అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన మినుముల ధరలు

   

వ్యవసాయ మంత్రిత్వ శాఖ వారి వివరాల ప్రకారం జూలై 1 వరకు దేశంలో అపరాల విస్తీర్ణం గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే 26.23 ల.హె. నుండి పెరిగి 28.06 లక్షల హెక్టార్లకు చేరింది. ఇందులో మినుము పంట విస్తీర్ణం 3.79 ల.హె. నుండి తగ్గి 3.45 ల.హె.లకు చేరింది. గత ఏడాది ఆలస్యంగా పంట విత్తడం వలన పంట కోతల సమయంలో వర్షాలు కురవడంతో సరుకు నాణ్యత లోపించి తద్వారా రైతులకు తక్కువ ధర లభించింది. దీనితో కర్ణాటక, మహారాష్ట్ర రెత్తులు సోయాబీన్, పత్తి పంటల సాగుకు మొగ్గుచూపడంతో మినుము పంట విస్తీర్ణం తగ్గినందున ఉత్పత్తి తగ్గే అవకాశాలు ఉన్నాయి. దీనితో ప్రస్తుతం ధరలు పెరుగుతున్నాయి. కొత్త సీజన్ ప్రారంభం వరకు మరో రూ.700-800 వృద్ధి చెందే అంచనా కలదు.


లాతూరు, నాందేడ్, బీదర్, గుల్బర్గా ప్రాంతాలలో విస్తీర్ణం నామమాత్రంగా ఉంది. ప్రస్తుతం పంట విత్తే సమయం కూడా దాటిపోయింది. రబీ సీజన్ కోసం ఆంధ్ర, తమిళనాడులలో ఉత్పత్తి మెరుగ్గా ఉన్నప్పటికీ, మహారాష్ట్రతో పాటు అనేక రాష్ట్రాలలో సరుకు డ్యామేజ్ కావడంతో దక్షిణ భారతం కోసం రబీ సీజన్ సరుకు అమ్మకాలు అధికంగా ఉన్నాయి. దీనితో రైతులు సరుకు అమ్మకానికి తెస్తున్నారు. కేవలం పెద్ద రైతుల వద్దనే సరుకు నిల్వలు ఉన్నాయి. కొత్త సీజన్ కోసం మరింత సమయం ఉన్నందున గత వారం ధర రూ. 800-900 పెరిగింది.. కేంద్ర ప్రభుత్వం బఫర్ నిల్వల కోసం మయన్మార్ నుండి మినుములు కొనుగోలు చేసే అవకాశం ఉన్నందున అంతర్జాతీయ విపణిలో మినుములు ఎస్క్యూ 50 డాలర్లు పెరిగి 1070 డాలర్లు, ఎఫ్ఎక్యూ 970 డాలర్లు ప్రతి టన్ను సి అండ్ ఎఫ్ ప్రతిపాదించడంతో, 

ముంబైలో ఎఫ్ఎక్యూ కొత్త సరుకు పెరిగి రూ.7350, చెన్నైలో ఎఫ్ఎక్యూ రూ.7325, ఎస్యూ రూ. 8325, దిల్లీలో ఎస్ క్యూ రూ.300, ఎఫ్ఎ క్యూ రూ. 7450 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. 

మధ్యప్రదేశ్లోని జబల్పూర్ ప్రాంతపు కొత్త గ్రెవిటీ క్లీన్ మినుములు వెన్నె డెలివరి రూ.200 పెరిగి రూ.8250, ఆంధ్ర ప్రాంతపు పాలిష్ సరుకు రూ.8200, సాదా రూ. 8000 మరియు

 గుజరాత్లోని బిరావల్ ప్రాంతపు కొత్త దేశీ 1 కిలో మట్టి కండీషన్ సరుకు త్రిచీ, సేలం, దిండిగల్, విరుద్నగర్ ప్రాంతాల డెలి వరి రూ. 8500 ధరతో వ్యాపారమైంది.

 మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో దినసరి 5-6 వేల బస్తాల రాబడి పెరూ,5500-7150, బసోదాలో 700-800 బస్తాలు రూ. 1000-6500, నీమచ్లో 200-300 బస్తాలు రూ. 4000-8000, ఇండోర్లో రూ. 7000-7300 ధరతో నాణ్యతానుసారం వ్యాపారమైంది.

 తమిళనాడులోని విల్లుపురం, దిండివనం, విరుధచలం,, కోవిల్ పట్టి, శంక రన్కోవిల్ ప్రాంతాలలో దినసరి 800-1000 బస్తాల రాబడిపై రూ. 6700-7725 ధరతో వ్యాపారమైంది. 

ఆంధ్రప్రదేశ్లోని క్రిష్ణా జిల్లా స్థానిక మార్కెట్లలో పాలిష్ మినుములు రూ. 7800, సాదా రూ. 7500, నంద్యాల, ప్రొద్దుటూరు, కడపలో పాలిష్ సరుకు రూ.7600, ఆన్- పాలిష్ రూ. 7400, విజయవాడలో గుండు మినుములు నాణ్యమైన సరుకు రూ. 12,100, పప్పు రూ. 10,100, మీడియంరూ. 8800-10,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

 మహారాష్ట్రలోని అకోలాలో రూ. 6300, మోగర్ రకం రూ.9200-9300, బోల్డ్ రకం రూ. 9900–10,000, జల్గాంవ్లో మధ్య ప్రదేశ్ సరుకు రూ. 6850, మహారాష్ట్ర సరుకు రూ. 7200 ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog