మొక్కజొన్న విక్రయించేందుకు దిగ్గజ రైతులు విముఖత - బలపడుతున్న ధరలు



ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో జూలై 1 నాటికి దేశవ్యాప్తంగా మొక్కజొన్న సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 3.06 ల.హె. తగ్గి 19.03 ల.హె.కు విస్తరించినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ విడుదల చేసిన తమ నివేదికలో పేర్కొన్నది. కర్ణాటకలో గత ఏడాదితో పోలిస్తే 30 వేల హెక్టార్లు తగ్గి 7.18 ల.హె.కు పరిమితమైంది.గుజరాత్లో మొక్కజొన్న ఉత్పత్తి ఖరీఫ్ సీజన్ కోసం 5.74 ల.ట., గ్రీష్మకాలంలో 2.28 ల.ట. కలిసి మొత్తం 8.03 ల.ట. ఉండగలదని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పై తమ ముందస్తు అంచనాలో పేర్కొన్నది. ఆంధ్రప్రదేశ్లోని తెనాలి మరియు పరిసర ప్రాంతాలలో మొక్కజొన్న రాబడులు చరమాంకంలో పడ్డాయి. ఎందుకనగా, భవిష్యత్తులో ధరలు భారీగా పెరిగే అంచనాతో సరుకు విక్రయించేందుకు దిగ్గజ రైతులు విముఖత వ్యక్తం చేస్తుండడమే ఇందుకు నిదర్శనం. తద్వారా స్థానిక పార్టీ పరిశ్రమలు రూ.2450 ప్రతి క్వింటాలు ధరతో కొనుగోలు చేస్తున్నారు.


విజయనగరం, సాలూరు, చీపురుపల్లి ప్రాంతాల శీతల గిడ్డంగుల నుండి ప్రతి రోజు 10-15 వాహనాల సరుకు అమ్మకంపై రూ. 2300, పోర్టు డెలివరి రూ. 2400, హిందూపూర్, నంద్యాల, మడకశిర ప్రాంతాలలో 8-10 వాహనాల సరుకు రాబడిపై రూ. 2350-2400, బెంగుళూరు, మైసూరు డెలివరి రూ.2550 మరియు తెలగాణలోని నాగర్ కర్నూలు, ఖమ్మం, వరంగల్, కేసముద్రం ప్రాంతాలలో 4-5 వేల బస్తాలు రూ.2250-2450 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


మధ్య ప్రదేశ్ లోని నీమచ్ గత వారం పసుపుపచ్చ సరుకు రూ.2350, మీడియం రూ. 2250-2300, గజ్జర్ రకం రూ. 250-300 మరియు ఝార్ఖండ్ లోని రాంచీ, లాహర్దాగా, హజారీబాగ్ ఉత్పాదక ప్రాంతాలలో ప్రతి రోజు 40-50 వాహనాల సరుకు రాబడిపై స్థానికంగా రూ. 2300-2350, కటక్ డెలివరి రూ. 2400 -2450, బీహార్ లోని బెగు సరాయ్, ఖగాడియా, గులాబ్బాగ్, దర్భాంగా, పూర్ణియా, సీతాముడి ప్రాంతాల మార్కెట్లలో 50-60 వేల బస్తాల రాబడిపై రూ. 2300-2350 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై పశ్చిమ బెంగాల్ కోసం రవాణా అవుతున్నది.



తమిళనాడులోని దిండిగల్లో ప్రతి రోజు 8-9 వాహనాల మొక్కజొన్న రాబడి పై రూ. 2400-2450, ఒట్టవన్ చత్రం, అరియలూరు, పెరంబూరు ప్రాంతాలలో 10-15 వాహనాలు రూ.2430-2480, ఉడుముల్ పేట, నమక్కల్పేట, ఈరోడ్ డెలివరి రూ. 2660 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. కర్ణాటకలోని చిత్రదుర్గ్, చెల్లకేరి, దావణగెరి, బళ్లారి, రాణిబెన్నూర్ ప్రాంతాలలో ప్రతి రోజు 6-7 వేల బస్తాలు సరుకు రాబడిపై రూ.2500-2550, నమక్కల్ డెలివరి రూ. 2630-2680 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. 

Comments

Popular posts from this blog