త్వరలో యాలకులు పంటకోతలు ప్రారంభం

 


లభించిన సమాచారం ప్రకారం రాబోవు సీజన్ కోసం త్వరలో వెంట కోతలు ప్రారంభం కానున్నాయి. ఇంతవరకు వంట పరిస్థితి మెరుగ్గా ఉండడంతో రెత్తుల సరుకు అమ్మకాలు పెరగడం వలన గత వారం కూడా వేలాలలో 5,09,016 కిలోల సరుకు రాబడి కాగా, 4,70,483 కిలోల సరుకు అమ్మకం అయింది. రెత్తు లకు మంగళవారం నాడు కనిష్ట ధర రూ. 747.20, గరిష్ట ధర శుక్రవారం రూ. 847,46 ప్రతి కిలో ధరతో వ్యాపారమైంది. బుధవారం నాడు నాణ్యమైన రకాలకు కనిష్ట ధర రూ. 1121, శుక్రవారం గరిష్ట ధర రూ.1446 లభించింది. ఆగస్టు వరకు రాబడులు ఇదే విధంగా కొనసాగే అవకాశం కలదు.


ఎందుకనగా గత రెండు సంవత్సరా లుగా ఉత్పత్తి పెరుగుతోంది. కొత్త సీజన్ మిగులు నిల్వలతో ప్రారంభ మయ్యే అవకాశం కలదు. మసాలా బోర్డు వారి కథనం ప్రకారం సేంద్రీయ (ఆర్గానిక్) ప్రామాణిత యాలకుల వేలాలు ప్రతినెలకు ఒకసారి నిర్వ హించనున్నారు. దీనితో ఎగుమతులకు ప్రోత్సాహం లభించగలదు. అయితే గ్వాటిమాలాలో ఉత్పత్తి పెరుగుతున్నందున భారత్ నుండి ఎగుమతు లకు ప్రోత్సాహం లభించడం లేదు. కావున భారతదేశ యాలకులు మంచి వాసన, నాణ్యత విషయంలో మెరుగెనవిగా భావించబడుతున్నాయి.



రసాయనేతర యాలకుల ఇ-వేలం కోసం కసరత్తు


ఇదుక్కి : గడిచిన రెండేళ్లుగా యాలకులు సమృద్ధి ఉత్పత్తితో స్టాకిస్టులు సరుకు కొనుగోలుకు విముఖత చేస్తున్నందున రాబోయే సీజన్ (2022 ఆగస్టు - 23 జూలై)లో మూడవ విడత ఉత్పత్తిని దృష్టిలో పెట్టుకొని వేలం కేంద్రాల పెద్ద ప్రతి రోజు రాబడులు 1 లక్ష కిలోలకు కూడా చేరకపోయినప్పటికీ ప్రతి కిలో ధర రూ. 1000 నుండి తగ్గి 700-800 పరిమితమైంది. తద్వారా నాణ్యమైన సరుకును విదేశీ మార్కెట్లో విక్రయించేందుకు వీలుగా యాలకుల ధరల మందగమనానికి చెక్ పెడుతూ, క్రిమి సంహారక అవశేషాలు మరియు కృత్రిమ రంగులు పులుమని సరుకు కోసం జూలై నుండి ఇ వేదిక నుండి ప్రతి నెలా చివరి శనివారం వేలాలు నిర్వహించేందుకు మసాలా బోర్డు ఒక సరికొత్త ప్రణాళికను ఆవిష్కరించింది. ఇ-వేలంలో విక్రయించాలనుకునే రైతులు తమ నాణ్యమైన సరుకులో క్రిమి సంహారక అవశేషాలు మరియు కృత్రిమ రంగులు లేవని నిర్ధారించేందుకు సరుకు నమూనాలను మసాలా బోర్డుకు సమర్పించవలసి ఉంటుంది. ఇందుకోసం అయ్యే ఖర్చులో మూడో వంతు మసాలా బోర్డు


భరించగలదని అధికారులు పేర్కొన్నారు. ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ (ఐపిఎం) చే పరీక్షించబడుతుంది. యాలకులలో క్రిమి సంహారకాల ఉపయోగాన్ని తుడిచిపెట్టేందుకు ఉత్పాదకులకు అవగాహన పెంపొందించాల్సిన ఆవశ్యకత ఉందని బోర్డు అధికారులు. అభిప్రాయపడుతున్నారు. ఎందుకనగా వేలాలు నిర్వహించే పలు కంపెనీలు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సరుకునే అనుమతిస్తుండడమే. ఇందుకు ప్రధాన కారణం. ప్రస్తుతం కొనుగోలుదారులు కూడా సరుకు నాణ్యత విషయమై అప్రమత్తతతో వ్యవహరించే అవకాశం ఉందని కూడా బోర్డు అధికారులు  . తెలిపారు. ఇలాంటి సరుకుకు విదేశాల నుండి భారీ డిమాండ్ నెలకొనే అవకాశం ఉన్నట్లు కూడా సంకేతాలు అందుతున్నాయి. ప్రపంచంలో అతిపెద్ద యాలకుల వినియోగ దేశమైన సౌదీ అరబ్తో పాటు పలు దిగుమతి దేశాలు సరుకు నాణ్యత మరియు ఆహార భద్రత ప్రమాణాలను దృష్టిలో పెట్టుకొని రాజీ పడటంలేదని బోర్డు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. దీని వలన ఎగుమతి వ్యాపారులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కూడా తెలిసింది. క్రిమి సంహారక అవశేషాలను కొనుగొన్న 1500 కిలోల యాలకులను ఖతర్ ఇటీవల కొనుగోలు చేసేందుకు తృణీకరించినట్లు బోర్డు అధికారులు తెలిపారు. కొందరు ఉత్పాదుకులు మొక్కల నుండి సరుకు కత్తిరించే ముందు కూడా క్రిమి సంహారకాలను పిచికారీ చేస్తున్నందున అత్యంత సులభంగా అవశేషాలను కనుగొనబడుతున్నాయని అధికారులు తెలిపారు


గతంలో క్రిమి సంహారక అవశేషాలు మోతాదుకు మించిన స్థాయిలో పడినందున విదేశాల నుండి డిమాండ్ కొరవడిందని కూడా బోర్డు ఉన్నతాధికారులు తెలిపారు. కావున భారత మసాలా బోర్డు ప్రత్యేక వేలాలు నిర్వహించేందుకు ప్రణాళికను రచించిందని అధికారులు పేర్కొన్నారు. కరోనా మహమ్మారితో యాలకుల మార్కెట్కు కోలుకోలేని దెబ్బ పడింది. 2019 లో ప్రతి కిలో రూ. 7000 పలికిన ధర ప్రస్తుతం కేవలం 10 శాతానికే అనగా రూ. 600-800 మధ్య కదాలాడుతున్నది.



పెద్ద యాలకులు


సిలిగురి: యాలకుల కొత్త సీజన్ తరుముకొస్తున్నందున స్టాకిస్టులు తమ నిల్వ సరుకు శరవేగంతో విక్రయిస్తున్నారు. తద్వారా ధర ప్రతి కిలోకు రూ. 100-125 పతనమయ్యాయి. సిక్కింలోని సింగటంలో జూన్ 30న నిర్వహించిన పెద్ద యాలుకుల వేలాలలో పెద్ద గింజ సరుకు ధర ముందు వారంతో పోలిస్తే రూ.650 నుండి తగ్గి రూ. 550, చిన్న గింజ సరుకు రూ. 75 తగ్గి రూ.500 మరియు అస్సాంలోని గాంగ్జ్బెక్లో పెద్ద గింజు సరుకు రూ.625 నుండి తగ్గి రూ.525,అయితే పశ్చిమ బెంగాల్లోని సిలిగురిలో పెద్దగింజ సరుకు గత వారంతో పోలిస్తే రూ.682.50 నుండి పెరిగి రూ.713.50 కి చేరగా, చిన్న గింజ సరుకు రూ.567.50 నుండి తగ్గి రూ.570 కు పరిమితమైంది.






Comments

Popular posts from this blog