బలోపేతం చెందిన జీలకర్ర వాయిదా ధరలు



 దేశంలో సరుకు కొనుగోలు కోసం కనుమరుగైన కిరాణా వ్యాపారులు నాణ్యమైన సరుకు విక్రయించేందుకు విముఖత వ్యక్తం చేస్తున్న దిగ్గజు రైతులు మరియు కొరవడిన ఎగుమతి డిమాండ్లో గత వారం పరోక్ష మార్కెట్లో జీలకర్ర ధర ప్రతి క్వింటాలుకు రూ.400-500 పతనమైనప్పటికీ ప్రత్యక్ష మార్కెట్లో ధరలకు నిలకడ చేకూరింది. ఎన్సీడిఇ ఎక్స్ వద్ద గత సోమవారం జూలై వాయిదా రూ.2,100 ప్రారంభమైన తర్వాత శుక్రవారం నాటికి రూ. 500 వృద్ధి చెంది రూ. 21,600, ఆగస్టు రూ. 530 పెరిగి రూ. 21, 760 వద్ద ముగిసింది. 


గుజరాత్లోని ఊంఝా మార్కెట్లో గత వారం 25-26 వేల బస్తాల జీలకర్ర రాబడిపై యావరేజ్ సరుకు రూ.15,000-16,200, మీడియం రూ. 18,500-19,200, నాణ్యమైన సరుకు రూ. 20, 200-21,300, రాజ్కోట్లో 2 వేల బస్తాలు యావరేజ్ సరుకు రూ. 18,000-19,250, మీడియం రూ. 19,300-19,750, నాణ్యమైన సరుకు రూ. 19,800-20,125, యూరప్ రకం రూ. 20,150-20,500, కిరాణా రకం రూ, 20,500-20,750 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. రాజస్తాన్ లోని మెడతా మార్కెట్లో గత వారం 2 వేల బస్తాల సరుకు రాబడిపై మీడియం రూ.! 18,000–18,500, నాణ్యమైన సరుకు రూ. 20,000-20,800, జోధ్పూర్లో 2-3 వేల బస్తాలు మీడియం రూ. 14,000-15,000, నాణ్యమైన సరుకు రూ. 19,00-20,000, నోఖాలో 500-600 బస్తాలు మీడియం రూ. 17,000-17,800,నాణ్యమైన సరుకు రూ. 18,500-19,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. 



సోంపు -- 


ఊంఝా ? గుజరాత్లోని ఊంఝా మార్కెట్లో గతవారం 5-6 వేల బస్తాల సోంపు రాబడిపై యావరేజ్ సరుకు రూ.9500-10,200, మీడియం రూ. 10,700-11,500, నాణ్యమైన సరుకు రూ. 12,000-12,250, రాజస్తాన్లోని మెడతాలో 2 వేల బస్తాలు, పాలి, జోధ్ పూర్ మరియు ఇతర ఉత్పాదక మార్కెట్లలో కలిసి 1500-2000 బస్తాల సరుకు రాబడిపై యావరేజ్ సరుకు రూ. 95000-10,000, మీడియం రూ. 10,500-11,300, మీడియం బెస్ట్ రూ.. 13,000–13,200 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog