పురోగమిస్తున్న పసుపు వాయిదా ధరలు

 


ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రలో రుతుపవనాల వర్షాలు జాప్యమైనందున పసుపు సేద్యం క్షీణించే అంచనాతో పెరిగిన చిన్నతరహా మసాలా యూనిట్ల కొనుగోళ్లు, నెలకొన్న ఎగుమతి డిమాండ్తో ధర ప్రతి క్వింటాలుకు రూ. 150-200 వృద్ధి చెందింది. ఎన్సిడిఇఎక్స్ వద్ద గత సోమవారం జూలై వాయిదా రూ. 7772 ప్రారంభమై శుక్రవారం నాటికి రూ. 128 క్షీణించి రూ. 7900, ఆగస్టు వాయిదా రూ. 136 లాభంతో రూ. 8000 వద్ద ముగిసింది.


ఈ ఏడాది జూలై 1 నాటికి వరంగల్ శీతల గిడ్డంగులలో పసుపు నిల్వలు 4 లక్షల బస్తాల సరుకు అందుబాటులో ఉన్నట్లు వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ విడుదల చేసిన తమ నివేదికలో పేర్కొన్నది. నిజామాబాద్లో కూడా గతేడాదితో పోలిస్తే పెరిగి 8 లక్షల బస్తాలకు చేరగలవని భావిస్తున్నారు. అయితే, మహారాష్ట్ర మరియు తెలంగాణలోని మెట్పల్లి ప్రాంతంలో పసుపు సేద్యం గత ఏడాదితో పోలిస్తే వెనుకబడినట్లు సంకేతాలు అందుతున్నాయి. అంతేకాకుండా, 3. కొందరు రైతులు సోయాచిక్కుడు సేద్యం ఆసక్తి కనబరుస్తున్నట్లు కూడా తెలిసింది. తద్వారా ఈసారి విస్తీర్ణంపై కొంతమేర కుంటుపడే అవకాశం కనిపిస్తున్నది.


నిజామాబాద్ మార్కెట్లో గత వారం 12-13 వేల బస్తాల సరుకు రాబడిపై కొమ్ములు రూ.6500-7500, దుంపలు రూ. 5700-6200, కొమ్ములు పాలిష్సరుకు రూ. 8200-8300, దుంపలు రూ. 7100-7200 మరియు బంగ్లాదేశ్ కోసం లారీ బిల్టి కొమ్ములు రూ. 7600 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


వరంగల్లో గత వారం 8000-1000 బస్తాల పసుపు రాబడిపై కొమ్ములు రూ.6000-6200, దుంపలు రూ. 5600-5700, కేసముద్రం మార్కెట్లో 3 వేల 8 బస్తాలు కొమ్ములు రూ. 5000-6200, దుంపలు రూ.5000-6000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. 

ఆంధ్రప్రదేశ్లోని దుగ్గిరాలలో గత వారం 2500 బస్తాల శ్రీ సరుకు రాబడిపై కొమ్ములు మరియు దుంపలు రూ. 5800-6200, మీడియం రూ. 5600-5800, సేలం రకం రూ.6300-6400 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

 మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్లో గత వారం 10-12 వేల బస్తాల సరుకు అమ్మకంపై రాజాపురి పసుపు రూ. 7500-8500, దేశీ కడప రకం రూ. 5800-6500, హింగోళిలో గత సోమ మరియు శుక్రవారాలలో కలిసి 18-20 వేల బస్తాల సరుకు రాబడిపై కొమ్ములు రూ.6700-7200, దుంపలు రూ. 6200 6500, నాందేడ్లో 4-5 వేల బస్తాలు కొమ్ములు రూ. 6000-6300, దుంపలు రూ. 5800-8000, 

బన్మత నగర్లో 2 వేల బస్తాల సరుకు అమ్మకంపై కొమ్ములు రూ. 5500-7000, దుంపలు రూ.5500-6500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. తమిళనాడులోని ఈరోడ్ మార్కెట్లో గత వారం 5-6 వేల బస్తాల సరుకు రాబడిపై కొమ్ములు రూ.6394-6599, దుంపలు రూ. 2337110, పెరుందురైలో 3 వేల బస్తాలు కొమ్ములు కొత్త సరుకు రూ. 5969–7594, దుంపలు రూ. 5255-6869 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog