూ. 5800-6200, మీడియం రూ. 5600-5700 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. 

మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్లో గత వారం 5-6 వేల బస్తాల సరుకు అమ్మకంపై రాజాపురి పసుపు నాణ్యమైన సరుకు రూ.7500-9000, దేశీ కడప రూ. 6100-6400, హింగోళిలో గత సోమ, బుధ మరియు శుక్రవారాలలో కలిసి 18 20 వేల బస్తాల సరుకు రాబడిపై కొమ్ములు రూ.6400-7200, దుంపలు రూ. 6100–6400, నాందేడ్లో 5-6 వేల బస్తాలు కొమ్ములు రూ. 6000-7500, దుంపలు రూ. 6000-6500, బస్మత్నగర్లో 3-4 వేల బస్తాల అమ్మకం కాగా, కొమ్ములు రూ. 6200 - 7200, దుంపలు రూ. 5800-6700 ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog

శనగలు ధరలు పెరిగే అవకాశం మృగ్యం

అలసందలు