గుంటూరు మార్కెట్లో గత వారం 4 రోజుల మార్కెట్లలో 3.10 లక్షల బస్తాల కొత్త మిరప రాబడి కాగా, మిగులు నిల్వలు సహా 3.30 లక్షల బస్తాల సరుకు అమ్మకం అయింది. ఇందులో కేవలం 20-30 శాతం డీలక్స్రకాలు ఉండడంతో ధరలు రూ.200-300 పెరిగాయి. కాగా మీడియం,మీడియం బెస్ట్ రకాల సరుకు వ్యాపారం అవుతోంది. ప్రస్తుతం రాబడులు తగ్గాయి.రైతులు కూడా ధరలు మెరుగ్గా ఉన్నందున కోల్డ్ స్టోరేజీలలో నిల్వ చేయడానికి బదులుగా సరుకు విక్రయానికే ఆసక్తి చూపుతున్నారు. గుంటూరు కోల్డ్ స్టోరేజీలలో వారంలో 50 వేల బస్తాల రాబడి కాగా, 45 వేల బస్తాల సరుకు అమ్మకం అయింది. ఇందులో రెండు నెలల క్రితం నిల్వ చేసిన సరుకు కూడా అమ్మకానికి మొగ్గు చూపుతున్నారు.
గుంటూరు మార్కెట్లో నాణ్యమైన తేజ కొత్త సరుకు రూ.15,000-18,000, డీలక్స్ రూ. 18,100-18,200, మీడియం రూ.14,000-14,900, బడిగ-355 రూ. 16,000-20,000, సింజెంట బ్యాడిగి రూ. 15,000-20,000, డీలక్స్ రూ. 20,200-20,500, డిడి నాణ్యమైన రకం రూ. 16,000-19,000, (భద్రాచలం) 341 రూ. 16,000-20,000, దేశీవాలి (341 రకం) రూ. 17,000-21,000, 2043 రూ. 16,000-23,500, బుల్లెట్ రకం సరుకు రూ. 13,000 -16,800, డీలక్స్ రూ. 16,900 -17,000, నెంబర్-5 రూ. 16,000-21,000, 334, సూపర్-10 రూ. 14,000-18,000, డీలక్స్ రూ. 18,100-18,300, 4884 రూ. 13,000 -16,000, 273 8. 15,000 -18,000, బంగారం రకం రూ. 13,500 -17,000, ఆర్మూర్ రకం రూ. 13,000 -16,000, రొమి రూ. 13,000-16,200, మరియు 577 రకం రూ. 14,000-18,000, సీడ్ రకం మీడియం బెస్ట్ రూ. 13,000-15,500, తాలు కాయలు తేజ రూ. 9500-10,500, డీలక్స్ లాల్కట్ రూ. 10,600-11,500, తాలు కాయలు రూ. 4500-8500, 341, డిడి తాలు కాయలు రూ. 9000-11,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. గుంటూరు శీతల గిడ్డంగులలో నిల్వ అయిన నాణ్యమైన తేజ రకం రూ. 15,000-18,000, మీడియం బెస్ట్ రూ. 13,500–14,900, బడిగ 355 రకం రూ. 16,000-20,000, సింజెంట బడిగ రకం రూ. 16,000-19,000, 334, సూపర్ 10 రకం రూ. 14,000-17,000, డీలక్స్ రూ. 17,200-17,500, మీడియం బెస్ట్ రూ. 12,500-13,900 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
తెలంగాణలోని వరంగల్లో గత బుధ, గురువారాలలో కలిసి 60-65 వేల బస్తాల కొత్త సరుకు రాబడిపై తేజ నాణ్యమైన సరుకు రూ. 15,000–18,000, 341 నాణ్యమైన సరుకు రూ. 19,000-21,000, వండర్ హాట్ సరుకు రూ. 20,000-23,500, 1048 రకం రూ. 15,000-17,200, దీపిక నాణ్యమైన రూ.20,000-23,500, 334 రూ. 15,000-17,500, టమాట నాణ్యమైన సరుకు రూ. 45,000-50,000, సింగిల్పట్టి నాణ్యమైన సరుకు రూ. 35,000-40,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
వరంగల్ కోల్డ్ స్టోరేజీలలో 30 మార్చి 2022 వరకు 11,15,943 బస్తాల మిర్చి నిల్వలు ఉన్నట్లు సమాచారం.
