ఊపందుకున్న శనగల కొనుగోళ్లు - పురోగమిస్తోన్న ధరలు

 


దేశంలో ఈసారి నైరుతి రుతుపవనాల వర్షాలు తగ్గినందున ఖరీఫ్ రాం వెనుకబడింది. ఇందులో మినుములు, కందుల విస్తీర్ణం తగ్గినందున శనగలకు మద్దతు లభిస్తున్నది. ఇదే సమయంలో ధరలపై స్టాకిస్టులు బిగిస్తున్న పట్టు మరియు పప్పు మిల్లుల డిమాండ్తో శనగల ధర ప్రతి క్వింటాలుకురూ. 150-200, కాబూలీ శనగలు రూ. 300 వృద్ధి చెందాయి.


 అయితే, దేశంలో సరుకు నిల్వలు సరిపడునంతగా అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ కొనుగోళ్లు దాదాపు 29 ల.ట. దాటాయి. అంతేకాకుండా అపరాలు, నూనెగింజల ధరలపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నది. కావున ప్రస్తుతం పెరుగుతున్న ధరలు తాత్కాలికమేనని వ్యాపారులు భావిస్తున్నారు. ఒకవేళ ధరల ఒరవడి ఇలాగే కొనసాగినట్లయితే ప్రభుత్వం కొనుగోలు చేసిన సరుకు విక్రయించగలదు. దీనిని దృష్టిలో పెట్టుకొని పప్పు మిల్లర్లు తమ అవసరానికి అనుగుణంగానే సరుకు కొనుగోలు చేస్తున్నారు. గత వారం దిల్లీ లారెన్స్ రోడ్లో 85-90 వాహనాల శనగల రాబడిపై రాజస్తాన్ శనగలు రూ. 4850, మధ్య ప్రదేశ్ సరుకు రూ.4775 మరియు ముంబైలో టాంజానియా శనగలు రూ. 150 పెరిగి రూ.4500-4500, సూడాన్ కాబూలి శనగలు రూ. 5750-5850 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారం అయింది. ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు, ఒంగోలులో జెజె శనగలు రూ. 5000, ఒంగోలులో రూ. 4700 మరియు కాక్-2 కాబూలి శనగలు రూ. 6900, డాలర్ శనగలు రూ. 9800, ఆంధ్ర ప్రాంతపు శనగలు ఈరోడ్ డెలివరి రూ.100 పెరిగి రూ.5500, కర్ణాటక సరుకు రూ.5500-5550, మహారాష్ట్ర ప్రాంతం సరుకు మీడియం  ట్యూటికోరిన్ ఓడరేవు వద్ద టాంజానియా సరుకు రూ. 4850-1900 ధరతో వ్యాపారమైంది. లాతూర్ ప్రాంతపు పప్పు సార్టెక్స్ బెంగుళూరు డెలివరి రూ. 5700-5800, అకోలా సరుకు రూ. 5400, లాతూర్లో అన్నిగిరి శనగలు రూ. 4800- 4980, అకోలాలో సాదా సరుకు రూ. 4775-4800, జాల్నాలో రూ. 4400-4525, జల్గాంప్లో చాపా శనగలు రూ. 4575-4700 ప్రతి క్వింటాలు ధరతో పూర్, జోధ్పూర్, వ్యాపారమైంది. రాజస్తాన్లోని కేక్, కిషనఢ్, సవాయి మాధవ్ సుమేరుర్ ప్రాంతాల మార్కెట్ లో రూ. 4400-4550, జైపూర్లో శనగలు రు". 4825-4850 ధరతో వ్యాపారమైంది. మధ్య ప్రదేశ్లోని ఇండోర్లో శనగలు రూ. 4725-4750, డాలర్ శనగలు రూ.8500-9500, కాబూలి శనగలు 40-42. కౌంట్ రూ. 10,600, 42-44 కౌంట్ రూ. 10,400, 44-48 కౌంట్ రూ. 10,200, 58-60 కౌంట్ రూ. 8900, 60-62 కౌంట్ రూ. 8800, 62-64 కౌంట్ రూ. ఉత్తరప్రదేశ్లోని లలిత్పూర్లో రూ.4400-4415, మహోబాలో రూ.4200-4400 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.




సిరిశనగ 



గత వారం అపరాల ధరల ప్రభావంతో సిరిశనగకు మద్దతు లభించినందున ధర ప్రతి క్వింటాలుకు రూ. 50-75 వృద్ధి చెందింది. మధ్యప్రదేశ్లోని కలిలో ప్రతి రోజు 800-1000 బస్తాలు సిరిశనగ రాబడిపై రూ. 5750-6750, అశోక్ నగర్లో 500-600 బస్తాలు రూ. 6600-6650, జబల్పూర్లో 400-500 బస్తాలు రూ. 5500-6525, కట్నిలో నాణ్యమైన సరుకు రూ.300 ఇండోర్లో రూ. 6900-6850, ఉత్తరప్రదేశ్లోని మహోబాలో రూ. 6300–6100, లలిత్ ్పూర్లో 800-1000 బస్తాలు రూ.6500-6900, బహజోయి, వజీర్ గంజ్ ప్రాంతాలలో రూ. 6300-6500, కాన్పూర్లో ఉత్తరప్రదేశ్ సరుకు రూ. 7200, మధ్యప్రదేశ్ సరుకు రూ.7175, బరేలిలో చిన్న సరుకు రు. 7500, దోడ్డు సరుకు రూ. 7325 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. గత ఏడాది మాదిరిగా ఈసారి కూడా నవంబర్ లో మంచి వర్షాలు కురిసినట్లయితే వచ్చే సంవత్సరం రబీ సీజన్ సేద్యం భారీగా విస్తరించగలదని వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. ఎప్పటి మాదిరిగానే ఈసారి రబీ సీజన్సిరిశనగ కోసం మద్దతు ధర ప్రతి క్వింటాలుకు రూ. 300 పెంచగలదు. ఎందుకనగా,అపరాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉండడమే ఇందుకు నిదర్శనం. ముంబైలో కెనడా నుండి దిగుమతి అయిన సిరిశనగ కంటైనర్లో రూ.7250, ఆస్ట్రేలియా సరుకు రూ. 7350, ముంద్రా ఓడ రేవు వద్ద రూ. 6750-6850, కోలకతాలో కెనడా సిరిశనగ రూ.7050, ఆస్ట్రేలియా సరుకు 157150, దిల్లీలో కెనడా సరుకు రూ.7050-7075 మరియు మధ్యప్రదేశ్ కు రూ. 7275 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog