ఎగుమతి డిమాండ్తో బలపడిన నువ్వులు

 

 ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో జూన్ 30 వరకు దేశంలో నువ్వుల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 1.08 ల.హె. నుండి తగ్గి 97 వేల హెక్టార్లకు పరిమితమైందని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తమ నివేదికలోపేర్కొన్నది. గుజరాత్లో ప్రస్తుత ఖరీఫ్ సీజన్ కోసం ప్రభుత్వం విడుదల చేసిన నువ్వుల ఉత్పత్తి ముందస్తు అంచనా ప్రకారం 33,270 టన్నులు, యాసంగి ఉత్పత్తి 9,971టన్నులు కలిసి మొత్తం 42,241 టన్నులు ఉండగలదనే అభిప్రాయం వ్యక్తం చేసింది.


ఇటీవల దక్షిణ కొరియా 12 వేల టన్నుల నువ్వుల కొనుగోలు కోసం టెండరు.విడుదల చేయగా కనిష్ట ధర 1736-1.772 డాలర్లు ప్రతి టన్ను ధరను ప్రతిపాదించిన భారత వ్యాపారులు టెండరు కైవశం చేసుకోగా 11,133 టన్నుల కోసం ఆర్డరు లభించింది. తద్వారా దేశంలో నువ్వుల ధరలకు మద్దతు లభిస్తున్నది. ఖరీఫ్ సీజన్ నువ్వులు ముంద్రా ఓడరేవు డెలివరి రూ.15,100-15,200, సార్టిక్స్ నాణ్యమైన రూ. 12,100, యాసంగి సీజన్ కొత్త సరుకు రూ. 11,400 ప్రతి క్వింటాలు..ధరతో ఎగుమతి వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం, చీపురుపల్లి ప్రాంతాలలో యాసంగి సీజన్ కొత్త సరుకు రాబడులు ప్రారంభమయ్యాయి. కడప, బద్వేలు, చాగలమర్రి, ఆళ్లగడ్డ, మెదు కూరు, వెంపల్లి, దువ్వూరు ప్రాంతాలలో రూ.8200-8900, ఒంగోలులో రూ. 9200 ప్రతి క్వింటాలు మరియు బద్వేలు సరుకు ప్రతి 75 కిలోల బస్తా విరుధ్ నగర్ డెలివరీ రూ. 7500 ధరతో వ్యాపారమైంది. నరసారావుపేట, సత్తెనపల్లి ప్రాంతాలలో ఎర్రనువ్వులు రూ. 8500-8800 ప్రతి క్వింటాలు మరియు 75 కిలోల బస్తా ఈరోడ్ డెలీవరి రూ. 7300 మరియు విజయనగరం, నరసరావుపేట ప్రాంతాలలో ఎర్రను వ్వులు రూ. 8500-8900 ప్రతిక్వింటాలు ధరతో వ్యాసారమైంది. తెలంగాణలోని నిజామాబాద్, మెట్ పల్లి, ఆదిలాబాద్ ప్రాంతాలలో గత వారం 10 వాహనాల నువ్వుల రాబడిపై రూ. 10,200-10,900 ధరతో వ్యాపారమె గుజరాత్, మహారాష్ట్ర, మధ్య ప్రదే శ్రీ కోసం రవాణా అవుతున్నది.


పశ్చిమబెంగాల్లోని బెల్గా, ఖరగ్ పూర్, మిడ్నపూర్ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలకు దాదాపు 20 శాతం మేర పంటకు నష్టం వాటిల్లింది. ఈ ప్రాంతాలలో ప్రతి రోజు 6-7 లారీల కొత్త సరుకు రాబడిపై అన్-క్లీన్ రూ. 7900-8000 లోకల్ లూజ్, తమిళనాడు డెలివరి రూ. 9100-9200 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. గుజరాత్లోని రాజ్ కోట్, జూనాగఢ్, గోండల్, జీత్ పూర్, జామ్ జోధ్ పూర్, హల్వాడ్, జామ్నగర్ మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లలో కలిసి ప్రతి రోజు 20 వేల బస్తాల: యాసంగి నువ్వుల రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 11,300- 11,500, మీ. డియం రూ. 11,000-11,200, యావరేజ్ సరుకు రూ. 10,250-10,500 మరియు 15 వేల బస్తాల నల్ల నువ్వుల రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 12,750-13,250, జెడ్-బ్లాక్ రూ. 12,000-12,750, మీడియం రూ. 11,500-11,625, క్రషింగ్ సరుకు రూ. 8200-9000 ధరతో వ్యాపారమైంది. మధ్యప్రదేశ్లోని నిమచ్లో గత వారం 4-5 వేల బస్తాల రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 11,200–11,400, మీడియం రూ. 10,900–11,000, యావరేజ్ సరుకు రూ. 10,300-40,700, జావ్రాలో 2. వేల బస్తాలు రూ. 10,000–11,000, గ్వాలియర్లో హల్లింగ్ సరుకు రూ.11,500 (జిఎస్టితో), 99.1 రకం రూ. 11,500, సార్టెక్స్ రూ.12,000, కాన్పూర్లో హల్లింగ్ సరుకు రూ. 11,400-11,600 ధరతో వ్యాపారమైంది. తమిళనాడులోని శివగిరి, కొడుముడి, త్రిచంగోడ్, అవిల్పుందరె ప్రాంతాలలో వారాంతపు సంతరోజు 1500–2000 బస్తాలు, తిరుకోని లూరు, విల్లుపురం, విరుధచలం, కల్లకుర్చి, బోత పాడి ప్రాంతాలలో ప్రతి రోజు కేవలం 2 వేల బస్తాల కొత్త నువ్వుల రాబడిపై ప్రతి 80. కిలోల బస్తా రూ. 8500-11,800 ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog