బలోపేతం చెందిన ఆముదాల వాయిదా ధరలు



 గుజరాత్లో 2021-22 సీజన్ కోసం ఆముదాల ముందస్తు ఉత్పత్తి అంచనా 14.01 అ.ట. ఉండగలదని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదికలో తమ అభిప్రాయం వ్యక్తం చేసింది. గత సోమవారం ఎన్ సిడి ఇఎక్స్ వద్ద జూలై వాయిదా రూ. 7200 తో ప్రారంభమై శుక్రవారం నాటికి రూ. 325 వృద్ధి చెంది రూ. 7526, ఆగస్టు వాయిదా రూ.280 పెరిగి రూ. 7574 వద్ద ముగిసింది.


 గుజరాత్లోని అన్ని మార్కెట్లలో కలిసి ప్రతి రోజు 40 వేల బస్తాలు ఆముదాలు రాబడి కాగా రూ. 7100-7250, మీడియం రూ. 6800-7000 మరియు రాజస్తాన్లో ని మార్కెట్లలో 10 వేల బస్తాలు రూ. 7000-7150 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, గిద్దలూరు, వినికొండ మరియు పరిసర ప్రాంతాల అన్ని మార్కెట్లలో కలిసి ప్రతి రోజు రాబడులు 500-600 బస్తాలకు పరిమితం కాగా, నాణ్యమైన సరుకు రూ. 7000-7150, మీడియం రూ.6600-6800 ప్రతి క్వింటాలు మరియు నరసరావుపేటలో బిఎస్ఎస్ నూనె ప్రతి 10 కిలోలు రూ. టాక్స్ - పెయిడ్ కమర్షియల్ రూ. 1620, పిండి 100 కిలోలు రూ. 2350-400 ధరతో వ్యాపారమైంది. తెలంగాణలోని మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, దేవరకద్ర, జడ్చర్ల మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లలో కలిసి ప్రతి రోజు 300 బస్తాల సరుకు రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 7000-7100, హైదరాబాద్లో ఆముదం గింజలు రూ.7500 ప్రతి క్వింటాలు మరియు నూనె 10 కిలోలు రూ. 1840, కమర్షియల్ రూ. 1600 టాక్స్-పెయిడ్ మరియు పిండి 100 కిలోలు రూ. 2050-2100 ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog