భారీగా విస్తరించనున్న పత్తి సేద్యం

 


తమిళనాడు రైతులకు ఈసారి పత్తి పంటపై లాభాసాటి ధరలు గిట్టుబాటైనందున డెల్టా జిల్లాలలో పత్తి సేద్యం గత ఏడాదితో పోలిస్తే అదనంగా 40 శాతం మేర విస్తరించగలదని సంకేతాలు అందుతున్నాయి. యాసంగిలో వరి సేద్యానికి బదులు పత్తి సేద్యం చేపట్టినట్లు వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొన్నారు. తద్వారా ట్రిచి, తిరువలూరు, నాగపట్నం మరియు తంజావూరులో పత్తి సేద్యం గత ఏడాదితో పోలిస్తే 50 వేల ఎకరాల నుండి 84 వేల ఎకరాలకు విస్తరించినట్లు తెలుస్తోంది.


 ఎందుకనగా, తిరువలూరులో 16,250 ఎకరాల నుండి పెరిగి 41,250 ఎకరాలు, తంజావూరులో 5 వేల ఎకరాల నుండి 8 వేల ఎకరాలు, నాగపట్నంలో 3 వేల ఎకరాల నుండి 5 వేల ఎకరాలకు విస్తరించగా,  గత ఏడాదితో పోలిస్తే 25 వేల ఎకరాల నుండి 30 వేల ఎకరాలకు విస్తరించనున్నట్లు తెలుస్తోంది. పత్తి మరియు వరి ప్రతి ఎకరం సాగు వ్యయం రూ. 30,000కు గాను పత్తి ఆదాయం రూ. 1.50 లక్షలు గిట్టుబాటవుతుండగా. వరి పంటపై కేవలం రూ. 60,000 మాత్రమే లభిస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొన్నారు. తిరువలూరు, తంజావూరు మరియు నాగపట్నంలో సాంబా మరియు తలాఫీ (ఖరీఫ్ మరియు రబీ) పంట కోతల తర్వాత ఫిబ్రవరి చివరి వారం నుండి మార్చి మొదటి వారం వరకు పత్తి సేద్యం చేపడుతుంటారు. ఈ పంట జూలై-ఆగస్టులో కోతకు సిద్ధమవుతుంటుంది. ట్రిచి జిల్లాలో రైతులు ప్రతియేటా జూలై 15 - ఆగస్టు 15 మధ్యకాలంలో పత్తి సేద్యం చేపడుతుంటారు. ఈ ఏడాది విస్తీర్ణం గత ఏడాదితో పోలిస్తే 25 వేల ఎకరాల నుండి పెరిగి 30 వేల ఎకరాలకు విస్తరించే అవకాశం ఉంది.




ప్రపంచ వ్యాప్తంగా పత్తి ధరల బలహీనత 


 పత్తికి కొరవడుతున్న డిమాండ్, బలపడుతున్న అమెరికా డాలర్ మరియు ఇబ్బడిముబ్బడిగా విస్తరిస్తున్న సేద్యం వలన ఉత్పత్తి పెరిగే అంచనాతో ధరలు కుంగుబాట పట్టే అంచనాతో ప్రపంచ మార్కెట్ అప్రమత్తమైందని వ్యాపారులు పేర్కొన్నారు. గత వారం ఐసిఇ ఎక్స్చేంజి వద్ద పత్తి వాయిదా ధర కేవలం ఒక్క రోజులో ప్రతి పాండుకు 30 సెంట్లు పతనమైంది. తద్వారా జూలై వాయిదా ప్రతి పౌండుకు 100 సెంట్లు తగ్గి 96.86 సెంట్లు మరియు కండీ ధర రూ. 60,100 కు పరిమితం కాగా, అక్టోబర్ వాయిదా 107.35 సెంట్లు మరియు కండీ ధర రూ. 66,600, డిసెంబర్ వాయిదా 96.57 సెంట్లు, కండీ ధర రూ. 59,625 కు పరిమితమైనందున భారతదేశంలో పత్తి ధరలు 10 శాతానికి పైగా దిగజారాయి. ప్రపపంచ వ్యాప్తంగా తగ్గిన ధరలు మరియు దిగుమతులకు తెరలేపినందున ఈ ఏడాది సెప్టెంబర్లో ముగియనున్న మార్కెటింగ్ సీజన్లో పత్తి దిగుమతులు 20 లక్షల బేళ్లను అధిగమించగలవని భావిస్తున్నారు. కాగా 


ఎగుమతులు 40-42 లక్షల బేళ్ల వద్ద పరిమితి విధించవచ్చు. ఎందుకనగా, భారత్ నుండి ఇప్పటి వరకు 40 లక్షల బేళ్ల సరుకు ఎగుమతి కావడమే ఇందుకు నిదర్శనం. గత సీజన్లో 78 లక్షల బేళ్లు ఎగుమతి అయ్యాయి. దేశీయ మార్కెట్లో నాణ్యమైన పత్తి ధర ప్రతి కండీ (365 కిలోలు) రూ. 30,000, మీడియం మరియు యావరేజ్ సరుకు రూ. 75,000 లేదా ఇంతకంటే తక్కువ ధరతో వ్యాపారమవుతున్నది. ధరలు తిరోగమనం పట్టినందున గత నెల నూలు ధరలు 10 శాతం తగ్గి 30 సిసిహెచ్ నూలు ముందు నెలతో పోలిస్తే రూ. 410-11.5 నుండి తగ్గి 360-370 ప్రతి కిలో వద్ద స్థిరపడింది. 2021-22. కోసం కేంద్ర ప్రభుత్వం పత్తి కోసం ప్రతి క్వింటాలుకు రూ. 5726 కనీస మద్దతు ధర నిర్ధారించగా 2022-23 కోసం రూ. 5080 కి పెంచింది. అయితే, ప్రస్తుతం దేశంలో వ్యవసాయ మార్కెట్ యార్డులలో మాడల్ ధర సగటున రూ.10,803 వద్ద కదలాడుతున్నది.



Comments

Popular posts from this blog

శనగలు ధరలు పెరిగే అవకాశం మృగ్యం

అలసందలు