పెసల ఉత్పత్తి పెరిగే సూచన



 దేశవ్యాప్తంగా ప్రస్తుత యాసంగి సీజన్ కోసం పంజాబ్ సహా,ఇతర ఉత్పాదక రాష్ట్రాలలో పంట ఉత్పత్తి పెరిగింది. రెతులకు మద్దతు ధరకు ధీటుగా ధర లభించడంతో ప్రస్తుత ఖరీఫ్ లో విస్తీర్ణం పెరుగుతుంది. రాజస్థాన్లో సరుకు నిల్వ చేసిన రెత్తులు తమ సరుకు విక్రయిస్తున్నారు. ప్రస్తుత ఖరీఫ్లో రాజస్థాన్లో పెసర పంట విస్తీర్ణం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 3.81 ల.హె. నుండి పెరిగి 6.23 ల.హె.కు విస్తరించింది. అయితే కర్ణాటకలో 2.75 ల.హె. నుండి పెరిగి 3.03 ల.హె. లకు చేరడంతో దేశంలో మొత్తం విస్తీర్ణం గత ఏడాదితో పోలిస్తే 8.17 ల.హె. నుండి పెరిగి 10.76 ల.హె.లకు చేరింది.


 మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లో దినసరి 25 వేల బస్తా లకు పైగా సరుకు రాబడిపై మధ్యప్రదేశ్ గ్రేవిటీక్లీన్ సరుకు చెన్నై డెలీవరి రూ. 6900,నాణ్యమైన చమ్కీ పెసలు లావు రకం రూ. 7400, మహారాష్ట్ర యాసంగి సరుకు రూ. 6900–7000 ధరతో వ్యాపారమైంది. 

ఆంధ్రప్రదేశ్లోని పొన్నూరులో పెసలు పాలిష్ రూ. 6750, ఆన్-పాలిష్ రూ. 6600, 

తెలంగాణలోని ఖమ్మంలో రూ. 6300, పప్పు సార్టెక్స్ రూ. 8850, నాన్-సార్టెక్స్ రూ. 8200, 

తమిళనాడులోని తంజావూరు, చిదంబరం ప్రాంతాలలో 250-300 బస్తాల కొత్త పెసల రాబడిపై రూ. 7000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. 

మధ్యప్రదేశ్లోని విపరియాలో 6-7 వేల బస్తాల రాబడిపై రూ. 5700-5800, జబల్ పూర్, దమోహ్, హడ్డా, హోశంగాబాద్, కరేలిలో ప్రాంతాలలో 7-8 వేల బస్తాల రాబడిపై మీడియం రూ. 4400-4700, నాణ్యమైన సరుకు రూ. 5900-6150, ఇండోర్ లో రూ. 5900-5000 మరియు 

ఉత్తరప్రదేశ్ లోని లలిత్ పూర్, అలహాబాద్ ప్రాంతాలలో ప్రతి రోజు 2-3 వేల బస్తాలు రూ. 5600-5750 ధరతో వ్యాపారమైంది. మహారాష్ట్రలోని జల్గాంచ్లో మధ్య ప్రదేశ్ ప్రాంతం పెసలు రూ.6200-7600,

 అహ్మద్ నగర్లో కొత్త సరుకు రూ.4900-6900, అకోలాలో కొత్త పెనలు రూ, 6500-7500, రాజస్థాన్ లోని అన్ని ఉత్పాదక కేంద్రాలలో కలిసి గత వారం 4-5 వేల బస్తాల రైతుల సరుకు రాబడిపై రూ.3500-6200, జైపూర్లో రూ.4500-6600 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.






Comments

Popular posts from this blog