ఖమ్మంలో గత వారం 1 లక్ష బస్తాల కొత్త మిర్చి రాబడిపై తేజ నాణ్యమైన సరుకు రూ. 19,200, మీడియం రూ. 18,000-18,500, తాలుకాయలు నాణ్యమైన సరుకు రూ.9500-10,000 మరియు 5 వేల బస్తాల ఎసి సరుకు తేజ రూ. 18,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మరియు కేసముద్రం, మహబూబాబాద్ మార్కెట్లు మూసి ఉన్నాయి.
హైదరాబాద్లో గత వారం 12-15 వేల బస్తాల కొత్త సరుకు రాబడిపై తేజ నాణ్యమైన సరుకు రూ. 10,000–18,000, బడిగ డబ్బి నాణ్యమైన సరుకు రూ. 30,000–33,000, మీడియం రూ. 26,000-27,000, బడిగ రూ. 21,000-27,000, 273 మీడియం బెస్ట్ రూ. 16,000-18,000, సూపర్-10 నాణ్యమైన సరుకు రూ. 17,000-17,500, మీడియం రూ.14,000-16,500, సి-5 రూ. 18,500, మీడియం రూ.15,000-18000, తాలు కాయలు నాణ్యమైన తేజ రూ. 9000-10,000,మీడియం రూ.5000-8000, ఇతర రకాలు రూ. 4000-6000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
కర్ణాటకలోని బ్యాడ్గి లో సోమ, గురువారాలలో కలిసి 55-60 వేల బస్తాల కొత్త మిర్చి రాబడిపై డిబ్బి డీలక్స్ రూ. 32,000-36,000, నాణ్యమైన డబ్బి రూ. 28,000-32,000, కెడిఎల్ డీలక్స్ రూ.25,000-28,500, నాణ్యమైన సరుకు రూ.23,000-25,000, మీడియం రూ. 10,000-13,500, 2043 డీలక్స్ రూ.25,000-27,000, మీడియం రూ. 20,000-24,500, 5531 నాణ్యమైన సరుకు రూ. 18,000-20,700, మీడియం రూ. 14,000-16,500, సూపర్-10, 334 రూ. 13,500-17,000, తాలు కాయలు కెడిఎల్ రూ.2500-2800, సీడ్ రకం రూ. 6000-9000 మరియు సింధనూరులో మంగళవారం నాడు 8 వేల బస్తాల రాబడిపై డబ్బీ మిరప రూ. 35,000, బడిగ రకం రూ. 26,000-30,000, సింజెంట బ్యాడిగి రూ. 18,000-24,500, 5531 రకం రూ. 18,000-21,200, తేజ రకం రూ. 15,000-20,500, జిటి రకం రూ. 14,000-18,500 మరియు తాలు రూ.4000-9500 ధరతో వ్యాపారమెంది.
ఛత్తీస్గఢ్ లోని జగదల్పూర్లో ప్రతి రోజు 2 వేల బస్తాల సరుకు రాబడిపై తేజ మరియు సన్-గ్రో రూ. 16,500-18,000, 4884 రూ. 14,000-16,000, తాలు కాయలు తేజ రూ.9500-10,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. తమిళనాడులోని రామనాథపురంలో గత సోమవారం నాడు 4 వేల బస్తాల కొత్త సరుకు రాబడిపె రూ. 30,000-32,000, మీడియం రూ. 28,000-30,000, యావరేజ్ రూ.26,000-28,000 తాలు కాయలు రూ. 4800-5000 మరియు పరమకుడిలో 2 వేల బస్తాల రాబడిపై రూ. 25,000-30,000, తాలు రూ. 4800-5000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
03-10-2021 రాబోయే కాలంలో శనగల ధరలు రాణించే అవకాశం కనిపించడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. దేశంలో సరుకు నిల్వలు ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు