రికార్డు స్థాయిలో యాలకుల రాబడి

 


 మరో మూడు నెలలలో కొత్త సీజన్ ప్రారంభం అవుతుంది. రంజాన్ డిమాండ్ తగ్గుచున్నందున కిరాణా వ్యాపారులు తమ అవసరానికి అనుగుణంగానే సరుకు కొనుగోలు చేస్తున్నారు. యాలకుల వేలం కేంద్రాలలో గత వారం జరిగిన వేలాలలో 8,67,933 కిలోల సరుకు రాబడి కాగా, శనివారం కేవలం 1.65 లక్షల కిలోల సరుకు రాబడి అయింది. 


మొదటి వేలాలలో సగటు ధర సగటు ధర రూ. 880-85, నాణ్యమైన సరుకు రూ. 1393 ప్రతి కిలో ధరతో వ్యాపారమైంది. రెండవ = వేలాలలో రూ. 922.79, గరిష్టంగా రూ. 1395 ప్రతి కిలో ధరతో అమ్మకం అయింది. మంగళవారం నాడు 1.58 ల.కిలోల సరుకు రాబడిపై సగటున రూ. 884.94, రెండవ వేలాలలో రూ. 901.80 ధరతో అమ్మకం అయింది.


పెద్ద యాలకుల వేలాలు


సిలిగు ఏప్రిల్ 21న పెద్ద యాలకుల వేలాలలో సిక్కింలోని సింగటంలో పెద్ద గింజ యాలకుల ధర ముందు వారంతో పోలిస్తే రూ. 662.50 నుండి పెరిగి రూ. 678.15, చిన్న గింజ సరుకు ధర రూ. 637.50 నుండి తగ్గి రూ. 622.50 ప్రతి కిలోకు చేరగా, గ్యాంగ్టక్లో పెద్ద యాలకుల ధర రూ. 700, చిన్నవి రూ. 600 ప్రతి కిలో స్థాయిలో స్థిరంగా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ లోని సిలిగుడిలో పెద్ద గింజ ధర రూ. 782.50 నుండి పెరిగి రూ. 795, చిన్నగింజ రూ. 700 నుండి వృద్ధి చెంది రూ. 703.75 ప్రతి కిలోకి చేరింది.

Comments

Popular posts from this blog