తగ్గిన బఠాణీల ధరలు

 


వ్యాపారస్తుల కథనం ప్రకారం ఈ ఏడాది బఠానీల ఉత్పత్తి పెరు గడం మరియు సీజన్ ప్రారంభం నుండి ధరలు తగ్గడంతో ఇంతవరకు రెతులు, స్టాకిస్టుల వద్ద సుమారు 35 శాతానికి మించి సరుకు నిల్వలు ఉన్నాయి. వినియోగ రాష్ట్రాలలో ఈ ఏడాది శనగలు, కాబూలి శనగల ధరలు అందుబాటులో ఉండడంతో బఠానీల వినియోగం తగ్గింది. తద్వారా గతవారం ఉత్పాదక కేంద్రాలలో డిమాండ్ కొరవడినందున ధర రూ.50-75 తగ్గింది. 


రబీ సీజన్లో విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. ఇందుకు ముఖ్య కారణమేమనగా, రెత్తులకు కొత్త వంగడం వలన పంట దిగు బడి పెరుగుతోంది. తద్వారా దీపావళి తరువాత స్టాకిస్టుల అమ్మకాలు ఉండగలవు.. ఉత్తరప్రదేశ్లోని మహోబాలో ప్రతి రోజు 2500 బస్తాల రాబడిపై ఆన్-పాలిష్ సరుకు.. రూ. 1500– 4700, పాలిష్ సరుకు రూ. 4800-5100, ఝాన్సీలో 1000-1200 బస్తాలు రూ. 3500-4500, ఆగ్రాలో రూ. 4500, ఉరైలో 800-1000 బస్తాల తెల్ల బఠాణీల రాబడిపై రూ. 4270 -5000 మరియు 1500 బస్తాల ఆకుపచ్చ బఠాణీలు రూ. 3200 – 3350, కాన్పూర్లో ఉత్తరప్రదేశ్ సరుకు రూ. 1625 - 4825, మధ్య ప్రదేశ్ సరుకు రూ.4575-4775 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog