వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్లో సింహభాగం మసాలా దినుసులదే

 

కేరళలో 1987 ఫిబ్రవరి 26న ఆవిర్భవించిన మసాలా బోర్డు 35వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన సమ్మేళనంలో వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ తమ ప్రసంగంలో భారత్ నుండి మసాలాల ఎగుమతులు మరింత విస్తృతం చేసేందుకు కృషి చేయాలని బోర్డును కోరారు. ప్రపంచ వ్యాప్తంగా భారత మసాలాల అసాధారణ బ్రాండ్ల మసాలాల ఎగుమతుల వృద్ధిపై దృష్టి సారించాలని కూడా ఆయన పేర్కొన్నారు. కరోనా విజృంభణతరుణంలో మసాలా ఎగుమతులు వృద్ధి చెందేందుకు తోడ్పాటు నందించిన రైతులు మరియు ఎగుమతి వ్యాపారుల కృషి ఎనలేనిదని ప్రశంసించారు. 


వార్షికోత్సవం సందర్భంగా తపాలా బిళ్లను ఆవిష్కరిస్తూ, వాతావరణ పరిస్థితుల ఆధారంగా చిన్న యాలకుల కోసం బీమా ప్రణాళికను కేరళతో పాటు దేశవ్యాప్తంగా అమలు చేయాలని గోయల్ సలహా ఇచ్చారు. కశ్మీర్లో పండిస్తున్న కుంకుమపువ్వు, నాగాలాండ్లోని మిర్చి, లైక్ దోంగ్ ని పసుపు మరియు ఉత్తరప్రదేశ్లోని కలౌంజి లాంటి మసాలాలకు అంతర్జాతీయ విపణిలో గుణాత్మకమైన గుర్తింపు పొందేందుకు కృ షి చేయాలని కూడా సూచించారు.


భారత మసాలా ఎగుమతులను 4 బిలియన్ డాలర్లకు వృద్ధి చెందేందుకు కృ షి చేసిన అన్ని కేటగిరీల భాగస్వాములు, చట్టపరమైన యూనిట్లు మరియు ప్రభుత్వ ఏజెన్సీల మంత్రి ప్రశంసించారు. అంతేకాకుండా, మసాలా ఉత్పాదకులు మరియు మసాలా ఎగుమతి వ్యాపారులతో మసాలా శ్రేణి కోసం పరస్పరం చర్చలు జరిపేందుకు ప్రభుత్వ మద్దతు ఉంటుందని కూడా ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భగా మసలాబోర్డు కార్యదర్శి సత్యన్ మాట్లాడూతూ, 1987 మసాలా ఎగుమతులు విలువ దృష్ట్యా 22.90 కోట్ల డాలర్లకు గాను శరవేగంతో వృద్ధి చెంది ప్రస్తుతం 418 కోట్ల డాలర్లను అధిగమించినట్లు తెలిపారు.



Comments

Popular posts from this blog

శనగలు ధరలు పెరిగే అవకాశం మృగ్యం

అలసందలు